2025 Messages
🍀🌿 📖🌿🍀
దేవుని ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ – నూతన దశకు సిద్ధమవుదాం !
ద్వితీయోపదేశకాండము 1:1 మనకు ఏమి తెలియజేస్తుంది
ద్వితియోపదేశకాండము 1:1
యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగా నున్న ఆరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పినమాటలు ఇవే.పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు,దీజాహాబను అనే ప్రదేశాలు వారి ప్రయాణంలో దేవుడు ఎలా నడిపించాడో, వారు ఏవిధంగా ప్రవర్తించారో గుర్తుచేయడానికి మోషే పేర్కొన్న ప్రాంతాలు ఇవి,
1. మొదటిగా ఇది ఒక ప్రారంభ వాక్యం
ఈ వచనం ద్వితీయోపదేశకాండానికి ఈ గ్రంథమునకు ఒక పరిచయంగా నిలుస్తుందా !
అవును, ద్వితీయోపదేశకాండము 1:1 వచనం ఈ గ్రంథానికి ఒక పరిచయ వచనంగా నిలుస్తుంది.
ఎందుకంటే ఈ ప్రజల ప్రయాణం – వారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడెక్కడ ఉన్నారనే విషయాలను ఈ వచనం వివరిస్తుంది.
ఈ ఉపదేశానికి గల ముఖ్య లక్ష్యం ఎమిటంటే
భవిష్యత్తులో ప్రజలు నడవబోయే మార్గమును దేవుని వాక్యము ఆజ్ఞలు ద్వారా ప్రజలకు తెలియజేయడమె ఈ గ్రంథము యొక్క ప్రధాన అంశం,
2. రెండవదిగా ఈ వచనం ద్వితీయోపదేశకాండానికి పరిచయంగా నిలుస్తుంది అయితే మోషే ఈ మాటలను ఇశ్రాయేలీయులకు ఎందుకు చెప్తున్నాడు?
. గతాన్ని జ్ఞాపకం చేసుకోవడం – ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం, దేవుని నాయకత్వం,దేవుడు ఎలా నడిపించాడో, వారు ఎలా ప్రవర్తించారో
వారి అనుభవాలు అన్ని కూడ గుర్తు చేయబడుతున్నాయి. కొత్త తరానికి దేవుని ఆజ్ఞలను దేవుని నిబంధనలను మరోసారి గుర్తు చేస్తున్నాడు.
. భవిష్యత్తు జీవితానికి సిద్ధమవ్వడం – వాగ్దాన దేశంలో ఎలా జీవించాలి, దేవుని నిబంధనలను ఎలా పాటించాలనే విషయం ను ఆజ్ఞల ద్వారా వారికి తెలియజేయడం ఇవ్వడం.
3.మూడవదిగా ఈ ఉపదేశం వెనుక దేవుని ఉద్దేశ్యం ఎమిటి ! దేవుడు ఎందుకు మోషే ద్వారా చెప్పిస్తున్నాడు,
యొర్దాను అద్దరిన అరణ్యము – అంటే, ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందు యొర్దాను నది దాటి వెళ్లాల్సిన ప్రదేశంలో ఉన్నారు. ఇది ఒక మళ్లీ చూచుకొనే సమయంగా ఉంది.ఇశ్రాయేలు ప్రజల ప్రయాణానికి మళ్లీ చూచుకునే సమయం – గత 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం తర్వాత, వారు దేవుని వాగ్దానాన్ని ఎలా నమ్మాలి, ఎలా నడవాలో నేర్చుకోవాలి.
పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును ఇవన్నీ ఈశ్రాయేలు ప్రజలు ప్రయానించిన ప్రదేశాలు.
ఆరాబా – ఇది యొర్దాను నది సమీపంలోని ఒక బీడు భూమి. ప్రదేశాలు గుర్తుచేయబడటం అనేది–ఈ పేర్లు ఇవన్నీ వారి ప్రయాణంలో జరిగిన అనుభవాలను సంఘటనలను గుర్తు చేస్తున్నాయి. అంటే దేవుని మార్గంలో మనం ఎంత నమ్మకంగా ఉండాలి? అనే ప్రశ్న మన ముందుకు వస్తుంది.
4. నాలుగవదిగా ద్వితియోపదేశకాండము 1:5
యొర్దాను ఇవతలనున్న మోయాబు దేశమున మోషే యీ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెనుఈ వచనం మోషే తన జీవితాంతంలో చివరిగా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న సందర్భాన్ని సూచిస్తుంది. అంటే యిది మోషే తన చివరి ఉపదేశాన్ని ఇవ్వడానికి ప్రారంభిస్తున్న సందర్భం.
ఈ వాక్యంలో మోషే మోయాబు దేశ సమీపంలో ఇశ్రాయేలీయులకు దేవుని ధర్మశాస్త్రాన్ని వివరించడం ప్రారంభించినట్లు చెప్పబడింది. ఇది ద్వితీయోపదేశకాండము మొత్తం ఎలా రూపుదిద్దుకుందో చూపించే కీలకమైన వాక్యం.
మోయాబు దేశానికి సమీపంగా మోషే ఇచ్చిన ఉపదేశాలు ఇవే,
ఈ వచనం మోషే తన జీవితాంతంలో చివరిగా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న సందర్భాన్ని సూచిస్తుంది. గతం గురించిన ఆత్మపరిశీలన ఎంత ముఖ్యమో ఇది మనకు ఇది బోధిస్తుంది. వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందు దేవుడు ఇచ్చిన ఉపదేశాలను వారు గమనించాలి.
మన జీవితంలో కూడ ఒక నూతనమైన దశకు వెళ్లే ముందు, దేవుడు చెప్పిన మాటలను మరళ మరళ మనము పరిశీలించుకోవాలి గుర్తు చేసుకుంటూ ఉండాలి వీలైతే దేవునిలోకి మనము వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు దేవునిలో మన ఆత్మ సంబంధమైన ప్రయాణం ఎలా వచ్చిందో మనము పరిశీలించుకోవాటం అన్నది మనకి ఎంతో క్షేమాన్ని ఇస్తుంది విశ్వాసమును బలపరుస్తుంది.
గతంలో దేవుడు మన కోసం ఏమి చేశాడో అన్న విషయాన్ని మనము మరిచిపోకూడదు. దేవుడు ఇచ్చిన అవకాశం ముందుంది – వారు కనాను దేశపు అంచున ఉన్నారు. మన జీవితంలో కూడా దేవుడు వాక్యము ద్వారా వాగ్దానాల ద్వారా ఆశీర్వాద ద్వారాలను తెరిచినప్పుడు, మనం భయపడకుండా ముందుకు వెళ్లాలి.
ఎస్తేర్ క్రైసోలైట్
24-3-2025