2025 Messages
🍀🍀🌿 📖🌿🍀🍀
ఏనాటి కీడు ఆనాటికే చాలును
రేపటిని గురించి భయపడవద్దు!
ఏనాటి కీడు ఆనాటికే చాలును – రేపటిని గురించి భయపడవద్దు! మత్తయి 6:34 రేపటిని గూర్చి, చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.
ఈ వాక్యం మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన పాఠాన్ని బోధిస్తోంది. మనం భవిష్యత్తును గురించి అతిగా ఆందోళన పడటం, రేపటి సమస్యలను గురించి ముందుగానే భయపడటం యిది మన మనస్సుకు శాంతిని లేకుండా చేస్తుంది. కానీ యేసు వాక్యమును బట్టి మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పారు—దేవుడు మనకు రోజుకో విధముగా తన కృపను అనుగ్రహిస్తాడు.మన పట్ల విస్తరింప చేస్తాడు ప్రతిరోజు దేవుడు మనలను ఒకే రీతిగా నడిపించాడు ఒక్కొక్కరోజు, ఒక్కో రీతిలో దేవుడు మనలను నడిపిస్తాడు.
రేపటి దినము దాని సంగతులను గూర్చి అది చింతించును అని దేవుని వాక్యం చెప్పుచున్నప్పుడు
రేపటి దినమున మనకు అవసరమయ్యే అవసరతల గురించి మన భారాలను గురించి రేపటి దినము ఆలోచిస్తుంది ఈరోజే దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి రేపటి దినముతో సంబంధం లేని ఈరోజును భట్టి దేవుడు మనకు ఇచ్చిన శాంతిని సమాధానమును తృప్తిని మనం ఎందుకు పోగొట్టుకోవాలి మీకు అర్థం అవుతుందా ఈ విషయం,
ఏనాటి కీడు ఆనాటికే చాలును అని ఉన్నటువంటి ఈ వాక్యము మనకు మూడు ముఖ్యమైన పాఠాలను మనము గ్రహించవలసి వున్న సత్యాలను మనకు నేర్పిస్తుంది మనకు తెలియజేస్తుంది.
మొదటిది చింత,
1. ఈ చింత అనేది మన ఆనందాన్ని సంతోషమము హరిస్తుంది అంటే పోగొడుతుంది.
మనం రేపటి గురించి ఆలోచిస్తూ అంటే రేపటి రోజు ఎలా ఉంటుందో నా భవిష్యత్తు నా ఇంటిపరిస్థితి నా బిడ్డల పరిస్థితి అని మనం ఆలోచిస్తూ దేవుడు మనకు ఇచ్చిన ఈ రోజున సంతోషంగా గడపకుండా మనము విచారముగా దుఃఖముగా ఉంటూ ఈరోజును మనము కోల్పోతే, మన జీవితంలో సంతోషం అన్నది లేకుండా పోతుంది. దేవుడు మన జీవితాన్ని క్షణ క్షణం నడిపిస్తాడు, కాబట్టి దేవునిపై మన భారాన్ని ఉంచాలి.ఏ విషయంలో మనకు చింత కలుగుతుందో ఆ విషయమును ఆ సమస్యలన్నిటిని మన చింత యావత్తు సమస్తమును ప్రార్థన రూపంలో దేవునికి అప్పగించాలి ఎందుకంటే దేవుడు మనలను గూర్చి చింతించుచున్నాడు.
1పేతురు 5:7
ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు(లక్ష్యముచేయుచున్నాడు) గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.
దేవుడు మనలను గూర్చి చింతించుచున్నాడు కాబట్టి
మీ చింత యావత్తు నా మీద వేయుడి అని మిమ్ములను పిలుస్తున్న దేవుని పిలుపుకు మీరు స్పందిస్తారా !
