CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍀🌿📖🌟 మనకెందుకు దేవుని వాక్యమే శ్రేష్టమైన ఆశీర్వాదం? 🌟🍀🌿📖

మన జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక భద్రత, సంతృప్తి కోసం పరితపిస్తు వుంటారు. కొందరు సంపదను ఆశతో ఆశగా ఉంచుకుంటారు; మరికొందరు భవనాలను, సౌకర్యాలను, మరికొందరు తమ బంధాలను, వారు చేసిన దానధర్మాల ద్వారా వచ్చిన పుణ్యాన్నే తమ సంతృప్తిగా భావిస్తారు. ఇవన్నీ ఈ లోకపు తాత్కాలిక ఆనందాలు మాత్రమే.

అబ్రాహాము వలె మనం కూడా ఈ భూమిపై పరవాసులం. మనకు నిజమైన స్థలం,శాశ్వతంగా నిలిచే స్థలం, దేవుడు నిర్మించిన శాశ్వత పరలోక పట్టణం. మన ఆత్మకు ఈ నిజం తెలుసు కానీ మనం చాలా సార్లు ఈ లోకపు సుఖావంతమైన జీవితానికి,కోరికలకు లోబడి, మన గమ్యాన్ని మరిచిపోతు ఉంటాము.

📖 1. దేవుని వాక్యము — శాశ్వత గమ్యానికి దారి చూపే దిక్సూచి,

అబ్రాహాము తన జీవితం అంత గుడారాలలో గడిపాడు. ఎందుకంటే అతను ఈ లోకంలో శాశ్వత నివాసం ఆశించలేదు. అతని చూపు దేవుడు నిర్మించిన పునాదులు గల పట్టణం మీదే నిలిచింది హెబ్రీయులకు 11:10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.

ఇప్పటికీ, మనం కూడా ఇదే పాఠం నేర్చుకోవాలి ఈ లోకపు సౌకర్యాలు, భద్రతలు, పేరు ప్రతిష్ఠ— అంత కూడ తాత్కాలికమే. దేవుని వాక్యమే మనకు పరలోకపు సత్యాన్ని, ఆ శాశ్వత గమ్యాన్ని చూపిస్తుంది. ఈ వాక్యమే ఈ లోకపు చీకటి మార్గాలలో మన ఆత్మకు వెలుగు.

కీర్తనలు 119:105 (నూన్‌) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.

📖 2. దేవుని వాక్యము — విశ్వాసాన్ని బలపరచే పునాది,

అబ్రాహాము వాగ్ధాన దేశంలో నివసిస్తూ గుడారాలలో జీవించగలిగాడు, ఎందుకంటే అతనికి దేవుని వాక్కు ద్వార వచ్చిన వాగ్దానం ఉంది. అదే వాక్యము అతని విశ్వాసానికి బలమిచ్చింది. మనకు కూడా ఎన్నో గందరగోళమైన సమస్యలు, కష్టాలు ఎదురైనా, మన విశ్వాసం దేవునిలో, దేవుని యందు స్థిరంగా నిలవడానికి, దేవుని వాక్యమే ఆత్మీయముగా శక్తిని ఉజ్జీవాన్ని మనకు ఇస్తుంది. రోమీయులకు 10:17

కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.

📖 3. దేవుని వాక్యము — తాత్కాలికమైన ఆశల నుండి శాశ్వతమైన ఆశలకు దారి

ఈ లోకపు సుఖాలు, సంపదలు, స్థలాలు— అన్ని కూడ కొంతకాలము వరకు మాత్రమే నిలుస్తాయి. ఇవి అన్ని కూడ మన మరణంతో శాశ్వతముగా వదిలిపెట్ట వలసినవే. కానీ దేవుని వాక్యము మన చూపును ఆత్మీయ సంపదలపై, శాశ్వత పట్టణం పై నిలిపేలా చేస్తుంది. మన దృష్టిని ఈ లోకపు తాత్కాలిక కోరికల నుండి దూరం చేసి, దేవుని రాజ్యంపై స్థిరపరుస్తుంది. మత్తయి 6:19-20

భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోక మందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెట యైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.

