CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍀🍀🌿 📖🌿🍀🍀

ఆదాము బాధ్యతా లోపం: హవ్వను తప్పు పట్టడమేనా?

హవ్వ అనే పేరు జీవము లేదా జీవదాత్రి అనే అర్థము కలిగి ఉంది. ఆమెను ఆదాముకు సహా కారినిగా దేవుడు సృష్టించాడు .

ఆదికాండము 2:18

మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయ మును వానికొరకు చేయుదునను కొనెను.

అయితే, మానవజాతిలో పాపము అన్నది ప్రవేశించడానికి కారణము హవ్వనా ? లేక ఇది ఆదాము యొక్క బాధ్యతా లోపమా?

1. ఆదాము తన బాధ్యతను విస్మరించాడు

ఆదాము హవ్వ కంటే ముందే సృష్టించబడ్డాడు. దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షం గురించి ఆజ్ఞను మొదట ఆదాముకే దేవుడు ఇచ్చాడు ఆదికాండము 2:17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.

ఆదాముకి ఏదేను వనాన్ని కావలి కాయడం, సేద్యం చేయడం వంటి బాధ్యతలు అప్పగించబడ్డాయి

ఆదికాండము 2:15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.

హవ్వను దేవుడు ఆదాముకు సహాకారిగా ఇచ్చినా, ఏదేను తోటకు కాపరిగా ఆదామునే నియమించాడు. కానీ, హవ్వ మోసపోయినప్పుడు ఆదాము తన బాధ్యతను పాటించకుండా, తన భార్య మాటను విని దేవుని మాటను అవహేళన చేశాడు.

.ఆదికాండము 3:17

ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;

2 . హవ్వ మోసపోయింది, కానీ ఆదాము చేతికొచ్చినదాన్ని అలోచించకుండా స్వీకరించాడు తిన్నాడు, ఈ విషయమును పరిశుద్ధ గ్రంధం కూడా మనకు స్పష్టంగా చెబుతుంది: హవ్వను సాతాను మోసగించాడు (1తిమోతికి 2:14).

ఆదాము మోసపోలేదు; అతను సంతోషంగా ఆజ్ఞాతిక్రమం అన్నదానిని నెరవేర్చాడు (ఆదికాండము 3:6). ఈ సత్య వాక్యల ప్రకారం, హవ్వను మాత్రమే నిందించడం అన్యాయంగా ఉంటుంది.మోసపోయినందుకే హవ్వను నిందించడం తగదు , కానీ దేవుని స్పష్టమైన ఆజ్ఞను తెలిసి నేరుగా దాన్ని అతిక్రమించడం మరింత తీవ్రమైన తప్పుగా పరిగనించ బడుతుంది.

3. ఆత్మసంబంధమైన నాయకత్వం అన్నది లోపించినప్పుడు, దేవుని వాక్యానికి విరుద్ధంగా నడచినప్పుడు, పెద్ద నష్టమే జరుగుతుంది

దేవుడు నియమించిన దాని ప్రకారం, కుటుంబ నాయకత్వం అన్నది ఆదాముకు అప్పగించబడింది. పరిశుద్ధ గ్రంథము ప్రకారం, ఏ వ్యక్తి అయినా తన కుటుంబాన్ని పాలించ లేకపోతే, దేవుని ప్రజలను ఎలా పరిపాలిస్తాడు? 1తిమోతికి 3:5

ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయిన యెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?

దేవుడు ఇచ్చిన బాధ్యతను విస్మరించి, తాను దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పటికీ, నేరాన్ని హవ్వ మీద నెట్టివేయడం మన సమాజంలో స్త్రీలపై అనవసరమైన నింద బరువు వేయడమే కాకుండా, నిజమైన ఆత్మసంబంధమైన స్పష్టతను కోల్పోవటానికి యిది ప్రధాన కారణం అవుతుంది.

4. దేవుని వాక్యానికి విధేయతే అసలైన విజయము.

శోధన ఏ రూపంలో మన ముందుకు వచ్చినా, అది మనకు ప్రియమైన వ్యక్తుల నుంచే వచ్చినా సరే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఆది ఉంటే దాన్ని తిరస్కరించాలి. ఆదాము హవ్వ మాట విని నాశనమైనాడు.

ఆదికాండము 3:17

దేవుని వాక్యంలో నిలబడినవారే దేవునిలో స్థిరపరచబడుతూ, నిజమైన విజయమును పొందగలుగుతారు, హవ్వను మోసపోయినందుకు హవ్వను నిందించడం కన్నా, ఆదాము తన బాధ్యతను విస్మరించడమే ప్రధాన కారణం అని గ్రహించాలి.

దేవుడు మనకు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో దానిని తూచ తప్పకుండ మనము పాటించాలి.

ఎవరు మోసపోయారు ఎవరు తప్పు చేశారనేది కాకుండా, దేవుని వాక్యానికి విధేయత చూపించే వారే నిజమైన విజయాన్ని పొందుతారు.

ఆదికాండము 2:15-17, 3:6, 3:17;

1తిమోతికి 2:14, 3:2, 3:5

ఎస్తేర్ క్రైసోలైట్

22-3-2025