CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍀🍀🌿 📖🌿🍀🍀

నిజమైన ఆనందం & అతిశయం దేనివల్ల

1థెస్సలొనికయులకు 2:19,20

ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకీరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునైయున్నారు.

2 కోరింథీయులకు 7:4

మీ యెడల నేను బహు ధైర్యముగా మాటలాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాల అతిశయము కలదు, ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమయంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను.

పౌలు తన శిష్యుల్ని, విశ్వాసులను చూసి నేను ఆనందముతో ఆతిశయముతో ఉప్పొంగుచున్నాను(2 కొరింథీయులకు 7:4) అని చెప్పాడు. ఎందుకంటే ఆయనకు దేవుని ప్రజలే నిజమైన సంతానం. సొంత బంధువుల కంటే, ఇంటి వారికంటే, ఆత్మీయ సంబంధమైన ప్రజలే దేవుని సేవకులకు ప్రధానమైన వారవుతారు.

ఎందుకంటే దైవ సేవకుల కష్టమంతా కూడా విశ్వాసులను ఆత్మీయంగా అభివృద్ధి చెందించటానికి వారికి వాక్యం అందించడానికి వారి కొరకు ప్రార్థించడానికి. వారు ప్రయాస పడుతూ ఉంటారు. కాబట్టి అపోస్తులుడైన అయిన పౌలు తాను ఎవరికైతే దేవుని వాక్యాన్ని అందించాడో, ఎవరి గురించి అయితే తాను ప్రార్థిస్తూ వచ్చాడో, వారి అభివృద్ధిని గూర్చి నా ఆనందమును నా అతిశయమును మీరే కదా, అని అంటూ వచ్చాడు.

సువార్తను వారికి అందించుట వారి కొరకు ప్రార్థించుట వలన కలిగిన ప్రయోజనమే నా ఏకైక ధ్యేయం నా కర్తవ్యం దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అని అనుకున్నా పౌలు తనకున్నదంతా వదులుకొని, తన శ్రమలన్నిటినీ తట్టుకొని, విశ్వాసుల కోసం జీవించాడు. ఎందుకంటే తన వాక్యమును విన్న శిష్యులు విశ్వాసులు వారు దేవుని పిలుపు పొందినవారు, దేవుని రాజ్యానికి అనువైనవారు, ఆత్మీయ వారసులు కాబట్టి,

నేడు ప్రతి దైవ జనుని '' హృదయం కూడా ఇదే స్పందన అయి ఉండాలి, వారి హృదయాన్ని మిక్కిలి సంతృప్తి పరచేది, ఆత్మీయ సంతానం పెరిగినప్పుడు, విశ్వాసులు బలపడినప్పుడు, వారి ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే. సొంత ఇంటి వారి కంటే సొంత బంధువుల కంటే, ఆత్మీయ బంధువులే వారికి ప్రాముఖ్యము అయి ఉండాలి, ఎందుకంటే వారు దేవుని పనికై పిలువబడినవారు.

మీ జీవితంలో దేవుని పనికై మీరు నిలుస్తున్నారా? మీ విశ్వాసంతో దైవ సేవకులకు ఆనందంగా ఉన్నారా?మనకు పరిచర్యను చేసే దైవజనులకు

దేవుని సేవకులకు , ఆనందంగా, ఆతిశయంగా నిలుద్దాం!

పౌలు తన విశ్వాసుల గురించి "నా ఆనందము నా ఆతిశయమును మీరే అని చెప్పినప్పుడు, తన గర్వాన్ని ప్రదర్శించడానికి కాదు కాని– దేవుని మహిమను ప్రకటించడానికే అని మనము గుర్తించాలి,

అందుకే పౌలు ఫిలిప్పీయులకు 3:17

సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి; మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి.అని తెలియజేస్తూ వచ్చాడు.

దేవుడు మన పిల్లల్ని ఉన్నత స్థితిలో నిలిపినప్పుడు,మనము ఆనందించాలి, ఇది నిజమే, అదే సమయంలో మన సహవాసాలకు మన మందిరాలకు, మనము చెప్పే వాక్యము వినటానికి, వచ్చే విశ్వాసులు వారి కుటుంబాలలో, వారి జీవితాలలో, వారి బిడ్డల జీవితాలలో వారి ప్రార్థనలకు వారి కొరకు మనము చేసే ప్రార్థనలకు మనము వారికి చెప్పే వాక్య బోధకు ప్రత్యుత్తరంగా, దేవుడు వారిని ఆత్మసంబంధంగా శరీర సంబంధంగా వారిని ఆశీర్వాదించినప్పుడు,సాక్ష్యంగా నిలిచినప్పుడు అది మన ప్రయాసకు తగిన సాక్ష్యము అని దేవునిని బట్టి మనము అతిశయించాలి ఆనందించాలి.

మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకీరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున, ఆయన యెదుట మీరే గదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై యున్నారు.అని చెప్పినప్పుడు,అపోస్తులుడైన పౌలు కి తనకు కలిగిన తనకున్న గర్వం అతిశయం, ఇది తన వ్యక్తిగతమైనది కాదు – ఇది దేవుని మహిమకొరకే అని మనకు అర్థమవుతున్నది కదా,

దేవుడు మన శరిర సంబంధమైన పిల్లలను కానీ ఆత్మసంబంధమైన సంతానమును గాని, మన జీవితములో ఓక సాక్ష్యంగా ఒక ఆశీర్వాదముగా ఉంచినప్పుడు నిలిపినప్పుడు, అది దేవుని ఎదుట మనకు ఆనందం అతిశయము కలుగుతుంది కదా,

నేడు మన విజయాల వెనుక మనం ఉన్నామా? లేక దేవుని కృప ఉందా? దేవుడు ఉన్నాడని చూపిస్తున్నామా, నేడు మీ జీవితంలో దేవుడు చేసిన మంచి పనులను మీరు దాచిపెడుతున్నారా? సాక్ష్యంగా నిలుస్తున్నారా? నిందకు భయపడకుండా, దేవుని మహిమను ప్రకటిస్తున్నారా !

ఎవరు మనలను హేళన చేసిన ఎవరు ఏమనుకున్నా

దేవుని మహిమను మనము మౌనంగా దాచి పెట్టకుండా ఉంచకుండా, ధైర్యంగా ప్రకటిద్దాం! మన ఆతిశయము మన విజయం మన ఆనందము అంతా కూడా, మనుష్యల జ్ఞానమును బట్టి మన తెలివిని బట్టి వచ్చింది, కాదు దేవుని బట్టి వచ్చింది కాబట్టి.

ఎస్తేర్ క్రైసోలైట్

2-3-2025