రెండవది,
2, మన అవసరతలను తీర్చే దేవుడు,
ఏనాటి కీడు ఆనాటికే చాలును అన్నటువంటి ఈ వాక్యంలో మనము గ్రహించవలసిన రెండవ విషయం రెండవ సత్యం ఏమిటంటే ప్రతిరోజు మన అవసరతలను తీర్చే దేవుడు ఈ దేవుడు ఆని,
ప్రతిరోజూ మనము దేవునిపై ఆధారపడితే సమృద్ధిగా మనకు సరిపడే మనకు అవసర మైనటువంటి కృపను అందిస్తాడు
మనకున్న ప్రతి సమస్యకు దేవుడు తగిన పరిష్కారం సిద్ధం చేసి ఉంచాడు. మనం నేడు ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి ఆయన మనకు తగిన బలాన్ని, జ్ఞానాన్ని దానికి తగినటువంటి సమృద్ధిని మనకు అందిస్తాడు.
మనమే బలహీనులముగా దేవునిపై అవిశ్వాసంతో మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉంటాము
మీ చింత యావత్తు అయిన మీద వేయండి అన్న వాక్యాన్ని పక్కన పెట్టేసి మన ప్రయత్నాలు మనము చేసుకుంటు ఉంటాము.
🍃 ఒకసారి నా పిల్లలు చిన్నతనంలో మా ఇంటికి మేము వెళ్తున్న మందిరానికి చెందిన దేవుని ప్రజలు ఒక ఇద్దరు వచ్చారు ఆ సమయంలో వారు తినటానికి నేను వారికి snacks ఏమైనా ఇవ్వటానికి మా ఇంటిలో ఒక రెండు banana ఫ్రూట్స్ మాత్రమే ఉన్నాయి ఆ రెండు కూడా మరుసటి దినము నా బిడ్డల కొరకు నేను దాచి ఉంచాను వాటిని ఆ దేవుని బిడ్డల కొరకు ఇవ్వాలని అనిపించిన మరుసటి రోజు
నా పిల్లలకు ఉండవెమో అని వాటిని నేను వారికి ఇవ్వలేదు ఆ సమయంలో అవి తప్ప ఇంక మా గృహంలో snacks అనేవి ఏమీ లేవు వారు వెళ్లిన తర్వాత వారికి ఏమీ పెట్టలేకపోయానే అని నేను చాలా బాధపడుతూ వచ్చాను.
అయితే ఆ రాత్రి నా భర్త ఇంటికి వస్తూ Red colour లో ఉండే banana ఫ్రూట్స్ ని తీసుకొని వచ్చారు ఇవి నా దగ్గర ఉన్న మామూలు banana ఫ్రూట్స్ కన్నా రుచి మరియు ఖరీదైనవి కాబట్టి ఇవి అప్పట్లో మేము నివాసము ఉండే ప్రాంతంలో కాకుండా కొన్ని ఖరీదైన ప్రాంతాలలో మాత్రమే ఇవి దొరికేవి వాటిని చూడగానే నాకు యింక ఎక్కువ భాధ కలిగింది ఎందుకంటే నా దగ్గర ఉన్న మామూలు banana ఫ్రూట్స్ ని దేవుని బిడ్డలకు ఇవ్వలేకపోయానే అని ఈరోజు వరకు నేను ఆ సంఘటనను మర్చిపోలేదు అని అంటే ఆ సంఘటన ద్వారా దేవుడు నాతో ఎలా మాట్లాడాడో అన్న విషయం మీకు అర్థమవుతుంది కదా !
మన అవసరతలు దేవునికి తెలుసు అని మనము మన జీవితాలు దేవుని స్వాధీనంలో ఉన్నవని మన కొరకు మనము రేపటి దినమున ఎలా బ్రతకాలో మనకు ఏమి అవసరమొ గ్రహించిన దేవుడు మనకు అవసరమైన వాటి అన్నిటిని ముందుగానే మనకు సిద్ధపరుస్తాడని కొన్నిసార్లు మనము గ్రహించలేని విశ్వసించలేని హృదయాలతో రేపటి దినములను గూర్చి మనకు మనమే మనకు అవసరమైన వాటన్నిటిని సమ కూర్చు కుంటూ ఉంటాము
మన అవసరాలు దేవునికి తెలుసు. మన భవిష్యత్తును ఆయన ముందే సిద్ధం చేస్తాడు. కానీ మనం కొన్నిసార్లు అది గ్రహించలేకపోతాం. రేపటి గురించి ఆలోచిస్తూ, నేడు దేవుని ప్రజలకు ఆతిథ్యము ఇవ్వడం మర్చిపోతాం. అలా కాక, దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచి, మనకు ఉన్నదానితో ఆతిథ్యం ఇవ్వగలిగితే, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను కోల్పోకుండా ఉంటాం!
