2025 Messages
🍃 🍀🌿📖🌿🍀🍃
యెఫ్తా నమ్మకమైన నాయకుడు
యెఫ్తా జీవితం మనకు నాయకుడు అనే వ్యక్తి ఎలా ఉండాలి అన్న నాయకత్వపు విషయమును ,దేవుని పట్ల ఎటువంటి విశ్వాసం అనే దానిని కలిగి ఉండాలో దేవునికి చేసిన ప్రమాణము నెరవేర్చె విషయంలో ఎటువంటి నమ్మకత్వం అన్నది కనుపరచాలో ఇటువంటి అనేక అంశాలలో మనకు అనేక పాఠాలను యెఫ్తా జీవితం మనకు నేర్పిస్తుంది.
యెఫ్తా ఒక గౌరవించబడని వ్యక్తిగా జీవితం ప్రారంభించినా, దేవుని పై నమ్మకంతో, తనను ఆశ్రయించిన తన ప్రజల రక్షణ కోసం తనకు సంబంధించిన వాటిని దేవునికి అంకితం చేసిన నాయకుడిగా సరియైన న్యాయమును తీర్చే న్యాయాధిపతిగా తాను మనకు కనపడతాడు.
యెఫ్తా గిలాదు వారి ద్వారా తన సహోదరుల ద్వారా అవమానించబడి తన తండ్రి ఇంటి నుండి గెంటి వేయబడి ఉన్నప్పటికీ గిలాదు పెద్దలు వచ్చి తనను ఆశ్రయించి వేడుకొనినప్పుడు తనను బాధించిన పాత జ్ఞాపకాలన్నిటిని మరిచిపోయి గీలాదు పెద్దలు తనతో చేసిన నిబంధనలో తాను ఐక్యమవుతాడు యెఫ్తా చేసిన ఈ నిర్ణయం తనకు క్షమాగుణం కలిగినవాడిగా తనను ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడిగా యెఫ్తాను ఇక్కడ మనకు ప్రత్యక్ష పరుస్తుంది.
న్యాయాధిపతులు 11:8,9,10
అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీయొద్దకు మళ్లి వచ్చితిమి; నీవు మాతోకూడ వచ్చి అమ్మోనీయులతో యుద్ధముచేసిన యెడల, గిలాదు నివాసులమైన మా అందరిమీద నీవు అధికారి వవుదువని యెఫ్తాతో అనిరి.
అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసికొని పోయినమీదట, యెహోవా వారిని నా చేతి కప్పగించిన యెడల, నేనే మీకు ప్రధా నుడనవుదునా? అని గిలాదు పెద్దల నడుగగా,
గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాటచొప్పున చేయుదుము; యెహోవా మన యుభయుల మధ్యను సాక్షిగా ఉండును గాకని యెఫ్తాతో అనిరి.
యెఫ్తాలో కనబడుతున్న ఇంకొక శ్రేష్టమైన లక్షణం ఏమిటంటే గిలాది పెద్దలు అందరూ యెఫ్తాను తీసుకుని వచ్చి తనని ప్రధానిగా వారందరి మీద అధికారిగా యెఫ్తా ను చేసినప్పుడు యెఫ్తావెంటనే తనకు సంభవించిన ఈ సంగతులన్నిటిని యెహోవా దేవునికి తాను తెలియజేస్తూ వచ్చాడు.
న్యాయాధిపతులు 11:11
కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతోకూడ పోయినప్పుడు, జనులు తమకు ప్రధానుని గాను అధిపతినిగాను అతని నియమించు కొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి యంతయు వినిపించెను.
అమ్మోనీయులతో యుద్ధము చేయటానికి, గిలాదు ప్రజల పక్షముగా నాయకత్వం వహించడానికి, ఈ ప్రజలందరూ నాకుబాధ్యతలను అప్పగించారు, నాకు జయము నిచ్చే దేవుడవు మీరే, అనే భావంతో వెంటనే తాను ఈ సంగతులన్నీయు ప్రార్థన రూపంలో దేవునికి తెలియజేస్తూ వచ్చినట్లు, ఈ వాక్యంలో మనకు కనపడుతుంది.
🙏 జనులు తనని ప్రధానిగా చేసినప్పుడు, తాను ఈ విషయంలో తన ఇంటి వారికి గానీ తన స్నేహితులకు గాని తాను చెప్పలేదు. కానీ దానికి సంభవించిన దాని అంతటిని, మొట్టమొదటగా ప్రార్థన రూపంలో దేవుని సన్నిధిలోకి వెళ్లి దేవునికి తెలియజేశాడు. 🔔
ఇక్కడ యెఫ్తా దేవునికి ప్రథమ స్థానమును ఇచ్చే వ్యక్తిగా, ఇక్కడ మనకు కనబడుతున్నాడు. దేవునికి ప్రథమ స్థానము ఇచ్చే ఎవరికైనా, ఎవరు ఏ విషయంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తారో, ఆ విషయంలో కచ్చితంగా దేవుడు వారికి విజయాన్ని ఇస్తాడు. అని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది.
