CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍀🍀🌿 📖🌿🍀🍀

బాప్తీస్మం – క్రీస్తులో మరణం, భూస్థాపన, పునరుత్థానం"

నమ్మి బాప్తీస్మం పొందినవాడు రక్షింపబడును

(మార్కు 16:16)

బాప్తిస్మం యొక్కప్రాముఖ్యత

1. ఆజ్ఞా పరిపూర్ణతకొరకు– యేసుక్రీస్తు ప్రభువు వారు తాను నీటిలో దిగి యోహాను ద్వారా నీటి బాప్తిస్మం పొందిన విధంగా, తన శిష్యులను కూడా బాప్తిస్మం పొందాలని తాను ఆజ్ఞాపించాడు (మత్తయి 28:19-20).

బాప్తిస్మం లేకపోతే రక్షణ ఉండదా?

బాప్తిస్మం అనేది రక్షించబడినవారు దేవుని ఆజ్ఞాగా రక్షణ సంపూర్తి కొరకు దీనిని అనుసరించాలి. ఎఫెసీయులకు 2:8-9 ప్రకారం, మనము పొందే రక్షణ విశ్వాసం ద్వారా దేవుని కృప ద్వారానే మనకు లభిస్తుంది. అయితే నిజమైన విశ్వాసం అనేది బాప్తిస్మం ద్వారా వ్యక్తీకరించబడాలి.

బాప్తిస్మం అనేది ఒక విశ్వాసికి కొత్త జీవితం ప్రారంభించే క్షణం. ఇది క్రీస్తుతో మనము ఏకమై ఉన్నాము. అని ప్రకటించే స పద్ధతి అది. యేసుక్రీస్తుప్రభు వారితో మనముకలిగి ఉన్న ఏకత్వాన్ని బలముగా వ్యక్తపరచే ఆత్మ సంబంధమైన ఒక అనుభవం యిది.

. కాబట్టి, "నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును" అన్న వాక్యమును ఎటువంటి సందేహానికి తావులేకుండా బోధించకలిగిన వాక్యము. ఇది— విశ్వాసముతో కూడిన బాప్తిస్మం మనము రక్షించబడిన జీవిత ప్రయాణంలోఇది ఒక ముఖ్యమైన అడుగు.

బాప్తిస్మం అనేది: యేసుక్రీస్తు ప్రభు వారి మరణంతో మనము ఈ లోక సంబంధమైన జీవితంలో మరణించబడి ఆయన సమాధి,ద్వారా మనలో ఉన్న ఈ లోక సంబంధమైన శరీర సంబంధమై ఆశలన్నీ సమాధి చేయబడి, ఆయన పునరుత్థానం ద్వార మనము నూతన జీవితమును పొంది, నూతన సృష్టిగా మనము చేయబడటమే, బాప్తిస్మమునకు అర్థము, అని మనం చెప్పవచ్చు.

"నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును" (మార్కు 16:16) అనే వాక్యము క్రైస్తవ జీవితంలో బాప్తిస్మానికి ఉన్న ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ బాప్తిస్మం దాన్ని రెండు రకాలుగా ఇవ్వటానికి మనము చూస్తున్నాం ఒకటి చిలకరింపు బాప్తిసం రెండు ముంచుడి బాప్తీసం ఈ రెండిట్లో ఏది సరి అయినది అసలు భాప్తిస్మం అనే దాని గురించి అపోస్తులైన పౌలు ఏమని తెలియజేస్తున్నాడు అని అంటే,

అపోస్తులుడైన పౌలు తన పత్రికలలో బాప్తిస్మాన్ని యేసుక్రీస్తు ప్రభువారి మరణం, భూస్థాపన, పునరుత్థానములతో పోలుస్తూ, ఇది యేసు యందు నమ్మకముంచే విశ్వాసికి ఒక ఆత్మ సంబంధమైన మార్పును సూచిస్తుందని వివరించాడు:

రోమీయులకు 6:4

కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి.

