CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍀🍀🌿 📖🌿🍀🍀

పావురం తెచ్చిన ఆశీర్వాదం

క్రీస్తులో లభించే శాంతి సమాధానం

యెమీమా ( పావురము )

యెమీమా అని పేరును ఇంగ్లీషులో జేమిమ్మ అని పిలుస్తారు ఇమె యోబుకి కలిగిన పరిక్ష తరువాత యోబుకి జన్మించిన పేద్ధ కుమార్తె.

యోబు 42:12,13,14,

యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగువేల గొఱ్ఱెలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను. మరియు అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.

అతడు పెద్దదానికి యెమీమా అనియు రెండవదానికి కెజీయా అనియు మూడవదానికి కెరెంహప్పుకు అనియు పేళ్లు పెట్టెను.

ద్వితియోపదేశకాండము 28:4 నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి టెద్దులు నీ గొఱ్ఱె మేకల మందలు దీవింపబడును;

యోబు దీవించబడిన విధానము మనము చూసినప్పుడు ద్వితియోపదేశకాండము28వ అధ్యాయం నాలుగవ వచనంలో ఉన్న దీవెన ఆశీర్వాదాలు అన్నీ కూడా దేవుడు తనకి ఇచ్చినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది.

యోబు జీవితంలో జరిగిన శ్రమలు, బాధలు అనంతరం దేవుడు యోబును మళ్లీ ఆశీర్వాదాలతో దీవించాడు యోబుకు జన్మించిన పెద్ద కుమార్తె పేరు యెమీమా (Zemimah). ఈ పేరు "పావురం" అని అర్థమును కలిగి వుంది అయితే, పరిశుద్ధ గ్రంథంలో ఇమె గురించి చాలా తక్కువగా వ్రాయబడిన ఆమె పేరును పరిశీలిస్తే, యోబు కుమార్తె ద్వారా వచ్చిన ఆశీర్వాదం కూడా పావురంలా స్వచ్ఛంగా, శాంతిమయంగా, పవిత్రంగా ఉండటమే కాకుండా యోబు కోల్పోయిన ఆశీర్వాదాలను నూతనముగా మరల పొందినందుకు సూచనగా ఈ పేరును యోబు తన పెద్ద కుమార్తెకు పెట్టి ఉండవచ్చు.

1. పావురం : పరిశుద్ధాత్మకు సూచన,

పరిశుద్ధ గ్రంథము లో పావురం అనేది పరిశుద్ధాత్మకు సూచనగా పరిశుద్ధాత్మకు ముఖ్యమైన చిహ్నమున ముల గుర్తుగా మనకు కనబడుతుంది

యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురముల వచ్చి ఆయనపై వాలినది అనే సంఘటన మూడు సువార్తల్లో కనిపిస్తుంది.

మత్తయి 3:16

యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.

మార్కు 1:10

వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.

లూకా 3:22

పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడునీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.

దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంద్రములలో జీవ వాయువును తనలో ఉన్న ఊపిరిని ఊదాడు తన చేతులతో తన ద్వారా నిర్మించబడిన మానవుడు మరణం అన్నది లేకుండా ఉండాలని జీవించాలని దేవుడు అనుకొని మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చేదవు అని ఆజ్ఞాపించాడు.

ఆదికాండము 2:7

దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.

ఆదికాండము 2:17

అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. తమ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశమును ఆదాము హవ్వలు గ్రహించలేక తప్పిపోయి తమ శరీరములకు మాత్రమే కాకుండా ఈ భూమి మీద తమ ద్వారా జన్మించబోయొ ప్రతి శరీరమును కూడా మరణమునకు అప్పగించినారు.

జగత్తు పునాది వేయబడక ముందే మనలను (నరులను)ఏర్పరచుకున్న దేవుడు మన పట్ల తాను నిర్ణయించుకున్న ఉద్దేశమును రద్దు పరచకూడదని పరిశుద్ధాత్మ ద్వారా తాను నిర్మించబడి మానవులు

దీనినైతే జయించలేకపోతు వచ్చారో, ఆ సమస్తాన్ని జయించి తిరిగి లేచిన ఆత్మను అపరిశుద్ధాత్మను తనను విశ్వసించిన ప్రజలందరిలో తాను ఉంచారు.

ఈ పరిశుద్ధాత్మను కలిగిన మనము ఎప్పటికీ నశించిపోని మహిమ శరీరమును మనము ధరిస్తామని విశ్వాసము మనము కలిగి ఉన్నాము.

