2025 Messages
లోక అధికారము vs పరలోకపు సన్నిధి
మత్తయి 5:7
కనికరము గలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
బలవంతులు బలహీనుల పట్ల కనికరమును చూపాలి ఆత్మసంబంధముగా కానీ శరీర సంబంధంగా కానీ మనము ఏ స్థితిలోనైనా బలవంతులముగా ఉన్నప్పుడు బలహీనమైన స్థితిని కలిగి ఉన్నా వారిని మనము కనికరించాలి.
ఆప్పుడే మనము దేవుని ప్రేమను పొందగలుగుతాము, కనికరము గలవారు ధన్యులు, ఎందుకు అంటే వారు దేవుని కనికరమును పొందుతారు కాబట్టి.
కయీను హేబెలు వారు యిద్దరు అన్నదమ్ములు,
కయీను తన తమ్ముడైన హేబేలు పట్ల కనికరాన్ని చూపలేదు, కాబట్టి దేవుని కనికరం కయీను పట్ల కనపడలేదు ,కాబట్టి కయీను శాపగ్రస్తుడయ్యాడు.
కయీను ద్వేషం పగ ప్రతీకారం అనే శరీర సంబంధమైన గుణాలను కలిగి ఉన్నాడు
హేబెలు అయితే దేవుని ఆరాధించే స్వభావాన్ని కలిగిన పరిశుద్ధాత్మ గుణాలను కలిగి ఉన్నాడు.
శరీర సంబంధమైన గుణాలు మనకు నష్టాన్ని తీసుకొని వస్తాయి ఎదుటి వ్యక్తులను కనికరించని స్వభావమును పగ ద్వేశము అసూయను క్షమించరాని తనమును మనము కలిగి ఉండటానికి ప్రేరేపిస్తాయి.
పరిశుద్ధాత్మ దేవుని గుణాలను ఎవరైతే కలిగి ఉంటారో వారు కనికరాన్ని కలిగి ఉంటారు ఎదుటి వ్యక్తులు చేసిన తప్పులను క్షమించగలిగే స్వభావమును కలిగి ఉంటారు ప్రతి కారము అన్నది తీర్చుకోరు దేవునికే మొఱ్ఱ పెడతారు అందుకే హేబేలు రక్తం నేల నుండి దేవునికి మొరపెట్టింది.
ఈ లక్షణాలను బట్టి ఎవరు దేవుని గుణ లక్షణాలను కలిగి ఉన్నారో వారు దేవుని ప్రజలా ! కాదా ! అన్నది మనము ఎదుటి వ్యక్తులను చూస్తున్నప్పుడు గమనించవచ్చు.
పరిశుద్ధాత్మ దేవుడు సమాధానానికి కర్త పరిశుద్ధాత్మను పొందిన ప్రజలు సమాధానమునే
వెంటాడాలి ఈ సమాధానము వ్యక్తుల మధ్య కుటుంబాల మధ్య సంఘాల మధ్య ప్రాంతాల మధ్య దేశాల మధ్య కొరవడినప్పుడు తగ్గిపోయినప్పుడు ఈ సమాధానము మనకు కనపడనప్పుడు సమాధాన కర్త అయిన దేవుడు అక్కడ దిగి రావాలి అని దేవుని ప్రజలు పరిశుద్ధాత్మను పొందిన ప్రజలకు ప్రార్థించాల్సిన బాధ్యత ఎంతైన వుంది.
నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు నాలో ఉన్న ఈ దేవుడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అన్న దేవుని ఆత్మ సన్నిధిని ఎవరైతే గ్రహిస్తారో వారి ప్రార్థనలకు కచ్చితంగా జవాబు దొరుకుతుంది దేవుని కనికిరమును వారు తప్పక పొందుతారు.
