2025 Messages
🌿🍀🌿📖🌿🍀🌿
🌿 మన స్వభావాన్ని మనమే మార్చుకోగలమా?🌿
పరిశుద్ధ గ్రంథమును మనము చదివిన తర్వాత మన స్వభావాన్ని మన గుణాలను మనము మార్చుకోగలమా ? ఇది అసాధ్యం ఎందుకంటే— మన శక్తితో మన స్వభావాన్ని మన గుణాలను మార్చడం అసాధ్యం? "యిర్మియా 13:23
కూషుదేశస్ధుడు తన చర్మమును మార్చు కొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును."
మన పాపస్వభావాన్ని మనం మన శక్తితో మార్చలేము. మన స్వశక్తితో మన పాపస్వభావాన్ని మార్చటం అసాధ్యం. "దేవుని వాక్యమే, ఆయన శక్తి ద్వారానే మన స్వభావం మారుతుంది."
🌿 దేవుని వాక్యమే మనలను మార్చుతుంది
దేవుని వాక్యం జీవమై యున్నది, ఆది శక్తివంతమైనది, హెబ్రీయులకు 4:12
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.
🌿 దేవుని వాక్యం మన హృదయాన్ని, ఆలోచనలను, మనసును, మన స్వభావాన్ని మన గుణాలను మొత్తం మార్చి నూతనమైనదిగా మార్చి క్రోత్తగా నిర్మిస్తుంది.🌿
రోమీ 12:2
మీరు ఈ లోక( లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.
యెహేజ్కేలు 36:26-27
నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.
🌿 వాక్యమై యున్న దేవుని ఆత్మ మానవుని హృదయంలో వుండి దేవుని కట్టడల ననుసరించు వారినిగాను దేవుని విధులను గైకొను వారినిగాను చేస్తుంది.🌿
దేవుని వాక్యం చదివేటప్పుడు పరిశుద్ధాత్మ మనలో పనిచేసి మన స్వభావాన్ని క్రొత్తదిగా చేస్తుందా!.
🌿 ఆవును ••• యిది మనకు అసాధ్యమే కానీ! ఆత్మయు జీవమునై యున్న దేవుని వాక్యానికి సాధ్యంకానిది ఏదీ లేదు ఖచ్చితంగా! ఎందుకంటే ప్రకటన గ్రంథం 19:13 మరియు" దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి యున్నది."యోహాను 1:1 ఆదియందు వాక్య ముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. యోహాను 1:4 ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.
దేవుని వాక్యం జీవించుచున్నది, ఆది మనలో శక్తిగా పనిచేస్తుంది 1థెస్సలొనికయులకు 2:13
ఆ హేతువు చేతను, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.
"మనకు అసాధ్యమైనది దేవుని వాక్యానికి సాధ్యం అవుతుంది, ఎందుకంటే వాక్యమే దేవుని శక్తి (హెబ్రీయులకు 4:12), వాక్యమే మన అంతరంగంలో దేవుని గురించి తెలుసుకునే ఆత్మీయ అనుభవానికి వెలుగు, ప్రకాశం 2కోరింథీయులకు 4:6
గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించు కొనుటలేదు గాని, క్రీస్తుయేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. వాక్యమే దేవుని స్వరూపం (యోహాను 1:1)."
దేవుని వాక్యం మన హృదయాన్ని మార్చి, మన పాత స్వభావాన్ని క్రొత్తదిగా చేయగలదు.
మనకు అసాధ్యమైనది దేవుని వాక్యానికి సాధ్యం అవుతుంది, ఎందుకంటే వాక్యమే దేవుని శక్తి, అంతరంగంలో దేవుని గురించి తెలుసుకునే అనుభవమే,దేవుని స్వరూపము.మన అంతరంగంలో ఉన్న ఈ దేవుని స్వరూపమే మనలో నుండి జీవధారలను బయటకు తీసుకొని వస్తుంది మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసి ప్రయాణిస్తు ఉన్నప్పుడు జీవం కలిగిన ఈ ఆత్మలో నుండి జీవధారలు బయటకు వస్తాయి.
"దేవుని వాక్యం మన హృదయాన్ని మార్చి, మన పాత స్వభావాన్ని కొత్తదిగా చేయగలదు (హెబ్రీయులకు 4:12). మనకు అసాధ్యమైనది దేవుని వాక్యానికి సాధ్యం అవుతుంది, ఎందుకంటే వాక్యమే దేవుని శక్తి (హెబ్రీయులకు 4:12), వాక్యమే అంతరంగంలో దేవుని గురించి తెలుసుకునే ఆత్మీయ అనుభవం (2 కొరింథీయులకు 4:6), వాక్యమే దేవుని స్వరూపం (యోహాను 1:1). మన అంతరంగంలో ఉన్న ఈ దేవుని స్వరూపమే మనలో నుండి జీవధారలను జీవింపచేసే దేవుని వాక్యమును ప్రవహింప చేస్తుంది (యోహాను 7:38). మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, జీవం కలిగిన ఆత్మలో నుండి జీవజల ప్రవాహములు బయటకు ప్రవహిస్తాయి."
ఎస్తేర్ క్రైసో లైట్
25-6-2025