2025 Messages
🍀🍀🌿 📖🌿🍀🍀
40 రోజులు కాదు - మన జీవితాంతము
మత్తయి 16:24
అప్పుడు యేసు తన శిష్యులను చూచిఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను.
ఈ వాక్యంలో యేసు క్రీస్తు ప్రభువు వారు సూచించిన, "తన శిలువను ఎత్తుకోవడం" అంటే ఈ క్రైస్తవ జీవితంలో అనుకూలమైనదైనా, ఇబ్బందులు, శ్రమలు ఉన్నా వాటిని సహిస్తూ యేసుని మార్గంలో నడవడం ఆయివుంది.
ఈస్టర్ కి ముందు వచ్చే 40 రోజులను ఉపవాస దినములుగా మనమందరము వీటిని పాటిస్తూ ధ్యానిస్తూ ఉంటాము, పాపులైనా మానవులను రక్షించడానికి, యేసు క్రీస్తు ప్రభువు వారు సిలువ మార్గము లో శ్రమలను పొందారు, నేనైతే ఈ 40 రోజులు సమయమును శ్రమల కాలమని భావిస్తూ ఉంటాను, ఈ 40 రోజులు మనం ధ్యానించే వాటిలో ఎక్కువగా, యేసు క్రీస్తు ప్రభువు వారు సిలువలో మన కొరకు తాను చేసిన త్యాగము ఆశ్రమలను, మనము ధ్యానిస్తూ ఉంటాము కద!
ఈ 40 రోజులే మాత్రాము కాదండి ! ఈ దేవుని వెంబడించాలి, అని ఎవరైతే అనుకుంటారో, వారు కచ్చితంగా జీవితాంతం, వారు బ్రతికినంత కాలము తమ సిలువను వారు ఎత్తుకోవాలి, సిలువ లేకుండా ఈ మార్గంలో మనము ప్రయాణించలేము,
సిలువ శ్రమకు గుర్తు శ్రమ లేకుండా క్రైస్తవుడు బ్రతకాలని అనుకోవడం అసాధ్యం, ఎందుకంటే ఈ మార్గము ఇరుకు మార్గము.
మత్తయి 7:13,14
ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.
ఇరుకు మార్గం & విశాల మార్గం
1. విశాల మార్గం – ఇది , సులభముగా శ్రమ అన్నది లేనిదిగా కనిపించే మార్గం, కానీ అది నాశనానికి దారితీస్తుంది. చాలా మంది ఈ మార్గంలో నడుస్తారు, ఎందుకంటే ఇది బాహ్యంగా సౌకర్యవంతముగా అనిపిస్తుంది,కనిపిస్తుంది.
✝ 2. ఇరుకు మార్గం – ఇది , తక్కువమంది మాత్రమే వెళ్ళగలిగే మార్గం. ఇది కష్టమయినదిగా అనిపించవచ్చు, కానీ ఇది నిజమైన జీవానికి, దేవుని రాజ్యానికి తీసుకువెళుతుంది.
మన సిలువను మనము ఎత్తుకొని దేవుని మనం వెంబడించేటప్పుడు, విశాల మార్గంలో ఉన్నవారికి కలిగిన సౌకర్యవంతమైన జీవితము మనకు ఉండదు, ప్రతీది కూడా దేవునిపై ఆధారపడి దేవుని ప్రార్థించి మనం పొందవలసిన పరిస్థితి మనకు ఉంటుంది, ఎందుకు ఇలా అని అంటే, మన జీవితంలో మన ప్రవర్తన అంతటి మీద, మనం చేసే ప్రతి పని మీద, మన జీవితంలోకి వచ్చే ప్రతి దాని మీద, దేవుని అధికారము అన్నది ఉండాలి, దేవుని ఉద్దేశంలో మాత్రమే, అది మనకు మన జీవితంలోకి రావాలి.