సొంత బలము సొంత శక్తి మీద కాకుండా, దేవునిపై ఆధారపడే వ్యక్తులు ఎవరైనా సరే, వారి జీవితంలో ఏది జరిగినప్పటికిని, అది దేవుని దగ్గర దాచకుండా, సమస్తము దేవుని సన్నిధిలోకి వెళ్లి వారు తెలియజేస్తూ ఉంటారు, వారికి కలిగిన ప్రతి అవసరతను కూడా, అది ప్రజల పక్షాన ఉన్నప్పటికీని, దానిని దేవునికి తెలియజేస్తూ ఉంటారు, ఇది దేవునితో అనుదినము సహవాసం కలిగిన వారి జీవితంలో జరిగే పద్ధతి ఇది, యెఫ్తా లో ఉన్నటువంటి ఈ లక్షణం, తాను దేవునిపై ఆధారపడే వ్యక్తిగా, తన గురించి సమస్తము దేవునికి తెలియజేసే వ్యక్తిత్వము కలిగియున్న వ్యక్తిగా, యెఫ్తా ఇక్కడ మనకు కనబడుతున్నాడు.
ఇక్కడ యెఫ్తా మనకు ప్రజల పక్షాన, దేవునికి విజ్ఞాపనలు చేసే వ్యక్తిగా, ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఒక సమాజంగా, ఒక సంఘాముగా, ఒక కుటుంబంగా, దేవుడు మనకు ఏ బాధ్యతను అయినా ఇస్తే, దాని నిమిత్తము మనము, ప్రార్థించే వారముగా ఉండాలి, ఎవరైనా దేవుని ప్రజలు, వారి ప్రార్థన అవసరతలను, మనకు ఇచ్చినప్పుడు, వారి కొరకు మనము దేవుని దగ్గర విజ్ఞాపన చేసే వారముగా మనం ఉండాలని, మనకు వచ్చిన బాధ్యతను బట్టి, మనము ముందు దేవుని సన్నిధికి వెళ్లి దేవుని సహాయాన్ని అడగాలి, అన్న
విషయము యెఫ్తాచేసిన, దానిని బట్టి మనము గ్రహించగలము.
న్యాయాధిపతులు 11:27
ఇట్లుండగా నేను నీ యెడల తప్పు చేయలేదు గాని, నీవు నామీదికి యుద్ధమునకు వచ్చుట వలన నాయెడల దోషము చేయుచున్నావు. న్యాయాధి పతియైన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీ యులకును న్యాయము తీర్చును గాక.
యెఫ్తా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి ఎలా వచ్చారు, ఆ మార్గములో ఎవరు వారికి ఎటువంటి ఆటంకాలు కలుగ చేశారో,ఈ విషయాలన్నీయు తాను గ్రహించి ఉన్న వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు, అంతేకాక న్యాయాధిపతి అయిన దేవుడు తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు. అని దేవుని న్యాయ విధులను గూర్చి తెలిసిన వ్యక్తిగా, తమ దేవుడు న్యాయవంతుడు అని దేవుని గూర్చి అమ్మోనీయులకు తాను సాక్ష్యం ఇస్తూ వచ్చాడు,
యెఫ్తాలో ఉన్న ఈ మంచి లక్షణమును చూసిన దేవుడు, యెఫ్తా అమ్మోనీయుల దగ్గరకు వెళ్లిన వెంటనే యెఫ్తా తాను చేసే యుద్ధములో, విజయమును పొందట కొరకు, యెహోవా ఆత్మ యెఫ్తామీదికి వచ్చినట్లు ఇక్కడ మనకు కనబడుతుంది. న్యాయాధిపతులు 11:29
యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా, అతడు గిలాదు లోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పే లో సంచరించి, గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను.
అంటే అమ్మోనీయులతో యుద్ధము చేయటానికి, యెహోవా ఆత్మ యెఫ్తాను అభిషేకించిందా! అవుననే చెప్పాలి, అందుకే మనం ఏ విషయంలో విజయాన్ని పొందాలి అని అన్నా, ఆ విజయాన్ని పొందటానికి అవసరమైన అభిషేకాన్ని, మనము యెఫ్తా దేవుని ప్రార్థించి, యెహోవా ఆత్మను తాను పొందినట్లు, దేవుని ప్రార్థించుట ద్వారా మాత్రమే, మనము పొంద గలుగుతాము, అన్న ఒక సత్యము ఇక్కడ, యెఫ్తా జీవితము ద్వారా మనకు తెలియ జేస్తుంది.
