2025 Messages
🍀🍀🌿 📖🌿🍀🍀
మార్గమై యున్న దేవుడు మార్గాన్ని చూపిస్తాడు
ఒకసారి మా బంధువుల దగ్గర కొద్ది రోజులు నేను ఉన్నను, ఆ ప్రాంతం అంతా కూడా బాగా చల్లని ప్రదేశం, ఆ చలికి ఆ చల్లదనానికి నాకు విపరీతమైన జలుబు వచ్చేసింది, ఎంత భయంకరంగా వచ్చింది అని అంటే, నేను తల కిందకు దించి పైకి లేపితే నా తల చాలా బరువుగా అనిపించేది, అసలు నేను తల వంచి కిందకు చూడలేక పోయేదాన్ని, ఇప్పుడు ఉన్నట్లు క్యాప్సిల్ తో ఆవిరి పట్టుకుంటే పోయే పరిస్థితి కాదండి అప్పుడు, ఇది ఒక 30 ఇయర్స్ క్రితం జరిగిన సంఘటన.
ఒక రోజు నేను నిద్రిస్తున్న సమయంలో నాకు వచ్చిన కలలో ఒక వృద్ధుడు నా దగ్గరకు వచ్చాడు తన జుట్టు చాలా తెల్లగా నేరసి ఉంది తన చేతిలో ఒక కర్ర ఉంది, అతను నా దగ్గరకు వచ్చి ఒకే ఒక మాట అన్నాడు * అమ్మ నీ చెవులలో దూది పెట్టుకో అని * అంతే తాను ఆ కలలో మాయమై పోయాడు, నాకు వెంటనే మెలకువ వచ్చింది. ఏంటి ఇలా వచ్చింది అని అనుకున్నాను నాకు అప్పటి వరకు చెవులలో కాటన్ పెట్టుకుంటే జలుబు తగ్గుతుంది జలుబు రాదు అన్న విషయమే తెలియదు. నాకు ఎవరూ కూడా చెప్పలేదు, నేను నిద్ర నుంచి లేచిన తర్వాత ఇంట్లో ఉన్న కాటన్ ను వెతికి నా చెవులలో ఉంచి మరలా నేను నిద్రపోయాను, తెల్లవారే సరికి నా తల బరువంత పోయింది. ఆ సాయంత్రాని కల్లా నా జలుబు చాలా తగ్గిపోయింది.
అప్పటినుంచి ఇప్పటివరకు చలిగాలి వస్తుందంటే నేను ముందుగానే నా చెవులలో కాటన్ ని ఉంచుతాను, ఈ విషయం తెలిసిన వారికి ఇది ఒక గొప్ప విషయం కాదు, కానీ చెవులలో కాటన్ ఉంచితే జలుబు తగ్గుతుంది, అన్న విషయం తెలియని నాలాంటి వాళ్లకు, ఆది కల ద్వారా తెలియ పరచబడటం, అది ఇంకా చాలా గొప్ప విషయంగా నాకు అనిపిస్తుంది, మన కష్టాలలో బాధలలో మన ఒంటరి ప్రయాణాలలో మనము ప్రయాణించే మార్గము అది ఇతరులకు కనపడకపోవచ్చు,
ఇతరులకు మనము మన బాధను మన కష్టమును మనకు కలిగిన శ్రమను చెప్పుకోలేక పోవచ్చు కానీ మనల్ని చూస్తున్న మనలను నిర్మించిన దేవునికి సమస్తము మరుగు లేక తేటగా ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది ప్రతి పరిస్థితిలో దేవునిపై మనం అనుకున్నప్పుడు మన ప్రతి భారమును దేవునికి అప్పగించినప్పుడు మన చుట్టూ ఉన్న వారికి ఒక సమస్య గా ఎప్పటికీ మనము ఉండనే ఉండము అలా దేవుడు మనలను ఎప్పుడూ ఉంచడు.
దేవుడు మన అవసరాలను ముందుగా చూస్తాడు.
సామెతలు 29:18
దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు.ధర్మశాస్త్రమును పాటించేవాళ్లు అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించే వాళ్ళు ఎందుకు ధన్యులు అంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవునికి ఇష్టంగా నడిచే దేవునిపై ఆధారపడే వారికి దేవుడు ఎప్పుడు వారికి తోడుగా ఉంటాడు వారిని ఎల్లప్పుడూ నడిపిస్తూనే ఉంటాడు ఇది కూడా దేవుడు మనకిచ్చే ఆశీర్వాదమేనండి,
మన జీవిత ప్రయాణంలో కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండవు. చిన్న విషయమైనా, పెద్ద సమస్యయినా, దేవుడు మనకు తగిన సమయంలో సమస్తము ముందుగా తెలియజేస్తాడు. కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేము, కానీ జీవము అయివున్న దేవుడు మన ప్రతి బాధ నుంచి మనలను తప్పించ గలడు.
ఈ అనుభవం ద్వార మనము నేర్చుకునే ఒక గొప్ప విషయం ఏమిటంటే, దేవుడు మన కంటే ముందుగా అన్ని విషయాలను చూస్తాడు. మనం ఎదుర్కొనే సమస్యకు పరిష్కారం ఆయన దగ్గర ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మనం ఆయనను ఆశ్రయిస్తే,మనము దేవుని పై ఆధారపడితే మనకు అవసరమైన తగిన సమయానికి సరైన జ్ఞానం దేవుని వలన మనకు దొరుకుతుంది.
దేవుడు తన సొంత సమయంలో ప్రతిదానికి ప్రతి సమస్య మనకు పరిష్కారమును చూపుతాడు అందజేస్తాడు.అందుకనే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది కీర్తనలు 32:8 నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.
మన బాధలను ఎవరికైనా చెప్పలేక పోయినా, మన ఒంటరి మార్గాలను ఎవరు చూడలేక పోయినా,మనల్ని ప్రేమించే వారు ఎవరు కూడా ఈ లోకంలో మనకు లేకపోయినా దేవుడు మనలను చూసే వాడు, మన ప్రతి పరిస్థితి దేవుడు చూస్తున్నాడు అన్న విశ్వాసమును మనము ప్రతి సమయంలో కలిగి ఉండాలి, దేవుడు మనకు కలిగిన అవసరతలు అవి చిన్నవైన అవి పెద్దవి అయినా, ఆ సమస్త అవసరాలను ముందుగా గ్రహించి, తగిన సమయంలో తగిన ఉపాయం చూపించగలడు. విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ముందుకు కోన సాగుదాం.
ఎస్తేర్ క్రైసోలైట్
19-3-2025