చిలకరింపు బాప్తిస్మం అనే దానిని ఎందుకు ఇవ్వకూడదు, చిలకరింపు బాప్తీస్మం ఎలా వచ్చింది.

మొదటి శతాబ్దపు క్రైస్తవులు ముంచుడు బాప్తీస్మమే ఇచ్చేవారు. కానీ, కాలక్రమంలో (చాలా శతాబ్దాల తర్వాత) రోగ గ్రస్తులకు మరణానికి దగ్గరగా ఉన్నవారికి నీరు చిలకరించడం అనుమతించారు. అయితే ఇది పరిశుద్ధ గ్రంథము బోధించిన విధానం కాదు.

చిలకరింపు బాప్తీస్మానికి బైబిల్లో ఎక్కడా ఆధారం లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆయన శిష్యులు, అప్పటి మొదటి శతాబ్దపు క్రైస్తవులు పూర్తిగా నీటిలో ముంచివేయడమే బాప్తీస్మంగా దానిని అనుసరించారు.

చిలకరింపు బాప్తీస్మం అన్నది అసలు ఎలా ప్రారంభమైంది?

పరిశుద్ధ గ్రంథం ద్వారా చెప్పబడుతున్న అసలైన బాప్తీస్మం పూర్తిగా నీటిలో ముంచివేయడం (Immersion) అయినప్పటికీ, చిలకరింపు ద్వారా బాప్తీస్మం అనేది మానవ సంప్రదాయంగా చాలా కాలాము తర్వాత ప్రారంభమైంది.

1. మొదటి శతాబ్దంలో సాధారణముగా బాప్తీస్మం ముంచుడు ద్వారా మాత్రమే చేసేవారు.

ప్రతీ ఒక్కరూ యేసు క్రీస్తు ప్రభువు వారి బోధ ప్రకారం పూర్తిగా నీటిలో ముంచబడే వారు.

2. రెండో శతాబ్దంలో అంటే (క్రీస్తు తర్వాత 150- నుంచి200) యియర్సు మధ్య కాలంలో

Didache కొన్ని ప్రాచీన క్రైస్తవ గ్రంథముల లో,వ్రాయబడిన రీతిలో చాలా నీరు అందుబాటులో లేకపోతే తలపై మూడు సార్లు నీరు పోయొచ్చు అని కొందరు అనుమతించారు. కానీ, ఇది అసలు అపోస్తలుల బోధన కాదు.

3. మూడో శతాబ్దం (క్రీస్తు తర్వాత 250 నుంచి-300): ఇయర్స మధ్యకాలంలో

కొన్ని విపరీతమైన కేసుల్లో, ముఖ్యంగా బాధపడుతున్న, మరణ పడకపై ఉన్నవారికి (Clinical Baptism) చిలకరింపు ద్వారా బాప్తీస్మం ఇచ్చారు. అయితే, ఇది చాలా అరుదైన ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే అనుమతించబడింది.

4. నాలుగో శతాబ్దం (క్రీస్తు తర్వాత 300- నుంచి 400): యియర్స్ వరకు

రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవ విశ్వాసం అధికారికమయ్యేదాకా, ముంచుడు బాప్తీస్మమే ప్రధానమైనది.కానీ, ఆ తర్వాత ప్రభుత్వం క్రైస్తవత్వంపై ఎక్కువ నియంత్రణ పెట్టి, దాన్ని రాజకీయ వ్యవస్థలో భాగం చేయడంతో, బాప్తీస్మంలో మార్పులు జరిగాయి.

5. మధ్యయుగ కాలం (క్రీస్తు తర్వాత 1200- నుంచి1500): ఇయర్స్ వరకు

కొంతమంది పెద్దలు, చిన్నపిల్లలు చనిపోతారని భయంతో పుట్టిన వెంటనే చిలకరించి బాప్తీస్మం ఇవ్వడం ప్రారంభించారు. ఇది న్యాయమైనదే అనుకున్నప్పటికీ, ఇది పరిశుద్ధ గ్రంథము బోధించే దానికే పూర్తిగా విరుద్ధమైనది.