1రాజులు 17:1
అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీ యుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి-"ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు, "
ఇక్కడ ఏలియా తాను ఉన్నది ఆహాబు రాజు రాజ్యంలో అతని సన్నిధిలో రాజా ఆవరణములో తాను నిలబడి ఉన్నాడు కానీ ఏలియా ఆ రాజు సన్నిధిలో ఉన్నప్పటికీని ఆ సన్నిధిని తాను అనుభవించడం లేదు, ఆ రాజ సన్నిధిలో కూడా తనమీద అధికారిగా తనలో ఉండి తనను ప్రభావం చేసే పరిశుద్ధాత్మ సన్నిధిని మాత్రమే తాను అనుభవిస్తున్నాడు గ్రహిస్తున్నాడు అందుకే తన మీద ఉన్న ప్రభుత్వాల రాజు అధికారం కానీ తనమీద పనిచేయలేదు.
ఎటువంటి పరిస్థితుల కుండా మనము వెళ్తున్నప్పటికిని ఎవరి అధికారములో మనము పరిపాలించబడుతున్నప్పటికీ ని మనము దేవుని సన్నిధిలో దేవుని అధికారంలో మనము ప్రయాణిస్తున్నామా అన్నది మనం గ్రహించినప్పుడు ఎటువంటి పరిస్థితులు కూడా మనలను కదల్చ లేవు.
దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితి మనల్ని కదల్చలేదు ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి నష్టకరమైన కీడుకరమైన పరిస్థితుల గుండా మనము వెళ్లినప్పటికీని దేవుడు ఆ నష్టాన్ని మేలుగా మలచగలడు.
నిర్గమకాండము 10:22,23
మోషే ఆకాశమువైపు తన చెయ్యి యెత్తినప్పుడు ఐగుప్తుదేశ మంతయు మూడు దినములు గాఢాంధకార మాయెను మూడు దినములు ఒకని నొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటనుండి లేవలేక పోయెను; అయినను ఇశ్రా యేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను.
పరిశుద్ధ గ్రంథంలో దేవుని సన్నిధిని కలిగి ఉన్న ఏలియా మోషే లాంటి దైవజనులు ప్రార్ధించుట ద్వారా ఎటువంటి అద్భుతాలను చేయగలిగారో అన్న ఈ విషయము మనకు అర్థమైతే మనకు కష్టాలు వచ్చినా రోగాలు వచ్చిన ఆఖారికి యుద్ధాలు వచ్చిన మనము భయపడము ఎందుకు అంటే దేవుని సన్నిధి మనతో ఉండి మన చేతులను ప్రార్థన ద్వార ఆకాశము తట్టు చాపేటట్లు చేస్తుంది కాబట్టి.
మనము ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితులలో ఉన్న దేవుని సన్నిధి అన్నది మనతో ఉన్నది అని మనం గ్రహించినప్పుడు ఈ లోకంలో మన మీదున్న అధికారం మనకు నష్టం తెచ్చే రీతిలో ఆది మన మీద పనిచేస్తున్నా అక్కడ మనకు నష్టం అన్నది రానేరాదు.
శ్రమ కలిగిన స్థితిలో మీరు ఉన్నారా! స్వస్థత లేని అనారోగ్యంలో మీరు ఉన్నారా ! ఎవ్వరూ కనికరించని స్థితిలో మీరు ఉన్నారా !
మీ జీవితంలో ఎటువంటి యుద్ధము లాంటి పరిస్థితిలో మీరు ఉన్నాప్పటికి దేవుని సన్నిధిని మీరు కలిగి ఉండి మీరు దేవుని ప్రార్థించగలిగితే అందరికీ చీకటి కానీ మీకు వెలుగు కలుగుతుంది అందరికీ స్వస్థత లేని పరిస్థితి కానీ మీకు స్వస్థత దొరుకుతుంది.
అందరికీ యుద్ధము ద్వారా నష్టం జరుగుతుంది కానీ ఆ యుద్ధమే మీకు మేలును చేస్తుంది, అందరికీ అసాధ్యము కాని దేవుని ప్రజలైన మీకు ఆది సాధ్యమవుతుంది, అందుకే పరిశుద్ధాత్మద్వారా వచ్చే దేవుని సన్నిధిని కలిగి ఉండి దేవునికి ప్రార్థించండి, ఇతరులను కనికరించండి, అప్పుడు మీరు కనికరించబడుదురు.

ఎస్తేర్ క్రైసోలైట్
7-5-2025
Written By: Sis.Esther Chrysolyte
Written On: 7-5-25