ఇది పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగిన రెండంతల ఆశీర్వాదము,

ఆదాములో ఆత్మ శరీరము వేర్తెటట్లు శరీరము మరణించబడితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వార పరిశుద్ధాత్మ మనము ధరించబోయే మహిమ శరీరంలో నిత్యముతాను ఉండేటట్లు జీవించేటట్లు

యోబు కోల్పోయిన ఆశీర్వాదాలు అన్నిటిని రెండంతలుగా యోబుకు మరల నూతనముగా ఇచ్చినట్లు మానవుల కోల్పోయిన సమస్తాన్ని యేసు క్రీస్తు ప్రభువు వారిలో మనలను నూతన సృష్టిగా చేసి నూతన ఆశీర్వాదాలతో పరిశుద్ధాత్మతో నింపబడే భాగ్యమును తనను విశ్వసించిన ప్రజలందరికీ దేవుడు అనుగ్రహించాడు.

ఎఫెసీయులకు 1:6

మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.దేవుడు మనలను యేసుక్రీస్తు ప్రభువారి లో ముందుగా ఎంపిక చేసుకున్నాడు. ఈ సృష్టి ఈ ప్రపంచం సృష్టింపబడకముందే ఆయన తన ప్రణాళికలో మనలను పరిశుద్ధులుగా ఉండేలా నిర్ణయించాడు. ఇది దేవుని అనుగ్రహము ద్వారా మనకు కలిగిన ఏర్పాటును తెలియజేస్తుంది.

మానవుని శరీర స్వభావము మానవునికి ఆశీర్వాదాలు కోల్పోయేటట్లు చేస్తే పరిశుద్ధాత్మ మానవుని ఆత్మ సంబంధమైన జీవితంలోనూ శరీర సంబంధమైన జీవితములోనూ రెండంతల ఆశీర్వాదమును తీసుకుని వచ్చింది.

2. పావురం : యదార్థ హృదయమునకు సూచన,

మత్తయి 10:16

పావురముల వలె నిష్కపటులునై యుండుడి.పావురము యదార్ధ హృదయము కలిగి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన పక్షిగా ఇది గుర్తించబడ్డది, పావురము దాని జతపక్షి ఇంకొక పావురము మరణిస్తే మిగిలిన జీవించి ఉన్న పావురము అది జీవితాంతము మరి ఏ ఇతర పావురముతో జత కలసి ఉండదు. తన జీవితాంతము మరణము వరకు ఒంటరిగానే తాను జీవిస్తుంది ఇది పావురములో దేవుడు ఉంచిన శ్రేష్టమైన లక్షణము, అందుకని దేవుడు పరిశుద్ధాత్మను పావురమునకు పోల్చి యున్నాడు,

ఇటువంటి దేవునికి ఇష్టమైన యదార్థ ప్రవర్తన దేవుని బిడ్డలు అందరూ కలిగి ఉండాలని, దేవుని ఉద్దేశ్యం అయింది.

యోబు 1:1

ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.

ఈ వాక్యము యోబును యథార్థత కలిగినవాడిగా వివరిస్తుంది. అతడు దేవునికి భయపడి, చెడు నుండి దూరంగా ఉండే నిజమైన, నమ్మకమైన వ్యక్తిగా ఉండేవాడని దీని అర్థం.

2 దినవృత్తాంతములు 16:9

తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవాకను దృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది;

ఈ వాక్యము ద్వారా దేవుడు నిష్కపటమైన, యథార్థ హృదయముగలవారిని చూచి, వారిని బలపరచుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది. ఇది దేవుని ప్రేమ, శక్తి, మరియు నమ్మకమైనవారిని ఆదుకునే తీరు గురించి గొప్పగా చెబుతుంది.నిష్కపటమైన హృదయం అనేది, మనం ఆలోచించే విధానం, మన మాటలు, మన చర్యలు అన్నీ ఒకేలా ఉండటం. మనసులో ఏదో ఒకటి, బయట ఇంకేదో కాకుండా ఉండడం నిజమైన యదార్థత.

ప్రతి తల్లిదండ్రులు కూడ పిల్లలు అనేవారిని తమకు కలిగిన సంతానమును దేవుడిచ్చిన ఆశీర్వాదమునకు చూచనగా భావిస్తారు, యోబు తాను పరీక్షించబడిన తరువాత తాను కోల్పోయిన, ప్రతి ఆశీర్వాదములు రెండంతలుగా తిరిగి పొందాడు ఎందుకు తాను ఆశీర్వాదాలు పొందగలిగాడు అని అంటే దేవుని పట్ల యదార్ధ హృదయం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు యోబును ఆశీర్వాదాలతో బలపరిచాడు,

యోబు తాను పరీక్షింపబడుతున్నప్పుడు తనకు కలిగిన సమస్త సంపద బిడ్డలు పశు సంపద సమస్తము తనను వదిలి వెళ్ళిపోయినప్పటికిని తాను రోగగ్రస్తమైన శరీరము కలిగి ఉన్నప్పటికిని

యోబు తాను నమ్మిన దేవుని పట్ల యదార్థ హృదయము కలిగి ఉన్నాడు.

