2025 Messages
🍀🍀🌿 📖🌿🍀🍀
వాక్యమే శాశ్వతమైన బండ
బండపై స్థిరత్వ యిచ్చే జీవితం కోరకు– దేవుని ప్రజలు వాక్యమును మాత్రమే పునాదిగా చేసుకోవాలి,
మత్తయి 7:24,25
కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.
మత్తయి 7:24-25 ప్రకారం, దేవుని వాక్యం అనే బండపై మన జీవితాన్ని నిర్మించాలి. ఎందుకంటే, జీవితంలో తుఫాన్లు, కష్టాలు, ఒడిదుడుకులు మాత్రమే కాదు, సంపద, సౌఖ్యాలు, విజయం, అధికారం వచ్చినప్పుడు కూడా చాలామంది దేవుని వదిలిపెడతారు. ఎందుకంటే వాళ్ల పునాది దేవుని వాక్యం కాదు, కేవలం శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే.
ఉదాహరణకు, కొంతమంది ఉద్యోగం, సంపద, పెళ్లి, దేవునిఆరోగ్యం వంటి ఆశీర్వాదాల కోసం దేవుని దగ్గరికి వస్తారు. అయితే, వారు దేవుని వాక్యాన్ని నిజమైన పునాదిగా చేసుకోకుండా, ఆ ఆశీర్వాదాల కోసం మాత్రమే దేవునిలో ఉంటే—వారు కోరుకున్నవి వచ్చిన తర్వాత దేవుని నుంచి దూరమవుతారు
లేకపోతే సంపద, అధికారం వచ్చినప్పుడు గర్వంతో దేవునిని మరిచిపోతారు కానీ, దేవుని వాక్యాన్ని బండగా చేసుకున్నవారు—ఏ పరిస్థితిలోనైనా నిలబడగలరు శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదు, కాని వారు దేవుని ప్రేమలోనే స్థిరంగా ఉంటారు తుఫాన్లు, పరీక్షలు, లోటులు —ఏదైనా వచ్చినా, నడిపించేది మనలను దేవుని వాక్యమే.
యేసు క్రీస్తు—మన బండ
1కోరింథీయులకు 10:4
అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే. "ఆ బండ క్రీస్తే!" అనే దేవుని వాక్యం కేవలం ఓ బలమైన మాట కాదు, అది మనకు బండవలె నిలిచే యేసుక్రీస్తేప్రభువారు అనే రక్షకుడు! వాక్యమైయున్న దేవునిపై ఆధారపడినవారు మాత్రమే ఇటువంటి తుఫాను లాంటి సంఘటనల ప్రభావానికి గురికారు, ఎందుకంటే వారి పునాది మార్పు చెందనిది.
దేవుని వాక్యం లేకుండా కేవలం ఆశీర్వాదాల కోసం దేవునిని వెతికే జీవితం—
1. ఒడిదుడుకులు వచ్చినప్పుడు పడిపోతుంది 2. ఆశీర్వాదాల కారణంగా దేవునిని వదిలివేస్తుంది 3. అనుకూల పరిస్థితులలోనే దేవునిని అనుసరిస్తుంది
4. సిలువ లేని కారణముగా దేవునికి దూరము అయిపోతుంది.
కానీ, 🌿 🙏 💟
దేవుని వాక్యం అనే బండపై జీవితాన్ని నిర్మించుకునేవారు—
1. దేవుని ప్రేమలో స్థిరంగా ఉంటారు 2. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనే బలాన్ని పొందుతారు
3. ఆశీర్వాదాలకన్నా ఆశీర్వదించువాని (దేవుడిని) ప్రేమిస్తారు
4 . తమ సిలువతో దేవున్ని వెంబడిస్తారు
ఎస్తేర్ క్రైసోలైట్
14-3-2025