CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍃 🍀🌿📖🌿🍀🍃

యెఫ్తా కుమార్తె

( యెఫ్తా కుమార్తె బలిగా అర్పించబడిందా ? )

యెఫ్తా కాలంలో (న్యాయాధిపతుల కాలం) "దేవునికి ప్రతిష్టించుట" అనే పద్ధతి ప్రధానముగా రెండు రకాలుగా మనకు కనిపిస్తుంది.

1. బలి (Sacrificial Dedication) – ఏదైనా జీవిని కాని వస్తువును కాని దేవునికి పూర్తిగా అంకితం చేయడం.

2. ఆయుష్కాలపుసేవ (Lifelong Service) – ఒక వ్యక్తిని దేవుని మందిర సేవకు అంకితం చేయడం (నాజీరు వ్రతం లేదా లేవీయుల సేవ).

దేవునికి ప్రతిష్టించుట – హెబ్రూ పదం "హెరెం" (חרם, Herem) "హెరెం" అంటే పూర్తిగా దేవునికి అంకితం చేయడం, దానిని మళ్ళీ సాధారణ మైన పనుల కొరకు మానవులు తమ వినియోగానికి ఉపయోగించకూడదు.

ఇది కొన్ని సందర్భాల్లో "నాశన ప్రాయమైన అంకితము" (Devoted to destruction) అనే అర్థంలోనూ ఉపయోగించబడింది (ద్వితీయోపదేశకాండము 7:1-6; యెహోషువ 6:17). యెహోషువ కాలంలో యెరికో నగరాన్ని పూర్తిగా దేవునికి ప్రతిష్టించారు – ఇది హెరెం అంకితమైనది (యెహోషువ 6:17).

యెఫ్తా తన కుమార్తెను దేవునికి "హెరెం" చేసాడా? లేక ఆమె మందిర సేవకు అంకితమైందా? అనే భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్న ఈ విషయమును ఇప్పుడు మనము తెలుసుకుందాం.

యెఫ్తా కుమార్తె ప్రతిష్ట – రెండు ప్రధాన సిద్ధాంతాలు

(A) యెఫ్తా కుమార్తె బలిగా అర్పించబడింది (Literal Sacrifice Interpretation)

న్యాయాధిపతులు 11:31

నేను అమ్మోనీయులయొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా యింటి ద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహన బలిగా దాని నర్పించెదననెను.

పాత నిబంధన కాలంలో కొంతమంది అన్యజనులు మానవ బలిదానాలు చేస్తూ ఉండేవారు మోలెకు (మెలెక్) అనే ఆచారం గురించి బైబిల్లో స్పష్టమైన ప్రస్తావన ఉంది. అన్యజనులు తమ పిల్లలను మోలెకు (Molech) అనే దేవతకు బలిగా అర్పించేవారు, ఇది దేవుడు కఠినంగా నిషేధించిన ఆచారం. ఉదా. మోలెకు దేవునికి బలులు లేవీయకాండము 18:21 నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలెకు నిమిత్తము అగ్ని గుండమును దాటనీయ కూడదు; నీ దేవుని నామమును అపవిత్ర పరచ కూడదు, నేను యెహోవాను.

ద్వితియోప దేశకాండము 12:31

తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవు డైన యెహోవాను గూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతలపేరట తమ కూమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చి వేయుదురు గదా. అన్యజనులు తమ పిల్లలను అగ్నిలో కాల్చి మోలెకు దేవతకు బలిచ్చేవారని ఈ వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది.

మోలెకు బలి – ఆచారం ఎలా ఉండేది?

మోలెకు అనేది అమ్మోనీయుల దేవత, దీన్ని తప్పుడు మార్గంలో ఇశ్రాయేలీయులు కూడా అనుసరించారు. ఈ విగ్రహం పొయ్యిలో వేడెక్కిన విధంగా ఉండేది. ప్రజలు తమ పిల్లలను వేడి బాహువులపై ఉంచి అర్పించేవారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా తాండవ నృత్యాలు, బేడూర్లు, మంత్రోచ్చారణలు ఉండేవి.

పిల్లలు కేకలు వేయకుండా బిగువుగా మృదంగాలు, వాయిద్యాలు వాయించేవారు.

యిర్మియా 7:31

నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్‌ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు.

పరిశుద్ధ గ్రంథంలో మోలెకు బలిప్రదానం స్పష్టంగా ప్రస్తావించబడింది. ఇది అన్యజనుల క్రూరమైన ఆచారం, దీన్ని దేవుడు ఖండించి, నిషేధించాడు.

యోషియా వంటి భక్తి కలిగిన రాజులు దీన్ని ఈ బలిపీఠాన్ని నాశనం చేశారు (2 రాజులు 23:10).

ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞను విస్మరిస్తే, వారు కూడా ఈ భయంకరమైన పాపానికి గురయ్యారు (యిర్మియా 32:35). అహాజు, మనష్షే వంటి రాజులు అన్యజనుల ఆచారాన్ని అనుసరించి తమ పిల్లలను మోలెకు బలిచ్చారు (2 రాజులు 16:3; 2 దినవృత్తాంతము 33:6).

అయితే, ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రం మానవ బలిని నిషేధించింది, (లేవీయకాండము 20:2-5).

దేవుడు మానవ బలులను ఎందుకు నిషేధించాడు?

1. మానవజీవితాన్ని పవిత్రమైనదిగా చూచాడు (ఆదికాండము 9:6).

2. ఇదంతా అన్యజనుల అసహ్యమైన ఆచారం కాబట్టి (ద్వితీయోపదేశకాండము 18:9-12).

3. దేవుడు దహనబలులను కోరుకునేవాడు కాదు కాబట్టి (యిర్మియా 19:5).

4. దేవుని మీద ఉంచాల్సిన భక్తికి విభిన్నంగా నాశనములు తీసుకుని వచ్చే అన్యజనుల ఆచారంగా ఇది భావించబడింది కాబట్టి (కీర్తనలు 106:37-38).

ఇది దేవుని నిబంధన ప్రకారం కఠినంగా నిషేధించబడిన ఆచారం.

మోలెకు బలిదానం చేసే వారిని రాళ్లతో కొట్టి చంపాలని దేవుడు ఆజ్ఞాపించాడు.

దీని ద్వారా దేవుని క్రమానికి వ్యతిరేకంగా వెళ్ళేవారు కఠినంగా శిక్షించబడతారని తెలుస్తుంది. అందుకనే అబ్రహాము తన కుమారుడిని దహనబలిగా అర్పించడానికి సిద్ధపడినప్పుడు, దేవుడు దానికి ఒప్పుకోక అక్కడ ఇస్సాకుకు మారుగా

బలిగా అర్పించడానికి పొట్టేలును చూపించాడు.

ఆదికాండము 22:13

అప్పుడు అబ్రాహాము కన్ను లెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులు కొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఈ వాక్యాల అన్నిటి సారాంశములను బట్టి మనకు అర్థము అయ్యేది ఏమిటంటే, యోఫ్తా కుమార్తె దహనబలిగా అర్పింపబడలేదు, ఇది ఖచ్చితమైన విషయముగా మనకు అర్థం అవుతుంది, యోఫ్తాకు దేవుడు నిషేధించిన ఆచారం గురించి తెలిసే ఉంటుంది.

ఎస్తేర్ క్రైసోలైట్

8-2-2025