CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

వాక్యమే నా రక్షణ, వాగ్దానమే నా ధైర్యం

యెషయా 65:22- 23

నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచు కొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభ వింతురు•••••• ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు వారు యెహోవాచేత ఆశీర్వదింపబడినవారగుదురు వారి సంతానపువారు వారియొద్దనే యుందురు.

నిన్నటి దినమున గుజరాత్‌లో జరిగిన ప్రమాదము గురించి విన్నప్పుడు,నా హృదయంలో ఒక భారం కలిగింది దేవుని వాక్యము పట్ల అవగాహన లేకుండా

జీవించడమంటే ఏమిటో – ఆత్మయైన దేవుని మాటలు మన జీవితాలలో ఎటువంటి ప్రభావం కలిగిస్తాయో – గుర్తు చేసేలా ఒక వర్తమానం రూపంలో పంచుకోవాలనిపించింది.

ఒకసారి నా పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు కొంతమంది చిన్న పిల్లలు మరణానికి లోనైనా సంఘటనను నేను వింటూ వచ్చాను ఆ క్షణంలో నాకు ఒక్కసారి భయం అన్నది వచ్చింది

"ఈ మరణం అన్నది ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందా మనిషి ప్రాణానికి దేవుడు విలువ యివ్యడ ! ఏంటిది అని ఒక ఆలోచన నా మనసులో వచ్చింది "

నేను దాని గురించే ధ్యానం చేస్తూ వచ్చాను కానీ నా హృదయంలో ఒక బాధ అన్నది కలిగి ఉంది ఎందుకు అంటే మరణం అన్నది ఈ విషయంలో ఒక క్లారిటీ కావాలి నాకు ప్రభువా అని దేవుని నా మనసులో అడుగుతూ వచ్చాను

నాకు ఏ విషయంలోనైనా జవాబు అన్నది పరిశుద్ధ గ్రంథంలో నుంచే రావాలి అప్పుడే నా మనసు కుదుటపడుతుంది అలా నేను పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు ఈ వాక్యం నా కన్నులకు కనపడ్డది ఒక్కసారి నా హృదయంలో బాధంతా తీసివేయబడ్డది

ఎందుకంటే నా బిడ్డలు నా కడుపులో పడకముందే నేను దేవుని అడిగాను మీ కొరకు వాడబడటానికి నాకు బిడ్డలను ఇవ్వండి అని

నా పిల్లలు ఈ భూమి మీదకి రాకముందే వారి విషయంలో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు "జనములన్నిటికీ నీ సంతానము ఆశీర్వాదకరంగా ఉండును అని" అటువంటిది దేవుని వాగ్దానము నా బిడ్డల విషయంలో పూర్తిగా నెరవేరకముందే నా పిల్లలకు నష్టం ఎందుకు వస్తుంది ఇక్కడ నాకు "తాము చేసుకున్న ఫలమును పూర్తిగా అనుభవిస్తారు" అన్న ఈ వాక్యము నాలో ఒక విశ్వాసమును కలిగించింది.

అప్పటినుంచి పిల్లలకు కానీ యూత్ వాళ్లకు కానీ ఎటువంటి ప్రమాదాలు జరిగిన అని నాకు వినపడిన నాకు అసలు భయం అన్నది రాదు

యెషయా 65:22- 23 లో వున్న ఈ వాక్యమే నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది.

నా పిల్లల విషయంలో దేవుడు నాకిచ్చిన వాగ్దానమును నెరవేర్చకుండా మాట తప్పుతాడా తప్పడు.

నా పెద్ద కుమార్తెకు పూర్తి సమయం సేవలో ఉండటం అంటే నచ్చదు దేవునికి డబ్బులు ఇచ్చి నేను సేవను చేస్తా అంటూ ఉంటుంది తాను పుట్టకముందే తన పట్ల దేవునికి ఏ ఉద్దేశ్యం ఉందో నేను తనకి తెలియచేయాలని అప్పుడప్పుడు దేవుని ఉద్దేశంలో తన స్థితి ఏమున్నది అన్నది నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఒక మాట అంటూ ఉంటాను.

