2025 Messages
🍀🍀🌿 📖🌿🍀🍀
ద్వితీయోపదేశకాండము - మోషే యొక్క చివరి ధర్మబోధ
ద్వితీయోపదేశకాండము ఈ గ్రంథము యొక్క ప్రత్యేకత,
దేవుని పది ఆజ్ఞలు తొలిసారిగా నిర్గమకాండము 20వ అధ్యాయంలో ప్రకటించబడ్డాయి. ద్వితీయోపదేశకాండము 5 వ అధ్యాయంలో మోషే వీటిని మరోసారి ఇశ్రాయేలీయులకు ప్రకటించాడు. ఈ ఆజ్ఞలు మరోసారి ప్రకటించబడినందున, ద్వితీయోపదేశకాండమును 'ద్వితీయమైన ధర్మశాస్త్రం' (Second Law) అని పిలుస్తారు.
ఓ ఇశ్రాయేలు వినుము --- అనే ఒక ప్రాముఖ్యమైన దేవుని ఆజ్ఞలను గురించిన మోషే ద్వార దేవుడు బోధించిన బోధ ఇక్కడ మనకు కనబడుతుంది.
మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు మరోసారి ఆజ్ఞలను గుర్తు చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి అసలు ఈ గ్రంథమును క్రైస్తవులు చదవటం వలన వారికి ఎటువంటి ప్రయోజనము కలుగుతుంది అన్నటువంటి ఈ విషయాలను ఇప్పుడు మనము తెలుసుకుందాము.
ద్వితీయోపదేశకాండము (Deuteronomy) దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రధానంగా మనకు ఏమి తెలియజేస్తుంది అని అంటే ఈ గ్రంథమును నేను చదువుట ద్వారా నేను కలిగి ఉన్న అనుభవం బట్టి నేను గ్రహించిన నేను పొందిన జ్ఞానమును బట్టి ఈ గ్రంథమును గురించి నేను చెప్పాలి అని అంటే ఇది ప్రాముఖ్యముగా,
1. దేవుని ప్రజల ప్రత్యేకత 🍃
మొదటిగా దేవుని ప్రజలముగా ఈ లోకంలో ఎటువంటి ప్రత్యేకతను మనము కలిగి ఉండాలి–అన్న జ్ఞానమును ఈ గ్రంథము మనకు తెలియజేస్తుంది దేవుని ప్రజలు ఈ లోకంలోని ఇతర జనాంగాలకంటే భిన్నంగా ఉండాలని, వారు దేవుని ఆజ్ఞలను పాటించాలి, దేవునితో చేసిన దేవునికి మనకు మధ్య ఉన్న నిబంధనను గౌరవించాలి అనే సూత్రాలను ప్రాముఖ్యముగా ఇది మనకు చాల స్పష్టంగా వివరముగా తెలియజేస్తుంది.
అందుకనే ప్రతి ఒక్కరూ దేవుడు చెప్పిన ప్రత్యేకతలో ఉంటున్నానా లేదా అని మనము తెలుసుకోవాలి అని అంటే కచ్చితంగా అప్పుడప్పుడు ఈ గ్రంథమును మనము చదవాల్సిందే,
2. మోషే దేవుని ఆజ్ఞలను మరలా చెప్పాడు.
రెండవదిగా ఇందులో ఈ గ్రంథంలో మనకు కనపడే ఇంకొక విషయం ఏమిటంటే మోషే ఇశ్రాయేలీయులకు దేవుని ఆజ్ఞలను మరోసారి వివరంగా ఇందులో బోధించాడు.
ద్వితీయోపదేశకాండము అనే పేరును మనము అర్థం చేసుకోవాలంటే, ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆజ్ఞలను మరల వాటిని మరి యొకసారి ప్రజలకు తెలియజేసే రెండవ ప్రకటన (Second Law) అని దీనిని గురించి మనకు తెలుస్తుంది. ఇవి కొత్త ఆజ్ఞలు కాకుండా, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలను వాటినే మరల మరోసారి గుర్తు చేస్తూ, వివరణ ఇచ్చే గ్రంధం యిది అని దీనిని గురించి మనం చెప్పవచ్చు.
ద్వితీయోపదేశకాండము అంటే రెండోసారి చెప్పబడిన ఆజ్ఞలు అని మనకు తెలియగానే మనకు వెంటనే ఒక ప్రశ్న అనేది వస్తుంది దేవుడు తన ప్రజలకు మొదట ఆజ్ఞలు అనేవి ఎక్కడ ఇచ్చాడు అని ? –
మొదట దేవుడు ఆజ్ఞలు ఎక్కడ ఇచ్చాడు?
దేవుడు తన ప్రజలకు మొదటి సారి ఆజ్ఞలను సినాయీ పర్వతం (Mount Sinai) వద్ద ఇచ్చాడు. ఈ విషయం నిర్గమకాండము 19-వఅధ్యాయం నుండి 24 అధ్యాయం వరకు వివరించబడింది.
