2025 Messages
🍀🍀🌿 📖🌿🍀🍀
* భస్మ బుధవారం: శిలువవైపు ఆత్మీయ ప్రయాణం *
ఈ రోజు భస్మ బుధవారం,ఇది మనకు మన పాత స్వభావమును విడిచి పెట్టాలని ఇది మనకు తెలియజేస్తుంది. భస్మ బుధవారం అంటే 40 రోజుల ఉపవాస ప్రార్థన ప్రారంభమైన రోజు. ఈ 40 రోజుల ప్రయాణంలో మీరేమి చేస్తారు, ఈ 40 రోజులు మన విశ్వాసాన్ని పరీక్షించుకునే సమయం కద !. మరి మనము దేవునితో సమీపించడానికి, మనం ఏ విషయాలను మనము వదిలివేయాలి? ఏ గుణాలను మనము అభివృద్ధి చేసుకోవాలి?
పాత స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో నూతన జీవితం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
🍀లెంట్ డేస్ అని అంటే మనలను పరిశుద్ధత వైపు నడిపించి, నిత్య జీవాన్ని పొందేందుకు సహాయపడే
ఆత్మ సంబంధమైన ప్రయాణమునకు ప్రారంభం అని దీనిని గూర్చి మనము చెప్పవచ్చు, ఈరోజు మనము చేయవలసిన తీర్మానము, మన శరీర సంబంధమైన క్రియలను కోరికలను విడచి క్రీస్తులో మనము దిన దినము నూతనముగా రూపాంతరపరచబడుతూ, క్రీస్తులో మనము నూతన జీవమును పొందాలన్నా ఒక ఆశతో కూడిన, ప్రాముఖ్యమైన తీర్మానం అన్నది, ఈరోజు మనము చేయాలి.
40 రోజుల ఉపవాస కాలం (లెంట్) అనగా అర్థం & దాని ఉద్దేశ్యం గుడ్ ఫ్రైడే & ఈస్టర్‌కు ముందు 40 రోజులు ఎందుకు గుర్తు చేస్తారు అని అంటే,
క్రైస్తవ సంప్రదాయంలో లెంట్ (Lent) అని పిలిచే ఈ 40 రోజుల ఉపవాస కాలం, యేసు 40 రోజులు ఉపవాసం చేసిన సంఘటనను గుర్తుచేస్తుంది. మత్తయి 4:2 నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట, ఆయన ఆకలిగొనగా,
లెంట్ డేస్ అనేవి ఇవి మన ఆత్మీయ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇవి మన అవిధేయతలను బట్టి, మన బలహీనతలను బట్టి, మనము పశ్చాత్తాపము పడటానికి, ప్రార్థించుటకు, విశ్వసించుటకు, ఆత్మ సంబంధమైన జీవితంలో పరిపక్వతను పొందుటకు, ఉపయోగపడే కాలంగా, సమయముగా, దీని గురించి మనం చెప్పవచ్చు.
యేసుక్రీస్తు ప్రభువారి శ్రమను, క్రీస్తు సిలువలో భరించిన బాధను మనం ఆలోచించడానికి, మనము అర్థం చేసుకోవడానికి, మన జీవితాన్ని పరిశీలించు కోవటానికి, ఉపవాస ప్రార్థనల ద్వారా ఇది మనకు ఉపయోగపడే ఖచ్చితమైన ఒక సమయము, అని మాత్రం నేను చెప్పగలను.
లెంట్ అంటే పరిశుద్ధ గ్రంథములో ఉందా? పరిశుద్ధ గ్రంథములో లెంట్ అనే పదం లేదు, లెంట్ అనే పదం పరిశుద్ధ గ్రంథంలో నేరుగా లేదు. కానీ, 40 రోజుల ఉపవాసం, శోధన, ఆత్మసంబంధమైన హృదయ శుద్ధి అనే అంశాలు మాత్రం పరిశుద్ధ గ్రంథంలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి.
