CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍀🍀🌿 📖🌿🍀🍀

నా జీవితంలో హిత వత్సరము ప్రారంభమైంది! (లూకా 4:19)

నేను యింతకు ముందు సండే రోజున ఒక దైవ జనుని నోటి నుండి జుబ్లి ఆనే పేరును నేను విన్నాను ఆది బైబిల్ పేరు అని ఆనటంతో నాకు యింక అసక్తి కలిగింది పరిశుద్ధ గ్రంథంలో నేను చదివే తెలుగు బైబిల్ లో ఎక్కడ కూడా జూబ్లీ అను పదం లేదు, మోషే వ్రాసిన ద బుక్ ఆఫ్ జూబిలీస్ అన్న పుస్తకాన్ని నేను చదివాను అందులో కూడా జూబ్లీ అంటే సునాద సంవత్సరం అని ఎక్కడ చెప్పబడలేదు.

బుక్ ఆఫ్ జూబిలీస్ (Book of Jubilees), అనేది యిది ఒక ప్రాచీన యూదాయిజం గ్రంథం, దీనిని లిటిల్ జనెసిస్ అని కూడా పిలుస్తారు. ఇది మోషేకు దేవుడు చెప్పినట్లు దీనిని మోషే వ్రాసినట్లు తెలిపే ఒక పుస్తకం ఇందులో బహుశా సృష్టి అనేది ఏర్పడిన నుండి ప్రతి 49 లేదా 50 సంవత్సరాల కాలాన్ని ఒక జూబిలీ గా పేర్కొంటూ వ్రాసిన పుస్తకం ఇది. దీనిని 40 రోజులు దేవుని దగ్గర మోషే ఉన్నప్పుడు దేవుడు తాను చేసిన సృష్టి మొదలు నుండి తెలియజేసిన విషయాలు అని ద బుక్ ఆఫ్ జూబిలిస్ గురించి చెపుతూ ఉంటారు.

జూబిలీ అనే పదానికి అర్థం:

ఈ పుస్తకంలో జూబిలీ అంటే 49 సంవత్సరాల గడువు (7×7 సంవత్సరాలు) తదుపరి 50వ సంవత్సరం జూబిలీ సంవత్సరం అని కొంతమంది అనుకుంటారు. ఇది హిబ్రూ బైబిలు (లేవీయకాండము 25వ అధ్యాయం) లో చెప్పబడిన సునాధ సంవత్సరం (Year of Jubilee) ఆచారంతో సంబంధముంటుంది.

Book of Jubilees లో ప్రత్యేకత:

ఇందులో కాలాన్ని జూబిలీలు గా (శతాబ్దాలలో వారాలుగా) గణించడం జరుగుతుంది. ఉదాహరణకు, ఒక జూబిలీ అంటే 49 సంవత్సరాలు (7×7), వీటిని పుస్తకం కాలగణనలో ఉపయోగించారు. ఇది క్రొత్త సునాధ సంవత్సరం అనే ఆచారాన్ని తెలియజేయదు కానీ, ఆ 49 సంవత్సరాల గడువును ఒక యూనిట్‌గా తీసుకుని కాలగణన చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.

జూబిలీ అనే పదం Book of Jubilees లో ప్రధానంగా కాలగణనకు ఉపయోగించబడుతుంది, కానీ హిబ్రూ బైబిలు లోని సునాధ సంవత్సరం (Jubilee Year in Leviticus) నిబంధనల ఆధారంగా కాదు.

జూబ్లీ అనే పదము తెలుగు బైబుల్లో ఎక్కడ కూడా మనకు కనపడదు ఇ పదము ఇంగ్లీష్ బైబుల్లో మాత్రమే ఉంటుంది ( లేవి 25 : 12-13 ) దీని గురించి తెలుసుకోవాలని నేను నాకు అందుబాటులో ఉన్న ప్రతి దాని నుంచి నేను సమాచారమును గ్రహిస్తూ వచ్చాను జూబ్లీ అంటే సునాద సంవత్సరము అని ఈ సంవత్సరము యొక్క ప్రాముఖ్యతను గురించి నేను చదువుతూ గ్రహిస్తూ ఉన్నప్పుడు దీనిని ఆత్మసంబంధంగా యేసు క్రీస్తు ప్రభువు వారు ఎలా నెరవేర్చారో అన్న విషయమును పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేస్తూ ఉన్నప్పుడు హితవత్సరం యొక్క ప్రాముఖ్యతను నేను గ్రహిస్తూ వచ్చాను.