ఒకసారి ఇలానే నాతో మాట్లాడుతూ దేవుని రాకడ వచ్చేస్తే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరదు కదా! అప్పుడు ఏం చేస్తావు అని నన్ను ప్రశ్నించింది.

అప్పుడు నేను ఏమన్నాను అంటే దేవుడు నాకిచ్చిన వాగ్దానం నెరవేరకుండా రాకడ ఎలా వస్తుంది దేవుడు మాట తప్పుతాడా నా పిల్లల విషయంలో దేవుడు ఇచ్చిన మాట నెరవేరేవరకు నేను ప్రార్థిస్తూనే ఉంటాను నాలో అబ్బా తండ్రి అని మొర్రపెట్టే పరిశుద్ధాత్మ ఉంది అని చెప్పాను.

దేవుని రాకడను ఆపు చేసేది అడ్డగించేది పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మ ఎలా అడ్డగిస్తుంది? క్రీస్తుని విశ్వసించిన ప్రతి ఒక్కరి హృదయాలలో ఉండి వారి ప్రార్థనల ద్వారా దేవుని రాకడను అడ్డగిస్తుంది.

ఇటువంటి పరిశుద్ధాత్మ సామర్థ్యం ఉన్న వాళ్లు ఎవరైనా సరే ఆకస్మికంగా వచ్చే అపాయమును గ్రహిస్తారు దానిని ప్రార్థనతో ఆపు చేస్తారు యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని అంటే యిందుకే.

ఈ దినాలలో పరిశుద్ధాత్మ యొక్క స్వభావమును ప్రజలు గ్రహించడం లేదు ఆత్మ స్వభావము చేత నింపబడటం లేదు ఆ ఆత్మ చేత నడిపించబడటం లేదు కాబట్టే ఆకస్మికంగా జరిగే ప్రమాదాలకు లోను అవుతున్నారు.

"మన జీవితాలలో వాక్యమై ఉన్న దేవుని చేత మనకు క్షేమం అన్నది సమకూర్చబడాలి"

ఈ వాక్యమై ఉన్న దేవుణ్ణి ప్రక్కన పెట్టే వాళ్లు క్రైస్తవులు కాకపోయినా క్రైస్తవులు అయినా వారు చేసే ప్రతి దానిలో పరిశుద్ధాత్మ ముద్ర అన్నది ఉండదు కాబట్టి వారు అపాయానికి లోను అవుతారు.

ఈ దినాలలో దేవుని ఆత్మను అలక్ష్యం చేయకండి. దేవుని వాక్యము మీ జీవితములో బలంగా ఉండనివ్వండి. పరిశుద్ధాత్మ మీ జీవితంలోనికి వచ్చే అపాయాన్ని మీకు ముందుగానే తెలియజేసి , ప్రార్థన ద్వారా దానిని నిలిపివేస్తాడు. ఇది వాగ్దానం చేసిన దేవుని స్వభావము దేవుని గుణ లక్షణం.

మన పిల్లలు, మన కుటుంబం భద్రంగా ఉండాలంటే మనమందరం వాక్యము పట్ల గౌరవమును కలిగి ఉండటమే కాదు, పరిశుద్ధాత్మ నడిపింపులో నడవాలి అప్పుడే ఆకస్మికముగా కలుగు అపాయమునకు మన జీవితాల్లో చోటు వుండదు.

ఈ రోజు మీరు దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నింపుకొని , పరిశుద్ధాత్మ నడిపింపును మీరు కోరుకున్నవారైతే దేవుని వాగ్దానాలు మీ ఇంటిని, మీ పిల్లలను అపాయాలనుండి కాపాడతాయి. వాక్యమే రక్షణ, వాగ్దానమే ధైర్యం!

ఎస్తేరు క్రైసో ల్తెట్

(13- 6- 2025)

Written By: Sis.Esther Chrysolyte

Written On: 2-6-25

Written By: Sis.Esther Chrysolyte

Written On: 13-6-25