చిలకరింపు బాప్తీస్మం బైబిలు ఆధారంగా కాదు, ఇది మానవ సంప్రదాయంగా ఏర్పడింది. అసలు బాప్తీస్మం అంటే ముంచుడు బాప్తీస్మం మాత్రమే అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెబుతోంది.

చిలకరింపు ద్వారా బాప్తిస్మం అనేది యేసుక్రీస్తు ప్రభునారి మరణంలో మనము సమాధి చేయబడుతున్నాం అనే ఆత్మసంబంధమైన భావమునకు ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది.

బైబిలు ప్రకారం,చిలకరింపు బాప్తీస్మం ఇవ్వకూడదు, ముంచుడు బాప్తిస్మమె నిజమైన బాప్తీస్మం అని అనటానికి, దీనిని బలపరిచే కొన్ని వాక్యాలు,

పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా చిలకరింపు (Sprinkling) బాప్తీస్మం గురించి ప్రస్తావించబడలేదు. బాప్తీస్మం అంటే పూర్తిగా నీటిలో ముంచివేయడం (Immersion) అనే అర్థంలోనే ఉన్నది.

పరిశుద్ధ గ్రంథము ఆధారంగా బాప్తీస్మం ముంచుడు ద్వారా జరగాలని చూపబడే వాక్యాలు:

1. మార్కు 1:9-10 – యేసు బాప్తిస్మం పొందినప్పుడు నీటి నుంచి పైకి వచ్చినాడు.

(ఇది ఈ వాక్యము క్రీస్తు పూర్తిగా ముంచివేయబడ్డారని చూపిస్తుంది.)

2. యోహాను 3:23

సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి.యోహాను బాప్తిస్మం ఎందుకు ఇచ్చాడు?అక్కడ నీళ్లు ఇస్తారముగా ఉన్నవి గనుక

(మంచినీరు ఉంటేనే కద! ముంచుడు బాప్తిస్మం ఇస్తారు చిలకరించాల్సిన అవసరం లేదు.)

3. అపోస్తలుల కార్యములు 8:36,37,38-39 వచనాలలో– ఫిలిప్పి బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఇద్దరూ నీటిలో దిగారు, బయటికి వచ్చారు.

(చిలకరింపు బాప్తిస్మం అయితే నీటిలో దిగాల్సిన అవసరం ఉండదు.)

4. రోమీయులకు 6:4 – మరణంలో పాలు పంచుకుని సమాధి చేయబడటం (ఇది పూర్తిగా ముంచివేయడం అనే అర్థాన్ని సూచిస్తుంది.)

కొలస్సీయులకు 2:12

మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడ లేచితిరి.

ముంచివేయడం అనేది, పూర్తిగా పాత జీవితం చనిపోయి, కొత్త జీవితం అన్నది ప్రారంభమయ్యే సంకేతం.సూచన సమాధి చేయడం అంటే, పూర్తిగా కప్పివేయడం. చిలకరింపు బాప్తిస్మం ద్వారా ఇది వ్యక్త పరచబడదు.

2. పాత జీవితం సమాధి చేయబడింది – కొత్త జీవితం లభించింది కొలస్సీయులకు 3:1,2,3,

మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;

ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడ దేవునియందు దాచబడి యున్నది.(నమ్మి బాప్తిస్మం పొందిన వారు పరలోక సంబంధమైన విషయాలను వెతికేవారిగా ఉండాలి.)

3. క్రీస్తుతో చనిపోవడం అంటే మన పాత స్వభావాన్ని పూర్తిగా వదిలిపెట్టడం.

ఇది యేసు మృతితో మన బంధాన్ని చూపుతుంది.

చిలకరింపులో మన పాత జీవితం పూర్తిగా సమాధి చేయబడినట్లు తెలియదు.

4. ఎఫెసీయులకు 2:7

క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను.

మనం ఇప్పుడు కొత్త జీవితం గడపాలి.

