CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍀🍀🌿 📖🌿🍀🍀

దేవుని పాఠాలను గుర్తుంచుకోండి!

ద్వితియోపదేశకాండము 1:4

నలుబదియవ సంవ త్సరములో పదకొండవ నెల మొదటి తేదిని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తన కాజ్ఞా పించినదంతయు వారితో చెప్పెను.

నలభైయవ సంవత్సరాల ప్రయాణం చివరికి, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి సమీపంలో ఉన్నారు. ఇప్పుడు మోషే, యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నింటిని వారికి మరలా బోధిస్తున్నాడు. ఇది కేవలం పాత విషయాలను పునరావృతం చేయడం మాత్రమే కాదు; భవిష్యత్తును నిర్మించేందుకు వారికి అత్యవసరమైన ఆత్మీయ సందేశం యిది.

దేవుడు మన జీవితంలో చేసే ప్రతి పని ఒక క్రమాన్ని కలిగి ఉంటుంది. మన ఆత్మ సంబంధమైన ప్రయాణమైనా, శరీర సంబంధమైన ప్రయాణమైనా, అవి ఒక్కొక్కటీ తన తన గమ్యస్థానానికి చేరుకోవడం మాత్రమే కాదు; ఆ ప్రయాణంలో దేవుడు మనకు నేర్పిన పాఠాలను గుర్తుంచుకోవడం మనము జ్ఞాపకం చేసుకోవడం కూడా ఎంతో అవసరం.

ఇశ్రాయేలీయులు తమ గతాన్ని గుర్తుచేసుకుని, దేవుని ఆజ్ఞలను పాటించాల్సిన సమయమిది. అందుకే మోషే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు.

మీరు కొత్త దశలోకి ప్రవేశించడానికి సిద్ధమా?

నూతన పరిచర్య, నూతన బాధ్యతల్ని స్వీకరిస్తున్నారా? అయితే, గతంలో దేవుడు మీకు నేర్పిన పాఠాలను మరచిపోకండి!

దేవుని మాటలపై విశ్వాసం ఉంచి, భవిష్యత్తులో ఆయన చిత్తాన్ని నెరవేర్చేందుకు సిద్ధంగా మనం ఉండాలి. మన ప్రయాణం న్యాయంగా, దేవుని అజ్ఞాను అనుసరించే దేవునికి ఇష్టంగా సాగుతుందా? అన్నది గమనించుకోవడం మనకు అత్యవసరం.

ఎస్తేర్ క్రైసోలైట్

24-3-2025