2025 Messages
🍀🍀🌿 📖🌿🍀🍀
🌿 శరీర స్వస్థతకు దేవుని వాగ్దాన శక్తి 🌿
1. మన శరీరము దేవుని మందిరము.
దేవుడు మన శరీరాన్ని తన నివాసానికి మందిరంగా ఎంచుకున్నాడు, అని వాక్యాలు స్పష్టంగా చెబుతున్నాయి.మన శరీరాన్ని దేవుడు అత్యంత విలువైనదిగా చూశాడు. యేసు తన రక్తధారలతో, తన శరీరంలో పొందిన గాయాలతో, మనకోసం సిలువ శిక్షను మోసి మన శరీరానికి రక్షణను, స్వస్థతను ఇచ్చాడు.
1కోరింథీయులకు 6:19-20
మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,
విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
మన శరీరము పరిశుద్ధాత్మకు ఆలయము అని మనము నమ్ముతున్నప్పుడు, అది కేవలం ఒక సూత్రం కాదు, అది ఆత్మీయ సత్యం. దేవుని పరిశుద్ధాత్మ మన శరీరంలో నివసిస్తున్నాడు కాబట్టి, పరిశుద్ధత, శక్తి, ఆరోగ్యం అనేవి మన శరీరానికి సహజ లక్షణాలు కావాలి. యేసు క్రీస్తు ప్రభువారి గాయముల చేత మనం స్వస్థపరచ బడినాము.
యెషయా 53:5
మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.
1పేతురు 2:24
మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.మన శరీరం యేసు సిలువలో గెలిచిన ఆ విజయాన్ని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి. మనలో ఏ వ్యాధి, ఏ బలహీనత, ఏ రోగం నిలబడలేవు. ఎందుకంటే మన శరీరం అనేది సమృద్ధిగా జీవించడానికి యేసు ఇచ్చిన జీవవాక్యానికి ఆధారం.
"నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను."నిర్గమ 15:26
ఈ వాగ్దానం మన శరీరానికి రక్షణ గోడలా నిలుస్తుంది. మనకు వచ్చిన ప్రతి రోగాన్ని, మనము నిరాకరించి, యేసు గాయములచేత వచ్చిన స్వస్థతను మనము ప్రకటించాలి. మనము చేసిన ఆ ప్రార్థన ప్రకటన వలన,విశ్వాసంతో కూడిన మన హృదయంలో ఉన్న ఆటువంటి నిశ్చయత,ద్వారా మన శరీరంలో దేవుని జీవం కొత్తగా ఉత్సాహంగా ప్రవహిస్తుంది.
🌿🙏 "మన శరీరంలో రోగాలు రావాలని ఏ శక్తి ప్రయత్నించిన, ఈ దేవుని వాక్యాలు ఆ శక్తికి ఎదురు నిలచి మనకు రక్షణ కలిగిస్తాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువపై మరణించి నప్పుడు మనకు వచ్చిన, వస్తున్నా, రాబోతున్నా, రోగాలకు సంభదించిన శిక్షను, ఆయన భరించేసాడు. యేసు పొందిన శిక్ష ద్వారా యిక మన శరీరము మీద ఆ రోగాలకు అధికారం లేదు,వాటి అధికారానికి ముగింపు వచ్చిందని,ముగింపు పడినది, అని ఈ వాక్యాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి,ఈ వర్తమానం ద్వారా మరొకసారి మనకు గుర్తుచేస్తున్నాయి."
🌿 ఇది చదువుతున్నవారికి,ఈ వర్తమానంలో ఉన్న దేవుని వాక్యము ఆత్మీయ ధైర్యం ఇచ్చును గాక .
యోహాను 10:10 దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
యోహాను 10:10 లో యేసు చెబుతున్నాడు:
"నేను వచ్చినది వారు జీవమును పొందుటకు, సమృద్ధిగా పొందుటకు."ఇక్కడ యేసు ఇచ్చిన జీవము అంటే కేవలం శ్వాస కాదు — అది శక్తి, ఆరోగ్యం, సమృద్ధి, శాంతి, సంతృప్తి కలిగించే జీవము. మన శరీరంలో రోగం ఉండటానికి స్థలం ఉండదు, ఎందుకంటే యేసు సిలువలో ఆ రోగాన్ని జయించాడు కాబట్టి.