హితవత్సరం ఆనే ఈ పదము యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈ పదమునకు ఉన్న అర్థం ఏంటో ఇంతకుముందు నేను ఎప్పుడు తెలుసుకోవాలని నాకు అనిపించలేదు దీని అర్థం ఏమిటో నాకు అర్థం అయినాక నా కనిపించింది ఎంత అద్భుతమైన పదం ఇది ఇందులో ఎంత గూఢమైన అర్థం ఉన్నది మన జీవితాలలో మన ఆర్థిక ఇబ్బందుల్లో మన సమస్యలలో మన శ్రమలలో మన కష్టాలలో ఎప్పుడో మన కొరకు దేవుడు ప్రకటించిన హితవత్సరం అనే దేవుని అనుగ్రహ కాలమును మనము సద్వినియోగ పరచుకోలేక దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాలను పొందలేక దేవుని అనుగ్రహ కాలంలో మనము ఉన్నామని మనము జీవిస్తూ ఉన్నామని దానిని గ్రహించలేని విశ్వసించలేని జ్ఞానము లేనివారముగా ఎన్నో మనకు అవసరమైన ఆశీర్వాదాలను మనము కోల్పోతూ వచ్చాము.

ఈ హితవత్సరం అనే పదమునకు అర్థం నాకు తెలిసినప్పుడు ఈ అంశాన్ని నేను గ్రహించినప్పుడు నాకు గుర్తుకు వచ్చినప్పుడల్లా పదేపదే నేను నాకు అవసరమైన దాని విషయంలో ఈ హితవత్సరం అనే దానిని నేను ప్రకటిస్తున్నాను.

మనకు అవసరమైన ఆశీర్వాదాలు విషయాలలో ఈ హితవత్సరం అనే దేవుని అనుగ్రహ కాలమును

దేవుడు ఎప్పుడో దీనిని మన కొరకు ప్రకటించిన దీనిని సద్వినియోగం చేసుకోలేని వారుగా ఏ విషయంలోనైనా మీరు ఉన్నారా అయితే మీకు నష్టం కలిగించే మీకు ఇబ్బంది కలిగించే మిమ్ములను అభివృద్ధిలోనికి రానివ్వని ఎటువంటి పరిస్థితి అయినా దాని విషయంలో మీరు ఈ హితవత్సరమును ప్రకటించడము విశ్వసించటమె కాకుండా దేవుని వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా ఇతరులకు కూడా మనము అందించవలసిన బాధ్యతను మనము కలిగి ఉన్నాము అన్న విషయమును మాత్రం మీరు మర్చిపోకండి.

దేవుడు నాకు 2025 సంవత్సరానికి యెషయా 45:3 వాగ్దానము ద్వారా నా జీవితానికి హిత వత్సరమును ప్రకటించాడు. ఈ వర్తమానం వినే ప్రతి ఒక్కరి జీవితాల్లో, కూడ వారు ఎదుర్కొంటున్న ఆర్థిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన కుటుంబ సంబంధమైన బంధకాలు అన్ని తెగిపోవును గాక ! మీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదము మీకు దొరుకును గాక ఆమెన్.