📖 4. దేవుని వాక్యము — ఆత్మకు శ్రేష్ఠమైన సంతోషాన్ని ఇచ్చేది,

తాత్కాలిక మైన ఈ లోక సంబంధమైన సుఖాలు సౌఖ్యం ఆనందాలు సంతోషాలు కొంతకాలమే మనకు ఆనందాన్ని ఇస్తాయి. కాని దేవుని వాక్యము మన ఆత్మకు శాశ్వత సంతోషాన్ని, ఆత్మీయమైన శాంతి సమాధానమును మన హృదయానికి నెమ్మదిని ప్రసాదిస్తుంది. అది మన హృదయాన్ని సత్యమార్గంలో నడుపుతుంది నిలుపుతుంది.

యోహాను 17:17 సత్యమందు( మూలభాషలో-సత్యమువలన) వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.

📖 5. దేవుని వాక్యము — శాశ్వత ఆశ మరియు సత్య మార్గం

దేవుని వాక్యము మన ఆత్మకు అమూల్యమైన సంపద. అది మనలో శ్రేష్ఠమైన ఆశయాలను నింపుతుంది. ఈ లోకపు తాత్కాలిక ఆశలు కన్నా, శాశ్వతమైన ఆశపై మన చూపును నిలిపే వరం మనకు దేవుని వాక్యమే అవుతుంది. ఈ వాక్యం, మన ఆత్మను మోసాలకు, వంచనలకు, భ్రమలకు బలి కాకుండా కాపాడుతుంది. మోసపూరిత తర్కాలు, లోకబుద్ధి వంచనలకు బలి కాకుండా సత్య మార్గంలో నడిపించే దారి చూపిస్తుంది.

ఇది కేవలం జ్ఞానాన్ని ఇవ్వదు; మన హృదయాన్ని దేవుని సన్నిధి వైపు ఆకర్షించే ఆత్మీయ స్ఫూర్తిని అందిస్తుంది. ఇది మన ఆత్మను దేవుని మార్గంలో స్థిరపరుస్తుంది. దేవుని వాక్యము మనకు ఒక జ్యోతి వలె ఉంటుంది — చీకటి మధ్య వెలుగునిచ్చి, నడిచే దారిని చూపిస్తుంది.

మన జీవిత పయనంలో భ్రమపరిచే భావనలు, తాత్కాలిక ఆకర్షణలు ఎదురైనా, దేవుని వాక్యమే మనకు నిజమైన మార్గదర్శకము. మన ఆత్మను పరిశుద్ధ పరుస్తూ, మన ఆత్మీయ గమ్యానికి మన నడకను పటిష్టం చేస్తు ముందుకు నడిపించే శక్తి ఈ వాక్యములో దాగి ఉంది.

విశ్వాస జీవితం అనేది గుడారాల జీవితం.

ఏందుకు? ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు.

మన శాశ్వత గమ్యం పరలోక పట్టణం.

దేవుని వాక్యమే ఆ దిశలో మన పాదాలను నడిపించే దిక్సూచి. "దేవుని వాక్యమే మన పాదాలను శాశ్వత గమ్యానికి నడిపించే దిక్సూచి. అది సత్యాన్ని చూపించే వెలుగు, ఆత్మకు శ్రేష్ఠమైన ఆశీర్వాదం."

నీవు నడుస్తున్న దారికి దేవుని వాక్యమే మార్గదర్శకముగా ఉందా!

లోకపు తాత్కాలిక ఆశల కన్నా నీవు శాశ్వతమైన ఆశను పట్టుకున్నావా?

నీ హృదయం దేవుని సన్నిధికి ఆకర్షింపబడుతుందా?

ఎస్తేర్ క్రైసోలైట్

28-3-2025

🌿🍀🌿📖🌿🍀🌿