2025 Messages
🍃 🍀🌿📖🌿🍀🍃
రెండవ సిద్ధాంతము ఏమిటంటే,
(B) యెఫ్తా కుమార్తె మందిర సేవకు అంకితమైంది (Temple Dedication Interpretation)
నాజీరు జీవితం త్యాగానికి సంకేతం:
సంఖ్యాకాండము 6:1-21 లో నాజీరు ప్రమాణం గురించి స్పష్టంగా ఉంది, అందులో పురుషులే కాకుండా స్త్రీలు కూడా దేవునికి అంకితం చేయబడవచ్చని తెలుస్తుంది.
సంఖ్యాకాండము 6:2
పురుషుడేగాని స్త్రీయేగాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్నుతాను ప్రత్యేకించు కొనినయెడల యెఫ్తా కుమార్తె తన జీవితాన్ని దేవునికి అంకితం చేసినట్లుగా బైబిలు సూచిస్తోంది (న్యా. 11:39-40).
యెఫ్తా కుమార్తెను నాజీరు లేదా దేవుని మందిర సేవకు అంకితం చేశాడనే అభిప్రాయం బలంగా ఉంది. కారణం ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రం మానవ బలిని నిషేధించింది కాబట్టి,
( లేవీయకాండము 20:2,3
ఇశ్రాయేలీయులలోనేగాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనేగాని యొకడు ఏ మాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చినయెడల వానికి మరణ శిక్ష విధింపవలెను; మీ దేశప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును.
1, లేవీయకాండము 20:2-5 – మోలెక్ బలి ఇచ్చినవారికి మరణదండన.
2, 2 రాజులు 23:10 –
3 యోషీయా మోలెక్ బలిని అరికట్టాడు.
4, యిర్మీయా 32:35 – దేవుడు మానవ బలిని అస్సలు కోరడని స్పష్టత.
5 , లేవీయకాండము 18:21 – మోలెక్ బలి నిషేధం.
ఆదాము ద్వారా మానవులందరూ, నిత్య మరణమును పొందవలసిన వారై ఉండగా, మరణం నుంచి మానవుని తప్పించడానికి, యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి, మన కొరకు తాను మరణించి, తిరిగి లేచి మనకు నిత్యజీవాన్ని, నూతన జీవితమును ఇచ్చిన, ఆ కరుణామయుడు, నరబలిని కొరతాడ ! మానవుడే దహనబలిగా తనకు అర్పించబడాలని కోరుకుంటాడా! లేదు, అది ఎన్నటికీ జరగదు ! తన ప్రాణమును పెట్టే అంతగా, మానవులను, ప్రేమించిన దేవుడు,
( సంఖ్యా 11: 29,30,31,) యెఫ్తామీదికి వచ్చిన యెహోవా ఆత్మ, యెఫ్తా తాను యుద్ధంలో గెలిచి, అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి రావడానికి, తాను చేసిన మ్రొక్కుబడిని ఆలకించిన దేవుడు, యెఫ్తా తన కుమార్తెను, దహన బలిగా అర్పిస్తూ ఉంటే, చూస్తూ ఉంటాడని, దేవుని ప్రేమను, దేవుని వ్యక్తిత్వమును, గుర్తించిన, అనుభవించిన, వారు ఎవరైనా అనుకుంటారా అసలు !
అయితే యెఫ్తా తన కుమార్తెను ఏమి చేశాడు :
ఆమె మరణించినట్లు స్పష్టమైన ప్రకటన లేదు, కానీ ఆమె వివాహం చేసుకోకుండా జీవించిందని చెప్పబడింది న్యాయాధిపతులు 11:38, 39, 40,
అతడు పొమ్మని చెప్పి రెండు నెలలవరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడ పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను.
ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రియొద్దకు తిరిగిరాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిచొప్పున ఆమెకు చేసెను.
ఆమె పురుషుని ఎరుగనేలేదు. యెఫ్తా తన కుమార్తెను దేవుని మందిర సేవకు అంకితం చేశాడని భావించవచ్చు, ఎందుకంటే ఆమె జీవితాంతం అవివాహితగా ఉండిపోయింది.