యోబు 5:19

ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు.

ఆరు అనే సంఖ్య మానవునికి సంబంధించినది అంటే మన తోటి మానవుల ద్వారా శ్రమ కలిగిన మన అజ్ఞానము మన అవిధేయత దేవునిపై మనము ఆధారపడని తత్వం వలన భక్తి హీనత వలన మనము శ్రమల కష్టాల గుండా వెళుతూ దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు వాటన్నిటిలో నుండి విడిపిస్తానని ఇక్కడ దేవుని వాక్యము లోని అర్థమై ఉన్నది.

ఏడు అన్నది సంపూర్ణతకు దేవునికి సంబంధించి సంఖ్య ఇది మన జీవితంలో కూడా అనేక రకాలైన పరీక్షలలో గుండా మనం వెళుతూ దేవుని వదిలిపెట్టకుండా యథార్థతను కలిగి మనం దేవుని ప్రార్థిస్తున్నప్పుడు వాటన్నిటిలో నుండి కూడా దేవుడు మనలను విడిపిస్తానని ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు.

మనకు కలిగే శ్రమ అది ఎటువంటిదైనా మన భక్తిహీనత మన అజాగ్రత్త ద్వారా మనము కలిగి ఉన్న వ్యాఖ్య లేమి ద్వారా కలిగినదని మనకు అనిపించినప్పుడు లేక దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని మనకు ఆనిపిస్తున్నప్పుడు యోబు 5 వ అధ్యాయము:1వ వచనములో ఉన్న ఈ వాక్యమును వాగ్దానముగా తీసుకొని మన యదార్థతను బట్టి మనకు న్యాయమును తీర్చే దేవుణ్ణి మనము ప్రార్థించి జవాబును పొందవచ్చు.

దేవుడు మనలను రక్షించగలడు.అన్న ఒక సత్యము ఈ వాక్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది అత్యంత కఠినమైన కష్టాల్లో కూడా దేవుడు నాతో ఉన్నాడు. ఉంటాడు ఆయన నా రక్షకుడు. అనే విశ్వాసంతో, ఏ బాధలోనైనా, ఏ పరీక్షలోనైనా దేవునిపై విశ్వాసం మనము ఉంచాలి. ప్రార్థన ద్వారా వాగ్దానముల ద్వారా దేవున్ని మనము ఆశ్రయించినప్పుడు ,ఆశ్రయదుర్గమైన దేవుడు మనకు కంచేగా కేడముగా కోటగా ఉంటాడు కాబట్టి ఏ అపాయమైనా ఏ కీడు అయినను మనలను తాకదు.

3 : పావురం : శాంతి సమాధానమునకు సూచన,

యోబుకు కలిగిన పరీక్ష తర్వాత కుమార్తె రూపంలో యోబుకు కలిగిన ఆశీర్వాదము యోబుకు యోబు కుటుంబమునకు శాంతిని సమాధానమును తీసుకుని వచ్చింది.

లూకా 2:14

సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక ! దేవునికి ఇష్టులుగా ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పటికీ ఏమి కోల్పోయే పరిస్థితులు ఏమి వచ్చినప్పటికీ వారి మార్గం దేవునికి ఇష్టమైనదిగా ఉంటే యదార్థ మార్గంలో వారు నడుస్తూ ఉంటే కచ్చితంగా దేవునికి ఇష్టమైన మనుషులకు ఈ భూమి మీద సమాధానము కలిగి తీరుతుంది.

యోబు తన జీవితంలో అన్నిటినీ కోల్పోయినప్పటికిని ఎటువంటి పరిస్థితులు గుండా తాను వెళ్లినప్పటికిని దేవుని దృష్టికి తాను యధార్థ హృదయము కలిగి దేవునిపై నిరీక్షణ ఉంచాడు కాబట్టి యోబు కోల్పోయిన శాంతిని సమాధానమును మరలా తిరిగి తాను పొందాడు.