2. ఈ సమృద్ధి జీవము అంటే,
దేవుడు మనకు ఇచ్చే సంపూర్ణమైన, పరిపూర్ణమైన జీవితం,అది కేవలం ధనం లేదా భౌతిక సౌఖ్యాలకు మాత్రమే అది పరిమితం కాదు, ఆత్మ, మనసు, శరీరం అన్నింటికీ శాంతి, ఆనందం, ఆరోగ్యం, సంతృప్తి ఇచ్చే జీవితం. యోహాను 10:10 లో యేసు చెప్పాడు. "నేను వచ్చితిని, అ జీవమును సంపూర్ణముగా,సమృద్ధిగా పొందునట్లు"
ఇక్కడ సంపూర్ణ,సమృద్ధి, జీవము అంటే ,
దేవుని చిత్తానికి అనుకులముగా, లోకములోని పరిస్థితుల మధ్య, సమస్యల మధ్య, దేవుని దీవెనలతో నిండివున్న, కలిగి ఉన్న జీవితం.
సమృద్ధి జీవము అనేది దేవుడు ఇచ్చే సంతోషం, శాంతి, ఆశీర్వాదం, ఆరోగ్యం, ఆత్మీయ విజయాలతో నిండిన జీవితం. ఇది బయట పరిస్థితుల మీద ఆధారపడదు. ఇది దేవుని కృప ద్వార మనలో ఉండే కలిగే లోపలి జీవన శక్తి! ఈ లోకంలో పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్న,శ్రమలు కష్టాలు మనతోనే ప్రయాణిస్తూ ఉన్న, మనలో ఒక ధైర్యం, ఒక నెమ్మది, ఒక శాంతి, ఒక సమాధానం, కలిగిన దేనికి, దేని వైపు చూసి,భయపడని, కలవరపడని హృదయం,మనలో ఉండటం మనం గమనిస్తాం అంటే అప్పుడు మనము గుర్తించాలి, దేవుని సమృద్ధి జీవం నాలో ఉంది అని, అలా కాకుండా పరిస్థితులను బట్టి, భయపడుతున్నాము అంటే, మనలో సమృద్ధి జీవం లేదు, వాక్యమై ఉన్న దేవుని సమృద్ధి అయినా జీవాన్ని ఇచ్చే ఆ దేవుని వాక్యాన్ని మనం,కలిగి లేము విశ్వసించటం లేదు అని అర్థం.
దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునే దేవుడు కాబట్టి, ప్రతి రోగంలో ప్రతి సమస్యలో దేవుని వాక్యాన్ని బట్టి వాగ్దానాలను బట్టి, దేవున్ని మనం విశ్వాసంతో ప్రార్థించాలి, మనకు స్వస్థతను సమృద్ధి అయిన జీవాన్ని విజయాన్ని ఇచ్చే, ఆ వాక్యాన్ని,మనము మన పూర్ణ హృదయంతో విశ్వసించాలి.
🌿 ప్రతి ఉదయం మీరు లేవగానే ఈ వాగ్దానాన్ని పలకండి 🌿
"యేసు గాయములచేత నేను స్వస్థపరచబడినాను.
నా శరీరము పరిశుద్ధమైన దేవుని మందిరము.
ఇందులో వ్యాధికి స్థానం లేదు. నా శరీరము దేవుని సమృద్ధి జీవముతో నిండి ఉంది."
🌿 ప్రశ్న:
"నా శరీరం దేవుని మందిరమని నమ్ముతున్నప్పుడు,
నేను ఆ శరీరాన్ని పరిశుద్ధతలో, విశ్వాసంలో, ధైర్యంలో నిలుపుకుంటున్నానా?
ఈ రోజు నా శరీరానికి సమృద్ధి జీవం ప్రకటించాను అని నేనుజ్ఞాపకం చేసుకున్నానా?"
🙏 చిన్న ప్రార్థన 🙏
ప్రియమైన మా పరలోకపు తండ్రి,
మీ వాక్యములో వున్న శక్తి నన్ను బలపరుస్తుంది, దేవా.యేసు గాయములచేత నాకు లభించిన స్వస్థతను నిత్యం జ్ఞాపకం చేసుకొని, నా శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోనే శక్తిని నాకు కలిగించండి. ఏ వ్యాధి నా శరీరాన్ని తాకలేనట్టు, తాకిన అది నా శరీరంలో ఉండలేనట్లు, మీ రక్షణ అనే గోడలతో నన్ను కాపాడు తండ్రి. ఈ ప్రార్థన యేసు నామములో అడుగు చున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 🌿✨
ఎస్తేర్ క్రైసోలైట్
26-6-2025