2025 Messages
🍀🍀🌿 📖🌿🍀🍀
హల్దా -- ( నెమలి )
అందం
హల్దా ఒక ప్రవక్తిని ఆమె గురించి 2 రాజులు 22:14-20 & 2 దినవృత్తాంతములు 34:22-28 వ వచనములను చదివినప్పుడు హల్దా గురించి మనకు తెలుస్తుంది.
హల్దా ఆను పేరు నెమలి అనే అర్థమును కలిగి ఉంది
నెమలి రంగురంగుల అందమైన రెక్కలతో ప్రకాశిస్తుంది.అందమైనదిగా మనకు కనబడుతుంది,
అందం పరిశుద్ధత పునరుజ్జీవం అప్రమత్తత నిర్భయం తెలివితేటలు & చురుకుతనం
అనే లక్షణాలు నెమలిలో మనకు కనబడుతూ ఉన్నట్లు, హల్దాలో కూడా అనేకులను ఆకర్షించే సౌందర్యవంతమైన అందమైన గుణాలను దేవుడు తనలో ఉంచాడు, నెమలి అను అర్థం వచ్చే పేరు కలిగిన హల్దాలో ఉన్నటువంటి మొదటి లక్షణాము,
1,అందం
నెమలిని చూస్తే ఎవరికైనా ఆనందంగా అనిపిస్తుంది కదండీ. ఎందుకంటే అది అందంగా కనబడుతుంది. కాబట్టి ఎండిపోయిన పకృతిని, పాడైపోయిన వాటిని మనము చూసినప్పుడు, మన హృదయం సంతోషిస్తుందా ! మనము వాటిని బట్టి ఉలసిస్తామా! ! కాదు కానే కాదు, పకృతి ఆయిన మరి ఏదైనా మనం చూసేది, మన కంటికి అందంగా కనపడినప్పుడు, దానిని బట్టి మన మనసు ఉల్లసిస్తుంది కదా !
అందమైన రంగులను కలిగిన నెమలిని చూస్తే ఎవరికైనా ఆనందం అన్నది కలుగుతుంది. ఎందుకంటే అది అందంగా కనపడుతుంది కాబట్టి, నా చిన్నతనంలో నెమలి ఈక దొరికితే దానిని భద్రంగా నా బుక్ లో పెట్టుకునే దాన్ని, భద్రంగా దాచుకునే దానిని నిజమే కదా ! అందమైన ప్రతిదానికి ఒక విలువ అన్నది ఉంది, ప్రతి ఒక్కరూ దానికి విలువ ఇస్తారు, అది సహజం కానీ, మన శరీరము కలిగి ఉన్నా, ఈ మహిమ ఈ అందం అన్నది, శాశ్వతంగా ఉంటుందా ఉండదు.
అందుకే సామెతలు 31:30 లో ఇలా ఉంది,
అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును, దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని నీతి దేవుని పరిశుద్ధత దేవుని మంచితనమును, జ్ఞానమై ఉన్న ఆ దేవున్ని ఎవరు కలిగి ఉంటారో, వారే నిజమైన ఆత్మ సంబంధమైన సౌందర్యమును, ఆత్మసంబంధమైన మహిమను కలిగిన సౌందర్యవంతులు, వీరి అందము ఈ లోకంలో నశించిపోయేది కాదు, గాని నిత్యత్వంలో శాశ్వతంగా వీరినే అంటిపెట్టుకొని ఉండే అందం ఇది,
ఇటువంటి అందము ఎవరు కలిగి ఉంటారో, వారు అనేకులను ఆకర్షిస్తారు, ఇటువంటి వారి కోసం అధికారులు రాజులు సైతం వారిని వెతుకుతూ ఉంటారు, జ్ఞానమై ఉన్న దేవుని ఎవరు కలిగి ఉంటారో, వారి జ్ఞానము తెలివితేటలతో అనేకుల ఎదుట వారు ప్రకాశిస్తూ ఉంటారు,
హల్దా – దేవుని భయభక్తి కలిగిన స్త్రీ,నెమలి అందమైన రంగులతో, అందముగా మనకు కనబడితే, నెమలి అని అర్థం వచ్చే పేరు కలిగిన
హల్దా, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని మహిమను పొందిన, అందమైన స్త్రీగా ఇక్కడ మనకు కనబడుతుంది, కీర్తనలు 8:5 వానిని మహిమా ప్రభావములతో, వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. హల్దా జీవితమును ధ్యానం చేస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది, దేవుడు హల్దా కు ఎటువంటి కిరీటమనే మహిమను ప్రభావమును తనకు ధరింప చేశాడు అన్న విషయం.
సామెతలు 9:10
యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధా రము.హల్దా దేవుని భయంతో నడిచినందువల్ల, ఆమెకు జ్ఞానము గ్రహింపు కలిగింది.
ఆమెను రాజు యోషీయా తన రాజ్యంలో గొప్ప జ్ఞానిగా & దేవుని ప్రవక్తినిగా గుర్తించాడు.
దేవుని భయంతో జీవించేవారికి జ్ఞానం & గ్రహింపు
లభిస్తుంది హల్దా నిజమైన భయభక్తి కలిగిన ప్రవక్తిని ఆయిన స్త్రీగా నిలిచింది ! ఆమె అకర్షణీయమైన జీవితాన్ని కాదు, నమ్మకమైన ప్రవచన సేవను ఎంచుకుంది, ఇది ఆమె దేవుని పట్ల తాను ఉంచిన భయభక్తిని & దేవుని పట్ల ఆమె కలిగి ఉన్న అంకిత భావాన్ని చూపిస్తుంది.
ఎవరు తీసివేయలేని సౌందర్యంతో సృజించబడ్డ నెమలి వలె, అందరిని ఆకర్షిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా, దేవుడిచ్చే మహిమ సౌందర్యమును, ఆత్మ సంబంధమైన సౌందర్యమును,హల్దా పొందినట్లు మీరు కూడా దేవుడు ఇచ్చే, ఆత్మ సంబంధమైన సౌందర్యమును, మీరు పొందలని ఆశ పడుతున్నారా, అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి.
ఎస్తేర్ క్రైసోలైట్
12-3-2025