నిత్య జీవము గురించి మానవుడు కోల్పోయిన, శాంతి సమాధానము ను తిరిగి పరిశుద్ధాత్మ ద్వారా నిర్మించబడిన, యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా తండ్రి అయిన దేవుడు మానవులకు అనుగ్రహించాడు. అందుకే (యోహాను 1:1) ఆదియందు వాక్య ముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.యోహాను 1:14

ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; అందుకే దేవుని మాటలు దేవుని వాక్యము ఆత్మీయు జీవమునై యున్నవి అని, పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది.

యోహాను 6:63

ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి, దేవుని వాక్యము జీవింప చేస్తుంది, జీవించే జీవితాన్ని ఇస్తుంది, ఈ జీవితంలో సమాధానామును ఇస్తుంది. ఆశీర్వాదాలను ఇస్తుంది. ఆత్మయు జీవమునై యున్న ఈ దేవుని వాక్యము, ఎక్కడ నివసిస్తుందో, అక్కడ శాంతి సమాధానము అన్నది, నిండుగా ఉంటుంది.

4. పావురం కొత్త ఆరంభానికి సూచన : –

నోవహు కాలంలో కొత్త ఆరంభానికి సూచనగా పావురం వచ్చి ఒలివ్ కొమ్ము తెచ్చినట్లుగా, యెమీమా ద్వార యోబు జీవితంలో ఓ కొత్త వెలుగు వచ్చింది. ఒలీవ చెట్టు ఎక్కువ కాలం జీవిస్తుంది. అంటే దీర్ఘకాలము జీవించే ఉంటుంది. పరిశుద్ధమైన పావురంతో పోల్చబడిన పరిశుద్ధాత్మ కూడా మానవునికి నిత్యజీవాన్ని మరి ఎన్నడు మరణానికి లోను కానీ, మహిమ శరీరాన్ని ఇవ్వటానికి, తనను పొందిన విశ్వసించిన ప్రజలను, నూతన సృష్టిగా నిర్మిస్తుంది.

హగ్గయి 2:9

ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించెదను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

యోబు 42 వ అధ్యాయంలో యోబు మరలా పొందిన ఆశీర్వాదాలు ముందుకంటే ఎక్కువగా, ప్రఖ్యాతి కలిగిన ఆశీర్వాదాలుగా అభివృద్ధి నుండి మహోభివృద్ధిని పొందిన ఆశీర్వాదాలుగా మనకు కనబడతాయి,

యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె, రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.యెహోవా యోబును మొదట ఆశీర్వదించి నంతకంటె, మరి అధికముగా ఆశీర్వదించెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు.

చివరిగా నేను ఇచ్చే సందేశం :

దేవునికి ఇష్టమైనవారికి సమాధానం"

ఇది మామూలు శుభవార్త కాదు, ఇది ఆకాశంలో ఆనందంతో ప్రకటించిన మహా సందేశం!

ఈ ప్రపంచంలో అందరూ సమాధానమును కోరుకుంటున్నారు. ధనవంతులు, బీదలు, ప్రభువులు, ప్రజలు—ఎవరైనా సరే వారు తమ జీవితంలో శాంతిని సమాధానములు కోరుకుంటారు. కానీ నిజమైన సమాధానం ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ చెప్పే సమాధానం స్పష్టంగా ఉంది: "దేవునికి ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగును."

ఈ శాంతి సమాధానము ఎక్కడిది? పరలోకం నుండి దిగివచ్చినది సమాధాన కర్తగా ఈ లోకానికి వచ్చిన యేసు క్రీస్తుప్రభువారిలో మాత్రమే నిజమైన శాంతి సమాధానం లభిస్తుంది. ఆయనను స్వీకరించిన వారికే ఈ శాంతి సొంతమవుతుంది.ఇది బాహ్య పరిస్థితులపై ఆధారపడదు – మనకు కష్టాలు వచ్చినా ఈ సమాధానం మన మనస్సులో ఉంటుంది.

దేవుని ఆలోచన ప్రకారము నడిచిన వారికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చే శాంతి ఎప్పటికీ నిలుస్తుంది. – యిది మన మంచితనంవల్ల కాదు, ఇది దేవుని అనుగ్రహం ద్వారా దేవుని కృప వల్లే ఇది మనకు దొరుకుతుంది.

మీరు దేవునికి ఇష్టమైన వారిలో ఒకరుగా వున్నారా! దేవుని మాటను దేవుని వాక్యమును అనుసరిస్తున్నారా! దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నారా !

యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న శాంతిని సమాధానము అనే ఆశీర్వాదమును ! పొందుకోని, దానిని అనుభవించే వారుగా, మీరు ఉందురు గాక ! నూతన సృష్టిగా నూతన ఆశీర్వాదాలతో మీరు నింప బడుదురు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్.

ఎస్తేర్ క్రైసోలైట్

18-2-2025