ఈ లోకంలో మన సిలువను మనము ఎత్తుకొని దేవుని వెంబడించేటప్పుడు, కచ్చితంగా శ్రమ అన్నది కలుగుతుంది. శ్రమ అన్నది అది మన జీవితాలలోనికి ఏ రూపంలో వచ్చినప్పటికీ, దానివలన మనకు మేలే జరుగుతుంది, కానీ కీడు జరగదు, ఎందుకంటే శ్రమ మనలను దేవునికి దగ్గర చేస్తుంది, దేవునిపై ఆధారపడేటట్టు చేస్తుంది.
దేవునితో సన్నిహితంగా ఉండేటట్లు చేస్తుంది శ్రమ ఆన్నది మనకు కలిగినప్పుడు, దేవునికి ఇష్టం లేని ప్రతి విషయం కూడా, మనలో నుండి తొలగిపోతుంది, శ్రమ అన్నది మనలను దేవునికి ఇష్టమైన వ్యక్తులముగా మనలను మారుస్తుంది. అందుకే ఈ ఇరుకు మార్గమును వెంబడించేది కొద్ది మంది మాత్రమే, ఈ మార్గంలో మన సిలువను ఎత్తుకొని మనము ప్రయాణించేటప్పుడు, మనకు కలిగిన ఎటువంటి శ్రమ అయినప్పటికీ, ఆ శ్రమ తర్వాత, దేవుడు ఇచ్చే ఒక ఆశీర్వాదము ఒక మహిమ అన్నది మనం కచ్చితంగా చూస్తాము.
ఎందుకంటే మనకు ముందుగా, శిలువను ఎత్తుకొని ప్రయాణించిన, యేసు క్రీస్తు ప్రభువు వారు, తాను సిలువలో పడిన శ్రమవలన, మానవులకు, ఎటువంటి పునరుద్దాన మహిమ అన్నది, కలిగిందో మనకందరికీ తెలుసు, కాబట్టి ఈ శ్రమ అన్నది, ఈ 40 రోజులు మాత్రమే, మనం ధ్యానించే అంశం కాదు, అని మన జీవితాంతం మనతో కలిసి ప్రయాణించేది, అని ప్రతి క్రైస్తవుడు గ్రహించాలి.
* జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.*
ఈ వాక్యం యేసు క్రీస్తు ప్రభువు వారు చెప్పిన సత్యాన్ని వెల్లడిస్తుంది. చాలామంది విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటారు, కాని జీవమునకు (నిత్యజీవానికి) దారి ఇరుకుగా ఉంటుంది. ఎందుకంటే అది త్యాగం, విశ్వాసం, పరలోక రాజ్య నిబంధనలను పాటించడం అవసరం అని చెబుతుంది. కొందరే ఆ మార్గాన్ని కనుగొంటారు, ఎందుకంటే అది సులభమైన మార్గం కాదు.
ఈరోజుల్లో చాలా మంది సౌకర్యంగా ఉండే జీవనశైలిని కోరుకుంటారు, కానీ దేవుని మార్గం పరిశుద్ధత, పవిత్రత,శ్రమతో కూడిన క్రమశిక్షణ కలిగినదిగా ఉంటుంది. కాబట్టి, మనము నాశనమునకు నడిపించే విశాల మార్గం కాక నిత్యజీవామునకు తీసుకోని వెళ్లె ఇరుకైన మార్గాన్ని మనం వెంబడించాలి.
ఈ వాక్యం మన ఆత్మీయ జీవితానికి ఒక హెచ్చరిక. నిజమైన క్రైస్తవ జీవితం విశాల మార్గంలో కాదు, అది ఇరుకు మార్గంలోనే నడవాలి.
మీరు నిజంగా యేసును వెంబడించాలనుకుంటున్నారా?
అయితే, మీ సిలువను ఎత్తుకొని నడవడానికి సిద్ధంగా ఉన్నారా?
ఎస్తేర్ క్రైసోలైట్
13-3-2025
🍃 📖 🍃