2025 Messages
హాము గుడారములు vs షేము వంశము
కీర్తనలు 78:51
ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని
హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను.. “హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను” అన్నది కీర్తన 78:51 లో ఉన్న వాక్యం.
ఇక్కడ "హాము గుడారములు" అనే ముఖ్యమైన పదాన్ని మనము గమనిస్తే
ఐగుప్తులోని జ్యేష్ఠులకు హాము గుడారములలో నున్న బలప్రారంభమైన ప్రథమ సంతానమునకు సంబంధం ఏమిటి అన్న ప్రశ్న మనకు వస్తుంది
హాము అంటే ఎవరు?
హాము (Ham) — ఇతను నోవాహు కుమారుల్లో ఒకడు ఆదికాండము 10:1
ఇది నోవహు కుమారుడగు షేము హాము
యాపెతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.
ఆదికాండము 10:6
హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.
హాము సంతానం నాలుగు ప్రధాన దేశాలను స్థాపించింది:
1. కూషు (ఇథియోపియా ప్రాంతం)
2. మిస్రాయిము (ఐగుప్తు)
3. పూతు
4. కానాను
మిస్రాయిము అనగా ఐగుప్తు ప్రజలు.
అంటే — హాము సంతానములోనికి ఐగుప్తీయులు వస్తారు.
ఆందుకే కీర్తన 78:51 లో ఐగుప్తు ప్రధమ సంతానము గూర్చి వ్రాసిన దగ్గర “హాము గుడారములు” అని వ్రాయబడినది
ఈ వాక్యంలో
ఐగుప్తులోని జ్యేష్ఠుల నందరిని
హాము గుడారములలో నున్న బలప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను.. అని వ్రాయబడ్డది
“హాము గుడారములు” అంటే హాము సంతతిగా ఉన్న ఐగుప్తు జనాంగాల నివాసాలు
ఇది ఐగుప్తును ఒక నెగేటివ్ వారసత్వంతో కూడిన జనముగా సూచించడానికి ఉపయోగించారు.
ఎందుకంటే హాము సంతతిలో కానాను శాపగ్రస్తుడు (ఆదికాండము 9:25), మరియు హాము యొక్క వారసత్వం దేవుని ప్రజల కంటే భిన్నంగా ఉండేది.
హాము = నోవాహు కుమారుడు
హాము సంతానంలో మిస్రాయిము = ఐగుప్తు
కాబట్టి "హాము గుడారములు" అంటే ఐగుప్తీయుల నివాసాలు
కీర్తన 78:51 లో దీన్ని చెప్పడం ద్వారా, ఐగుప్తుపై జరిగిన తీర్పును బైబిలు వంశవృక్షంతో జతచేస్తోంది
హాము సంతానము ఐగుప్తీయులైతే మరి ఇశ్రాయేలీయులు ఎవరి సంతానము షేము సంతానమా ! లేక యాపెతు సంతానమా !
ఇశ్రాయేలీయుల వంశవృక్షం:
నోవాహు → షేము → ఎబెరు → తేరహు → అబ్రాహాము → ఇష్కాకు → యాకోబు (ఇశ్రాయేలు)
యాకోబుకు 12 మంది కుమారులు (ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు)
అంటే, ఇశ్రాయేలీయులు నోవాహు కుమారుడు “షేము” సంతానము.
ఇశ్రాయేలీయులు = షేము సంతానం (Semites)
ఐగుప్తీయులు = హాము సంతానం
కాబట్టి, ఇశ్రాయేలీయులు మరియు ఐగుప్తీయులు వంశపరంగా రెండు భిన్నమైన మార్గాల్లో నోవాహాకు సంబంధించి విడిపోయారు.
ఐగుప్తులో ఒకే తండ్రి కి జన్మించిన రెండు వారసత్వాలు అన్నవి ఉన్నవి ఒకటి ఆశీర్వదించబడిన సంతానము అయితే ఇంకొకటి శాపగ్రస్తమైన సంతానము వీరి ఇరువురిని దేవుడు ప్రత్యేక పరచాలని అనుకున్నప్పుడు ఆ రాత్రి జామున దేవుని సన్నిధి అక్కడికి ఐగుప్తులోనికి దిగినప్పుడు వారు రక్షించబడటానికి పస్కాఅనే దేవుని ఆజ్ఞను ఆచరించిన ప్రజలు రక్షించబడ్డారు పస్కాను ఆచరించని ప్రజల కుటుంబాలలో వారి ప్రథమ సంతానమునకు మరణం అన్నది కలిగింది
హెబ్రీయులకు 11:28
తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమునుబట్టి పస్కాను, రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను.
ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు నోవాహు నుంచి వచ్చిన వారే అయినప్పటికీ తమ ప్రథమ సంతానమును మరణమునకు లోను కాకుండ ఉండటానికి ఇశ్రాయేలీయులు రక్తప్రోక్షణ ఆచారమును ఆచరిస్తే ఐగుప్తీయులు దానిని ఆచరించలేని శాపగ్రస్తమైన స్థితిలో వుండి కీడును నష్టమును తెచ్చుకోన్నారు దేవుని సన్నిధి అనేది ఒకరికి మేలును కలగజేస్తే ఇంకొకరికి కీడును కలగజేసింది
శాపగ్రస్తమైన సంతానమైన ఐగుప్తీయుల ప్రథమ సంతానము దేవుడు అంగీకరించలేదు కాని "నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను" అని ప్రార్థించిన యాకోబులో నుంచి వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానమును దేవుడు అంగీకరించాడు వారికి జీవాన్ని ఇచ్చాడు వారిని మరణములో నుంచి జీవములోనికి దాటించాడు.
అందుకనే ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానమును తనకు ప్రతిష్టిత జనముగా చేసుకున్నాడు వీరి ద్వారనే భూలోకంలో ఉన్న సమస్త వంశములన్నియు ప్రజలందరూ ఆశీర్వదించబడటానికి వీరు కారకులుగా మారారు.
నిర్గమకాండము 13:2
ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువులయొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలి చూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము; అది నాదని చెప్పెను.
నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను అని పట్టు వదలకుండా ప్రార్థించిన యాకోబు ప్రార్థన ఇశ్రాయేలీయులకు జీవాన్ని తీసుకుని వచ్చింది. మరణాన్ని దూరం చేసింది దేవునికి ప్రతిష్టమైన జనముగా మార్చింది అంటే ఘానతను వారికి తీసుకు వచ్చింది.
యోహాను 16:24
ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును.

ఎస్తేర్ క్రైసోలైట్
8-5-2025
Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25
Written By: Sis.Esther Chrysolyte
Written On: 8-5-25