ఇది క్రైస్తవ సంప్రదాయాలలో ఒకటి మాత్రమే,పరిశుద్ధ గ్రంథంలో అనుకూలంగా పేర్కొనబడలేదు, కానీ యేసు 40 రోజుల ఉపవాసాన్ని అనుసరించటమువలన, ఈ 40 రోజుల ఆచారం ఏర్పడింది.ఇది ముఖ్యంగా కెథలిక్, ప్రొటెస్టెంట్, ఆర్థడాక్స్ క్రైస్తవ సంప్రదాయాల్లో ఉంది, కానీ పరిశుద్ధ గ్రంథములో దీనికి నేరుగా ఆజ్ఞ అన్నది ఇవ్వబడలేదు.
యేసు బాప్తిస్మం పొందిన తర్వాత, ఆత్మ ద్వార నడిపింపబడి, అరణ్యంలో 40 రోజుల పాటు, ఉపవాసం ఉన్నారు . యేసు 40 రోజుల ఉపవాసం చేసిన వెంటనే సిలువకు వెళ్లలేదు. కాని, ఆయనకు అప్పుడే శోధనలు వచ్చాయి, ఆయన తన బోధనను ప్రారంభించారు.
ఆయన దాదాపు 3½ సంవత్సరాలు బోధించాక మాత్రమే సిలువలో మరణించి, మృతులలో నుండి తిరిగి లేచి, గమనించదగిన గుర్తించదగిన సంఘటనల ద్వారా తన శిష్యులకు ప్రత్యక్షమయ్యారు.
యేసు క్రీస్తు ప్రభువు వారు ఆచరించిన ఈ 40 రోజుల ఉపవాసలను మరి ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఈస్టర్ కు ముందు ఎందుకు పాటిస్తున్నారు, అని అంటే గుడ్ ఫ్రైడే (యేసు సిలువ) & ఈస్టర్ (యేసు పునరుత్థానం) కు ఆత్మసంబంధంగా దేవుని ప్రజలు సిద్ధం కావడం కోసం.
దీనిని మనం ప్రతి సంవత్సరము పాటించాలా అని అంటే, ఇది తప్పనిసరి కాదు, కానీ మన వ్యక్తిగత విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, ఉపయోగ పడుతుందని అనేకులు నమ్మటమే కాకుండా మన అనుభవంలో కూడా దేవుని ప్రార్థించి, ప్రతి అవసరతను పొందటానికి ముఖ్యంగా, యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన త్యాగాన్ని ధ్యానించడానికి, దీని ద్వార మన ఆత్మీయ స్థితిని మనము పరిశీలించుకోవడానికి బలపరుచు కోవడానికి ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని అనుసరించి దేవుని సన్నిధిని, మనం ఎక్కువగా అనుభవించడానికి, మన ఆత్మ జీవితంలో దేవునితో ఎక్కువ సంబంధాన్ని ప్రార్థన జీవితం ద్వారా కలిగి ఉండటానికి, దీనిని మనము ఒక అవకాశం గా ఉపయోగించుకోవచ్చు.
భస్మ బుధవారం అనేది మన పాత స్వభావాన్ని క్రీస్తు సిలువవద్ద సమర్పించి, ఆత్మ ఫలాలతో నిండిపోవడానికి మనలను ప్రేరేపిస్తుంది.
బంగారం వెండి అగ్నిలో శుద్ధి చేయబడినట్లు, మన హృదయాలు కూడా శ్రమల ద్వారా శుద్ధి చేయబడాలి. ఈ రోజు మనలో ఉన్న శరీర సంబంధమైన కోరికలు, స్వార్థం, క్రోధం, అహంకారం అన్నీ కాల్చివేయబడాలి. మనం బూడిదవలే చేయబడాలి, క్రీస్తులో నూతన జీవం పొందాలి.
గలతియులకు 2:20
నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.
ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ప్రయాణంలో మనం శుద్ధి చేయబడాలి, ఆత్మ ఫలాలతో నిండాలి, దేవుని మహిమ కోసం జీవించాలి. ఇది శ్రమల మార్గం అయినా, ఆఖరికి మనకు వచ్చేది మహిమ మార్గమె !
యోహాను 16:33.
లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.
బంగారం, వెండి అనేవి అగ్నిలో కాల్చినప్పుడు, వాటిలోని మలినాలు వెలుపలికి వచ్చి, అవి మరింత స్వచ్ఛమైనవిగా మారతాయి. అలాగే, విశ్వాసి జీవితంలో కూడా శ్రమలు, పరీక్షలు, అవమానాలు, కష్టాల ద్వారా దేవుడు మనలను శుద్ధి చేసి, ఆత్మపూర్ణత కలిగిన వారిగా మారుస్తాడు, శ్రమల వెనుక ఉన్న మహిమ అంటే ఇదే,
యాకోబు 1:2,3
నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,
మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.
యేసు క్రీస్తు ప్రభువారు స్వయంగా శ్రమలను ఎదుర్కొని, సిలువ మార్గములో నడచి తన రక్తంతో మానవాళికి నూతన జీవాన్ని ఇచ్చారు, సిలువపై ఆయన చేసిన కార్యమే, మానవుని ఆత్మ సంబంధమైన జీవితా మార్పుకు మూలం.
మనకు వచ్చే కష్టాలను చూసి దిగులు పడకుండా, అవి మనల్ని, దేవునికి మరింత దగ్గర చేసేందుకు ఉపయోగపడతాయని, గుర్తుంచుకోవాలి. మన జీవితం, నిప్పులో శుద్ధి చేయబడిన, బంగారంలా ఉండాలి. మనం శ్రమల మధ్య ఉన్నప్పుడు, విశ్వాసాన్ని కోల్పోకుండా, మన పట్ల దేవుడు కలిగి ఉన్న, ప్రణాళికను నమ్మాలి, శ్రమల వెనుక ఉన్న మహిమను ఆశీర్వాదాలను గ్రహించి, ఆత్మ ఫలాలతో నిండిన, జీవితముతో మనము జీవించాలి.
2కోరింథీయులకు 4:17
మేము దృశ్యమైన వాటిని చూడక, అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము, గనుక క్షణమాత్రముండు, మా చులకని శ్రమ మా కొరకు, అంతకంతకు ఎక్కువగా, నిత్యమైన మహిమ భారమును, కలుగజేయుచున్నది.
శ్రమలు వస్తాయి, కానీ వాటిని మించి దేవుని మహిమ కూడా మనకు వస్తుంది!
ఈ 40 రోజులు ఉపవాస దినములను, ప్రార్థన ద్వారా మనము ఆచరించుట వలన, మనకు ఏమి జరుగుతుంది అని అంటే, మన పాత స్వభావము మార్చబడి, క్రీస్తులో నూతనంగా మనము రూపాంతర పరచబడతాము.
దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనని, గలతియులకు 5: వ అధ్యాయంలో వున్న
శరీర కార్యములు, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు అనే
శరీర కార్యాలు మనకు దూరమై, ఆత్మ ఫలాలు ఆనేవి మనలో అభివృద్ధి అవుతాయి.
యాకోబు 4:8
దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి.అని దేవుడు మనలను పిలుస్తూ ఉండగా, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన ద్వారా మనము గడపటానికి, దేవుడు ఇచ్చిన సమయాలను మనము వినియోగించుకుందామా !
ఈ 40 రోజుల, ఉపవాస ప్రార్థన సమయాలను, అనేక సంఘాలు సహవాసాలు పాటిస్తున్నాయి, ఈ ఉపవాస సమయలలో, మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకునే, అవకాశంగా దీనిని మనము తీసుకుందాం! దేవుని ఇల్లు, దేవుని సంఘాము, దేవుని సహవాసము, ఇది మానవునిది కాదు, దేవునిది, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనను, పరిశుద్ధ హృదయంతో, మనము కొనసాగించు చుండగా, ఈ 40 రోజుల ఉపవాస ప్రయాణం ద్వారా, మన జీవితాలు మారి, దేవుని మహిమను అనుభవించుదాము గాక ! ఆమెన్
ఎస్తేర్ క్రైసోలైట్
7-3-2025