ముంచుడు బాప్తిస్మం అనేది ఇది ప్రజల ముందు ఒక సాక్ష్యము. యేసుక్రీస్తు ప్రభువు వారితో కలిసి సిలువలో మనము సిలువ వేయబడ్డాము.

1. గలతియులకు 2:20

నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.

2. గలతియులకు 5:24

క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నారు.

3. రోమీయులకు 6:6

ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు, పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము( మూలభాషలో-ప్రాచీన పురుషుడు) ఆయనతో కూడ సిలువవేయబడెనని యెరుగుదుము.

(మన లోక సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన కోరికలు శరీరసంబంధమైన సమస్త కార్యాలన్నీ కూడా క్రీస్తుతో కలిసి సిలువ వేయబడ్డాయని ఇది ఈ వాక్యము మనకు బోధిస్తుంది.) నమ్మి బాప్తిస్మం పొందటం అనేది, యేసు క్రీస్తుప్రభు వారితో, మన ఆత్మ సంబంధమైన బంధాన్ని ప్రకటించగలిగే, సాక్ష్యం ఇచ్చే, గొప్ప ఆత్మసంబంధమైన అనుభవం యిది, ఇది చిలకరింపు బాప్తిస్మం ద్వారా సాధ్యపడదని, పరిశుద్ధ గ్రంథము కూడా మనకు స్పష్టం చేస్తున్నా, వాక్యాలను ఇప్పటివరకు మనము చూసాము.

పరిశుద్ధ గ్రంథము చూపించిన విధంగా పూర్తిగా నీటిలో ముంచివేయడం వల్లనే, యేసుక్రీస్తు ప్రభువారి మరణ భూస్థాపన పునరుత్థానముల ద్వారా మనము మరణించి, సమాధి చేయబడి, యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థాన శక్తి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నూతన సృష్టిగా నూతనమైన జీవితంలోనికి మనము మారగలము.

2 కోరింథీయులకు 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;

ఈ లోక సంబంధమైన ఆశలను వదిలి, పరలోక జీవితానికి వారసులము అని, నీటిలో మునిగి తీసుకునే బాప్తిస్మం ద్వారా మాత్రమే, మనము ఈ లోకంలో సాక్ష్యము ఇవ్వగలము, మనలను చూసే ఇతరుల యెదుట సాక్షిగా నిలబడటం అన్నది, ఇది మన లక్ష్యం మన బాధ్యత కూడా అయి ఉన్నది.

చివరిగా నేను చెప్పాలని అనుకున్నది ఏమిటంటే, చిలకరింపు ద్వారా కాకుండా ముంచుడు బాప్తిస్మం అనే దానిని మనం తీసుకొనడం ద్వారా,

మనము శ్రమలలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు,

జయించలేని, నాన విధములైన పరిస్థితులలోమనం ఉన్నప్పుడు, నేను యేసు క్రీస్తు ప్రభువు వారి మరణ భూస్థాపన పునరుత్థానాలలలో బాప్తిస్మందు, నేను పాలి భాగము కలిగి ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువు వారి పునరుత్థాన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నాలో ఉంది, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, కాబట్టి దీనిని ఈ పరిస్థితిని నేను జయిస్తాను, నేను ముంచుడు బాప్తీస్మము తీసుకొనుట ద్వారా, క్రీస్తులో లేపబడి పరలోక రాజ్యంలో క్రీస్తుతో పాటు కూర్చున్నను, కాబట్టి దీనిని నేను క్రీస్తులో జయించాను, జయించేసాను, అన్నటువంటి ఒక నిరీక్షణ ఒక నమ్మకం ఒక అనుభూతి మనకు ముంచుడు బాప్తీస్మం ద్వారా మాత్రమే కలుగుతుంది.

1యోహాను 5:4

దేవుని మూలముగా పుట్టిన వారందరును(పుట్టినదంతయు లోకమును జయించును) లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే,

ఈ వాక్యమును విన్నటువంటి వారి హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు, ఈ వాక్యమును యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ఫలింపజేయును, గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్.

ఎస్తేర్ క్రైసోలైట్

18-2-2025