ఏనాటి కీడు ఆనాటికే చాలును రేపటిని గురించి మీరు భయపడవద్దు! మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి దేవుడిచ్చే శాంతిని సమాధానమును మీరు పొందండి.
సహజంగా మనం అనుకుంటూ ఉంటాము దేవుడు పెద్దపెద్ద విషయాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు అని అందుకే మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలలో మాత్రమే మనము దేవునికి ఆధారపడతామో వాటికి సంబంధించిన మన చింత మాత్రమే దేవుని మీద వేస్తాము
కానీ చిన్న చిన్న విషయాల ద్వారా కూడా దేవుడు మనలను సరి చేస్తూ ఉంటాడు అని మనము అసలు గ్రహించము మన జీవితంలో మనకు కలిగే అవసరత సమస్య అది పెద్దదైన చిన్నదైనా ఏదైనాప్పటికిని మన చింత అది ఏ రూపంలో ఉన్నప్పటికీ దానిని దేవుని మీద వేసినప్పుడు దేవుడు మన ప్రతి సమస్యను ఏ రోజు కా రోజుకి అవసరమైన ప్రతి అవసరతను మనకు తీర్చగలడు
మీ ప్రతి చింతను నీ ప్రతి భారమును దేవుని మీద వేస్తారు కదా !
మూడవది
3, మనము దేవునిపై ఉంచాల్సిన విశ్వాసం,
ఏనాటికీడు ఆనాటికే చాలును అనే వాక్యం లో మనము గ్రహించవలసిన మనము తెలుసుకోవలసిన మూడవ విషయం మూడవ సత్యం ఏమిటంటే దేవుడు మన ప్రతి అవసరతను తీర్చగల సమర్ధుడు అని మనము విశ్వసించి రేపటి దినమున గురించిన భవిష్యత్తు జీవితమును గూర్చిన చింతను మనము కలిగి ఉండకూడదు.
రేపటి భారాన్ని మోసే బాధ లేకుండా జీవించాలి అంటే మనకు సంభవించే రేపటి కష్టాలను గురించి రేపటి దినమున మనకు అవసరమయ్యె అవసరాలను గురించి మనం ఎదుర్కొనె సమస్యల గురించి ముందుగానే భయపడి చింతిస్తే, అచింత మనము కలిగి ఉండాల్సిన శాంతిని సమాధానమును దోచుకుంటుంది.
🔔అందుకే యెషయా 26:3 లో వున్న
ఎవని మనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.అన్న వాక్య నెరవేర్పు అనేదానిని ప్రతిరోజు మన జీవితంలో మనము చూడాలని యేసుక్రీస్తు ప్రభువారు ఏనాటి కీడు ఆనాటికే చాలును అని చెప్పారు.
రేపటి గురించిన ఎటువంటి భారమును గూర్చి సమస్యను గూర్చి అధికంగా ఆందోళన పడకుండా, దేవుని మీద విశ్వాసంతో మనమందరము నడుద్దాం. ఈరోజుకు మనకు లభించిన దేవుని నుండి మనకు దొరికిన కృపను బట్టి మనకు దేవుడిచ్చిన వాటిని బట్టి మనము ఆనందిద్దాం! దేవుడు ప్రతి రోజూ మీకు సరిపడే మీకు అవసరమయ్యే సమృద్ధి అయినా కృపను మీకు ఇస్తాడు అని మీకు అవసరమైన ప్రతి అవసరతను దేవుడు మీకు తీర్చగలడని మీరు విశ్వసించగలరా !
మీ భారం దేవునికి అప్పగించగలరా! మీ చింత ఆయన మీద వేయగలరా !
ఎస్తేర్ క్రైసోలైట్
13-3-2025