తనను ఆశ్రయించిన గీలాదు ప్రజల క్షేమం కోసం, తన కుటుంబాన్ని పక్కన పెట్టిన యోధుడుగా, న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో మనకు కనపడతాడు. న్యాయాధిపతులు 11:30
అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కు కొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చ యముగా అప్పగించినయెడల,
న్యాయాధిపతులు 11:31
నేను అమ్మోనీయులయొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా యింటి ద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహన బలిగా దాని నర్పించెదననెను.
యెఫ్తా తన కుటుంబం ద్వారా, తిరస్కరించబడ్డ వ్యక్తి, (న్యా. 11:1-3). కానీ, తన ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు, వారి కోసం తన వ్యక్తిగత బాధను పక్కన పెట్టి నాయకుడిగా నిలబడ్డాడు.
యుద్ధానికి వెళ్లేముందు తన స్వంత విజయాన్ని కాక, ప్రజల రక్షణకే ప్రాధాన్యతను ఇచ్చి తాను దేవునితో ఒక నిబంధనను చేశాడు, న్యాయా 11:30
అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కు కొనెను, ఎట్లనగానీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చ యముగా అప్పగించినయెడల,
న్యాయాధిపతులు 11:31
నేను అమ్మోనీయులయొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు
నా యింటి ద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహన బలిగా దాని నర్పించెదననెను.
నా యింటి ద్వారమునుండి బయలుదేరి, వచ్చునదేదో, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, అని యెఫ్తా చెప్పడం అనేది, తన సొంత కుటుంబం కన్నా తనను ఆశ్రయించిన, తన ఆధీనంలో ఉన్న ప్రజల రక్షణకు, అధిక ప్రాధాన్యత ఇచ్చాడనే, అంశాన్ని ఇక్కడ మనకు రుజువు చేస్తుంది. ఒక నాయకుడికి వుండ వలసిన లక్షణానము, యెఫ్తా లో మనకు కనబడుతు వుంది, దేవునికి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు యెఫ్తా,
🌹యుద్ధంలో విజయం సాధించి ఇంటికి వచ్చేసరికి, తన కుమార్తెనే తన ముందుకు వచ్చింది. ఇది ఆయనకు అత్యంత కఠినమైన నిర్ణయ సమయం.
అయితే, తాను చేసిన వాగ్దానాన్ని మార్చుకోకుండా, సమస్తమును పోగొట్టుకున్న, దేవుని విషయంలో మాత్రము నమ్మకత్వమును పోగొట్టుకొనక, యదార్ధవంతుడైన యోబు లాగా యెఫ్తా దేవునికి నమ్మకంగా తాను చేసిన ప్రమాణంలో నిలబడ్డాడు (న్యా. 11:35).
ఈ నిర్ణయం యెఫ్తా తన వ్యక్తిగత ఇంటిలోని ప్రియమైనవారిపై కాక, తన నిబద్ధతపై ఎక్కువగా దృష్టి పెట్టిన నాయకుడని సూచిస్తుంది.యెఫ్తా దేవునికి తాను ఇచ్చిన ప్రమాణమును మాట వరకే కాకుండా, దానిని కార్యరూపం వరకు తీసుకుని వచ్చాడు, కాబట్టి, యెఫ్తా నిబద్ధతతో కూడిన క్రియాశీలి నాయకుడు అని, యెఫ్తా గురించి మనము చెప్పవచ్చు, ఇది దేవుని సేవలో ఉన్నవారు, దేవుని కార్యాల కొరకు దైవ సంబంధమైన విషయాల కొరకు, తమ వ్యక్తిగత విషయాలను, ఎలా పక్కన పెట్టాలో, ఇది మనకు ఓ గొప్ప ఉదాహరణ.
యెఫ్తా ద్వారా దేవుడు మనకు ఏమి సందేశం ఇస్తున్నాడు అని అంటే, నాయకత్వం అంటే అధికారం, పదవి స్వప్రయోజనాలను చూసుకొనటం కాదు కానీ స్వప్రయోజనాల కంటే దేవుడిచ్చిన బాధ్యత త్యాగము, దేవునికి ఇచ్చిన మాట ప్రమాణంలో నెరవేర్చటము అని మనకు గుర్తుచేస్తున్నాడు.
యెఫ్తా తన కుమార్తె విషయంలో చేసిన నిర్ణయం అన్నది వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో, బాధ్యతాయుతంగా వ్యవహరించడంలో, ఎంతటి దృఢత అవసరమో, ఇది మనకు తెలియజేస్తుంది.అందుకే మనము కూడా దేవునికి ఇచ్చే మాటల్లో నిబద్ధత తో ఉండాలి.
నాయకత్వం అన్నది, ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా కనిపించదు. ఒక్కొక్కరికి ఒక్క రీతిలో అది కనపడుతూ ఉంటుంది, ఇవి యెఫ్తాలో నాకు కనపడిన నాయకత్వపు లక్షణాలు.
ఎస్తేర్ క్రైసోలైట్
12-2-2025