యెషయా 45:3 లో ఉన్న వాగ్దానమును 2025 సంవత్సరమునకు గాను దేవుడు నాకిచ్చాడు

దానిని నేను న్యూ ఇయర్ రోజున నా చానల్లో పెట్టినప్పుడు మా పిల్లలు ఏమన్నారు అని అంటే ఆ వాగ్దానం నీకు ఇంకా నెరవేరలేదు అప్పుడే ఎందుకు వేరోకలికి నెరవేరును గాక ! అని పెడుతున్నావు అని అన్నారు ఈ సంవత్సరంలో నా జీవితంలో ఆశీర్వాదాలు రావడానికి దేవుడు తన వాక్కు ద్వారా నన్ను అభిషేకించాడు నన్ను అభిషేకించిన దేవుని వాక్కుకు విరోధంగా నన్ను జయించే శక్తి దేనికి లేదు కాబట్టి నా ఛానల్ చూసే వారికి కూడా నేను పొందే ఆశీర్వాదలు పొందాలని వారి కొరకు న్యూ ఇయర్ రోజునే నా వాగ్దానమును ప్రకటించాను.

మీ జీవితంలో మీకు ఎటువంటి సమస్య ఉన్న మీరు భరిస్తున్న మీకు బాధ కలిగిస్తున్న ఆ శ్రమను బట్టి ఆ సమస్యను బట్టి మీరు ఇలా క్రిందున్న వాక్యాలను ఇలా పదే పదే పలకండి.

హిత వత్సరములో నా ప్రకటన:

నా జీవితంలో హిత వత్సరము ప్రారంభమైంది! (లూకా 4:19) దేవుడు ఇంతకు ముందు తన ప్రజల కొరకు ప్రకటించిన సునాధ సంవత్సరం (Jubilee Year), యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా నెరవేరింది. (లేవీయకాండము 25:12-13)

హిత వత్సరము అనుగ్రహ కాలము.

ఈ కాలంలో బంధకాలు తెగిపోవుట, రుణాలు రద్దు చేయబడుట, కుటుంబాలకు విమోచన లభించుట జరుగుతుంది.యేసు ప్రభువు లూకా 4:19లో హిత వత్సరమును ప్రకటించినప్పుడు, నా జీవితానికి విమోచనను ప్రకటించాడు.

నేను పలికే హిత వత్సరము ప్రకటన:

నా బంధకాలు తెగిపోయాయి!

నా ఆర్థిక సమస్యలు తొలగించబడుతున్నాయి!

నా కుటుంబ విమోచన వచ్చేసింది!

హిత వత్సరము నా ఇంటికి ప్రవేశించింది!

వాగ్దానం:

యెహోవా హిత వత్సరమును ప్రకటించుటకును, బంధింపబడినవారికి విముక్తి ప్రకటించుటకును... (యెషయా 61:1-3)

🙏 ప్రార్థన🙏

ప్రభువా, నీవు నన్ను హిత వత్సరమును ప్రకటించుటకు అభిషేకించావు. నా నోటిలో నీవు విమోచన వాక్కులను ఉంచావు. ఈ సంవత్సరంలో నా జీవితంలో, నా కుటుంబంలో, నేను పలికే వాక్కు ద్వారా బంధకాలు తెగిపోవునట్లు నేను ప్రకటిస్తున్నాను.ఈ సంవత్సరంలో నా బంధకాలు తెగిపోవును గాక !నేను ఆశీర్వదించబడుదును గాక!

హిత వత్సరము అనుగ్రహ కాలం ఇప్పుడే ప్రారంభమైంది! యేసు నామంలో...ఆమెన్.

ప్రభువు ఈ సంవత్సరంలో దేవుని అనుగ్రహా కాలమును ప్రకటించుటకు నన్ను ఎన్నుకున్నాడు

ఇప్పుడే నా నోటి ద్వారా హిత వత్సరమును ప్రకటిస్తున్నాను ఈ వాగ్దానములను విశ్వసించే ప్రతి ఒక్కరికీ విమోచన దొరుకును గాక ! ఆమెన్.

ఇది హిత వత్సరమునకు ఆరంభం!

ఈ వాక్యము మీ వినికిడిలో నేడు నెరవేరినది. (లూకా 4:21)

కీర్తనలు 119:130

నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును.

ఎస్తేర్ క్రైసోలైట్

11-3-2025