నిర్గమకాండము 20 వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలను (Ten Commandments) ప్రకటించాడు.
ప్రజలు దేవుని ఆజ్ఞలకు అంగీకారం తెలిపిన నిబంధన విషయము అంత కూడ నిర్గమకాండము 24:3-8 వ వచనాల వరకు వ్రాయబడిన విషయమను మనం చూడవచ్చు.
నిర్గమకాండము 24:3
మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరుయెహోవా చెప్పినమాట లన్నిటి ప్రకారము చేసెదమని యేక శబ్దముతో ఉత్తరమిచ్చిరి.నిర్గమ24:7
అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి.నిర్గమ 24:8
అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించి ఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను.
లేవీయకాండము, సంఖ్యాకాండములో దేవుని ఆజ్ఞలు, నిబంధనలు అనేవి మరి ఎక్కువైన విస్తరణతో వివరించబడినాయి
ద్వితీయోపదేశకాండము 5 వ అధ్యాయంలో 10 ఆజ్ఞలను మళ్లీ ప్రకటించడము మనకు కనపడుతుంది ఇప్పుడు మరల ద్వితీయోప దేశకాండములో ఈ ఆజ్ఞలు ఎందుకు చెప్పబడినాయి మోషే మరల వీటిని ఎందుకు గుర్తు చేస్తున్నాడు అని అంటే,
ఇవి కొత్త తరం కోసం మరల చెప్పబడినవి
సినాయీ పర్వతం వద్ద ఇచ్చిన ఆజ్ఞలు అప్పటి పెద్దల కోసం, కానీ వారు అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగారు.
ఇప్పుడు కానాను దేశంలో ప్రవేశించబోయే కొత్త తరం కోసం మోషే మరల ఈ ఆజ్ఞలను ప్రకటిస్తున్నాడు. పాత తరంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కొంతమంది దేవుని ఆజ్ఞలను పాటించక అరణ్యంలో నశించిపోయారు అయితే కొత్త తరంలో కూడా దేవుని ఆజ్ఞలను పాటించని అటువంటి వారుఎవరైనా ఉంటారేమో అని వారి కొరకు మోషే ఈ ఆజ్ఞలను మరలా ప్రకటిస్తూ వచ్చాడు.
ఏ విషయాలు అయినా ఇవి ప్రాముఖ్యమైనవి అని మనకు అనిపించినప్పుడు వాటిని మనము పదేపదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము ఇతరులకు కూడా వాటిని అలాగే తెలియజేస్తు ఉంటాము కద ! అలానే దేవుడు కూడా ఈ గ్రంథంలో కొత్తతరమైన పాత తరమైన తన ప్రజలకు మరొక సారి మోషే ద్వారా జ్ఞాపకం చేసి ఉండవచ్చు ద్వితి 5:2
మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధనచేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను.
మోషే కాలంలో ఇశ్రాయేలీయుల మొదటి తరం (ఐగుప్తునుండి వచ్చిన వారు) వాగ్దాన భూమిలో ప్రవేశించే ముందు అరణ్యంలో మరణించారు (సంఖ్యాకాండము 14:29-35).
కొత్తతరానికి దేవుని వాగ్దాన భూమిలో ప్రవేశించే ముందు దేవుని చట్టాలు నియమాలు అనేవి మరల బోధించబడడం అత్యవసరమైన విషయం.దీని ఉద్దేశం ఏమిటంటే ఈ కొత్త తరం దేవుని నిబంధనను స్వయంగా వినాలి, అర్థం చేసుకోవాలి, పాటించాలి.
దేవుని నిబంధన వ్యక్తిగతమైందే: మన పితరులతోనే కాదు, మనతోనే అనే మాట ద్వారా దేవుడు తన ప్రజలతో సజీవమైన, ప్రత్యక్షమైన సంబంధాన్ని ఉంచుతాడని ఇక్కడ మనకు స్పష్టం అవుతుంది. ఈ విధంగా, ద్వితీయోపదేశకాండము దేవుని నిబంధనను కొత్త తరానికి మరల స్థిరపరిచే గ్రంథంగా నిలిచింది.
3. వాగ్దానదేశంలో ప్రవేశించే ముందు హెచ్చరికలు.
మూడవ విషయం ఏమిటంటే ఇశ్రాయేలీయులు కనాను దేశంలో దేవుడిచ్చిన వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి ముందు, తమ ప్రవర్తన తమ నడవడిక ఎలా ఉండాలో మోషే వారికి మరల గుర్తు చేస్తున్నాడు. పరమ క నాను అయినటువంటి పరలోకమునకు వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మన మీ లోకంలో ఎటువంటి ప్రత్యేకతలో ఉంటున్నాము అన్నది గ్రహించాలి అని అంటే మనము వాక్యానుసారమైన దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామా లేదా అన్నదాని గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఈ ద్వితియోపదేశ కాండమును మరలా మరలా చదువుతూ మనలను మనము పరీక్షించుకుంటూ ఉండాలి.
