2025 Messages
🍀🍀🌿 📖🌿🍀🍀
అవిధేయత ఆలస్యం చేస్తుంది విధేయత ఆశీర్వాదాలను ఇస్తుంది
ద్వితియోపదేశకాండము 1:2
హోరేబునుండి శేయీరు మన్నెపుమార్గముగా కాదేషు బర్నేయవరకు పదకొండు దినముల ప్రయాణము.
దేవుడు ఇశ్రాయేలీయులను హోరేబు నుండి కాదేషు బర్నేయ వరకు పదకొండు రోజుల్లోనే తీసుకెళ్లగలిగేవాడు. కాని, వారి అవిధేయత కారణంగా ఆ ప్రయాణం నలభై ఏళ్లుగా మారిపోయింది. ఇది మన ఆత్మీయ జీవితానికి ఒక గొప్ప పాఠం అయి వుంది.
దేవుడు మన జీవితంలో ఒక మార్గాన్ని తెరిచినప్పుడు, ఆ మార్గం తక్కువ సమయంలోనే మనలను ఆశీర్వాద స్థితికి చేర్చగలదు. కాని, మన విశ్వాసం లోపించితే, మన విధేయత లోపించితే, మన ప్రయాణం అనవసరంగా పొడవవుతుంది. మన భయాలు, సందేహాలు, అవిధేయతలు—వీటివల్ల దేవుని ఆలోచనలకు విరోధముగా మన హృదయం నిలిచిపోతుంది. అందువలన దేవుని ఆశీర్వాదాలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంటుంది.
మన దృష్టి లోకసంబంధమైన ఆశీర్వాదాలవైపు కాకుండా, శాశ్వతమైన ఆత్మీయ ఆశీర్వాదాలవైపు ఉండాలి. ఈ లోక ఆశీర్వాదాలు (ఆస్తి, ఆరోగ్యం, పదవులు) అస్థిరమైనవే. ఇవి ఒక రోజు ఉంటాయి, మరొక రోజు లేవు. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు—విశ్వాసం, నిరంతర ఆత్మీయ శక్తి, పరిశుద్ధత ద్వారా కలిగే ఫలితాలు—ఇవి మాత్రమే శాశ్వతమైనవి. ఇవి పరలోక రాజ్యం వరకు మనతో వస్తాయి పరలోక రాజ్యంలో మనతో ఉంటాయి.
దేవుని ఆశీర్వాదాల కోసం మనం ఈ ఆత్మీయ ఫలాలనే ఆశీంచాలి. ఇవే నిజమైన సంపద, నిజమైన సంతృప్తి.
నేను ప్రధానంగా ఏ ఆశీర్వాదాల కోసం ప్రార్థిస్తున్నాను—లోకసంబంధమా, లేక ఆత్మీయమా?
నేను నా విశ్వాసం, విధేయత ద్వారా దేవుని ఆశీర్వాదాల మార్గాన్ని వేగవంతం చేస్తున్నానా లేక ఆలస్యపరుస్తున్నానా?
మీరు ఏ ప్రయాణంలో ఉన్నారు? ఆత్మ సంబంధమైన ప్రయాణంలోనే మీరు ఉన్నారా ?
దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తున్నారా? లేకపోతే, మీదైన ఆలోచనలతో ఆ మార్గాన్ని దూరం చేస్తున్నారా? దేవుని మాటను హృదయపూర్వకంగా అనుసరిస్తే, ఆయన నిశ్చయించిన ఆశీర్వాదాలు ఆలస్యం కాకుండా మన జీవితంలో నెరవేరుతాయి. ఆశీర్వాదాల పునాది కొరకు మన మార్గమును మన దిశను నిర్ణయించే నడిపించే దేవుని మాటకు దేవుని వాక్యమునకు దేవుని ఆజ్ఞకు మనము విధేయతను చూపుదాం.
ఎస్తేర్ క్రైసోలైట్
24-3-2025