2025 Messages
🍀🍀🌿 📖🌿🍀🍀
యుద్ధ శూరుడైన యెహోవా మీ కోసం ముందే వెళ్లాడు !
ద్వితియోపదేశకాండము 1:3
హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహో నును అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయీలో హతము చేసిన తరువాత,
ద్వితియోపదేశకాండము 1:3
ఈ వచనంలో మోషే ఇశ్రాయేలీయులకు వారికి జరిగిన విశేషమైన సంఘటనలను గుర్తుచేస్తున్నాడు. అమోరీయుల రాజు సీహోను, బాషాను రాజు ఓగు—ఈ ఇద్దరూ బలమైన రాజులు, కానీ దేవుడు తన ప్రజల కోసం వారిని ఓడించాడు. ఇది మన జీవితంలో దేవుని శక్తిని చూపించే గొప్ప ఉదాహరణ.
మన ముందు కనిపించే కొండలాంటి సమస్యలు మన శత్రువులాగా అనిపించే పరిస్థితులను మన స్వంత బలంతో వాటిని ఎదుర్కోలేం. కానీ యుద్ధ శూరుడైన యెహోవా దేవుడు మన కోసం మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఇశ్రాయేలీయులు నమ్మి ముందుకు నడిచినప్పుడు దేవుడు వారికి విజయమును ఇచ్చాడు,
మన జీవితాల్లో కూడా కొన్ని కఠినమైన యుద్ధాలు ఎదురవుతాయి, కానీ దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోకుండా మనము దేవునిపై ఆధారపడి నడిచినప్పుడు, దేవుడు మన శత్రువులను మనలను కృంగదీసే నశింపజేసే శత్రువు లాంటి పరిస్థితులను సమస్యలను మన ముందు నుంచి తరిమి వేస్తాడు.
మీరు ఎదుర్కొంటున్న సీహోనులు మరియు ఓగులు ఎవరు? అవి ఆర్థిక సమస్యలా? ఆరోగ్య పరమైన కష్టమా? కుటుంబ సమస్యలా? శత్రు భయమా ? మరి అది ఏదైనా కావచ్చు. ఇవి ఎంతటి గొప్పవైనా, దేవుడు వాటికంటే గొప్పవాడు!
మీరు దేవునిపై ఆధారపడితే దేవుని ప్రార్థిస్తే దేవుని ఆశ్రయిస్తే దేవుడు మీ తరఫున నిలబడి యుద్ధం చేయగలడు, మీకు విజయాన్ని ఇవ్వగలడు మీరు భయపడక, దేవుని మాటను విశ్వసించి ముందుకు సాగితే, దేవుడే సమస్యలైనా మీ శత్రువులను మీ ముందే ఓడిస్తాడు!
ఎస్తేర్ క్రైసోలైట్
24-3-2025