4. ద్వితియపదేశకాండ 6:5 ఇది అన్నిటి కంటే గొప్ప ఆజ్ఞ
ఈ గ్రంథంలో మనకు కనపడే నాలుగవ విషయం ఏమిటంటే దేవుని పట్ల మనము కలిగి ఉండాల్సిన ప్రేమను మరియు విధేయతను ఇది మనకు తెలియజేస్తుంది– దేవుని ప్రేమను మనము అనుభవించాలంటే ఆయన ఆజ్ఞలకు విధేయత చూపాలని ఇది ఈ గ్రంథము మనకు బోధిస్తుంది.
ఓ ఇశ్రాయేలు వినుము! – ఆని దేవుడు మోషే ద్వారా బోధించిన ప్రధానమైన బోధ లో దేవుడు మనకు తెలియజేసిన ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే ద్వితియోప దేశకాండము 6 అధ్యాయము :5 వ వచనములో నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను. ఇది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఇది యేసు క్రీస్తు ప్రభువారు స్వయంగా అన్నిటికంటే మొదటిది మరియు గొప్పది అయినా ఆజ్ఞ అని స్పష్టంగా చెప్పారు.
మత్తయి 22: 35 -- 40 వరకు ఉన్న వచనాలలో యిది మనకు కనబడుతుంది
వారిలో ఒక ధర్మశాస్త్రో పదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకాయననీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్ర మంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను.
ఇవి రెండు కలిపితే సంపూర్ణ ధర్మశాస్త్రం, ప్రవక్తలు చెప్పిన బోధనల యొక్క సారాంశం అవుతుంది.
దీని ప్రాముఖ్యత ఏమిటి? ఇది ఆజ్ఞ లన్నిటి కంటే అత్యున్నతమైన ఆజ్ఞగా ఎందుకు ఉన్నదంటే ధర్మశాస్త్రపు మొత్తం సారాంశం అంత కూడ దేవున్ని ప్రేమించడంలోనే ఉందండి కాబట్టి
మనం ఏదైనా చేయడానికి మూలం ప్రేమే – కద ! మనము చేసే సేవలు, మన నీతి వంతమైన జీవితం దేవుని ఆజ్ఞలు అయిన దేవుని వాక్యమును అయినా ఆఖరికి దేవుని మనము వెంబడించాలి అని అన్నా ఇవి—అన్నీ కూడా మనము దేవుని ప్రేమిస్తేనే జరుగుతాయి కాబట్టి ఆజ్ఞ రూపంలో వాక్యము రూపంలో ఉన్నటువంటి ప్రేమ స్వరూపి అయినటువంటి దేవున్ని ఖాళీ లేకుండా మన హృదయాలలో నింపుకుందాం.
5. ఈ గ్రంథంలో మనకు కనబడే ఐదవ విషయం ఏమిటంటే మనము కలిగి ఉండాల్సిన ప్రార్థనా జీవితం గురించి మరియు దేవునిపై ఆధారపడి జీవించాలి అన్న విషయం గురించి ఇది మనకు తెలియ జేయడమే కాకుండా మనము – భయపడకుండా దేవునిపై నమ్మకం ఉంచి ముందుకు కోనసాగాలని ఈ గ్రంథము మనకు తెలియజేస్తుంది.
ద్వితీయోపదేశకాండము మనకు నేర్పే మూడు 3 ముఖ్యమైన విషయాలు: ఎమిటి ?
1. దేవుని ప్రజల ముగా మనము ప్రత్యేకంగా ఉండాలి.
2. దేవుని ఆజ్ఞలను మర్చిపోకుండా మనము పాటించాలి.
3. పూర్ణహృదయంతో మనము దేవుని ప్రేమించాలి.
ఈ గ్రంథమును మనము చదువుట ద్వారా దేవుని ప్రజలముగా మనము మన ప్రత్యేకతలు ఎంటి ? అనే వాటి విషయాలను గురించి మనము గ్రహించటమె కాకుండా మన పూర్ణ హృదయముతో మన సృష్టికర్త అయిన దేవుని ప్రేమిద్దాం.
ఓ ఇశ్రాయేలు వినుము! అని మోషే ద్వారా దేవుడు బయలు పరిచిన ఆజ్ఞలు కలిగిన ఈ గ్రంథమును మీరు చదువుతారు కదా ! ఈ గ్రంథము మోషే చివరి సందేశం అయినందున, ఇది మనకు దేవుని ఆలోచనలను చివరిసారిగా మోషే ద్వారా పదేపదే మనకు గుర్తుచేసేలా ఉంటుంది. కాబట్టి, మనము కూడా మన జీవితంలో దేవుని వాక్యాన్ని పదేపదే చదివే వారముగా మనము ఏ ప్రత్యేకతలో జీవిస్తూ ఉన్నామొ గ్రహించే వారముగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరచును గాక ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
24-3-2025