కొన్ని పరిశోధనల ప్రకారం, యెఫ్తా కుమార్తె దేవునికి అంకితం అయి జీవితం పొడవునా కన్యత్వాన్ని పాటించింది. న్యాయాధిపతులు 11:38
తన కన్యాత్వమునుగూర్చి ప్రలాపించెను.
అనే వాక్యం, ఆమె బలి కాబడ లేదని సూచిస్తోంది.
లేవీయుల 27:1-8 ప్రకారం, ఒక మనిషిని దేవునికి అంకితం చేయడం అంటే ఆ వ్యక్తి దేవుని సేవలో జీవితం గడపడం అనే అర్థం కూడా కలిగి ఉంటుంది.
యెఫ్తా కుమార్తె ఆలయ సేవకు అంకితమైనదనే అభిప్రాయం :
న్యాయాధిపతులు 11:39-40 ప్రకారం, "ఆమె పురుషుని ఎరుగలేదు" అని ప్రత్యేకంగా చెప్పబడింది. ఇది ఆమె జీవితాంతం కన్యగా ఉన్నట్లు సూచిస్తుంది, దీని ద్వారా ఆమె ఆలయ సేవకే అంకితమైందని చెప్పవచ్చు.
పాత నిబంధనలో స్త్రీలు దేవుని సేవలో అంకితమయ్యే ఉదాహరణలు ఉన్నాయి (1 సమూయేలు 2:22 – మందిరంలో సేవ చేసే స్త్రీలు).
అన్నా ప్రవక్తి (లూకా 2:36-37) కూడా ప్రార్థనలతో ఉపవాసాలతో తన జీవితాన్ని దేవుని మందిరంలో గడిపింది, కాబట్టి యెఫ్తా కుమార్తె కూడా దేవుని సేవకు అంకితమైనదని చెప్పొచ్చు.
యెఫ్తా గిలాదు వాడుగా తెలియ పరచ బడ్డాడు న్యాయాధిపతులు 11:1 గీలాదీయులు మనష్షే గోత్రానికి చెందినవారు యెహోషువ 17 : 1-3
ఇటువంటి గోత్రానికి చెందిన యెఫ్తా కుమార్తె పరిచర్య చేయుట కొరకు వివాహం కానీ ఒక కన్యగా దేవుని మందిరంలో ఎలా ప్రతిష్టింపబడ్డది.
లేవీయులు కాని వారికి మందిరంలో సేవ చేసే అవకాశం ఉందా?
ఇశ్రాయేలీయులలో మందిర సేవ సాధారణంగా లేవీయుల వంశానికి చెందిన వారికే కేటాయించబడింది సంఖ్యాకాండము 3:10
నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును.(సంఖ్యా 3:5-10). అయితే, లేవీయులు కాని వ్యక్తులు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దేవునికి అంకితమై సేవ చేయగలిగిన విషయాలు బైబిల్లో కనిపిస్తాయి.
నాజీరు వ్రతం – లేవీయులు కాని వ్యక్తులకు కూడా అవకాశం (సంఖ్యాకాండము 6:1-21)
నాజీరు వ్రతం పురుషులు, స్త్రీలు యిద్దరికి అందుబాటులో ఉండేది.
ఒక వ్యక్తి తన జీవితాంతం నాజీరు వ్రతం చేపడతానని నిశ్చయించుకుంటే, అతను/ఆమె దేవునికి ప్రత్యేక సేవకులుగా గణించబడేవారు.
వారు లేవీయులు కాకపోయినా, ఇతర వ్యక్తులు కూడ దేవుని సేవలో జీవితాంతం అంకితమయ్యే మార్గంగా చూపబడింది. ఇది ఈ విషయము యెఫ్తా కుమార్తె మందిర సేవలో ఉండే అవకాశాన్ని బలపరుస్తుంది.
ప్రవక్తులైన స్త్రీలు – దేవునికి అంకితమైన మహిళలు
దెబోరా (న్యాయాధిపతులు 4:4)
హుల్దా (2 రాజులు 22:14)
అన్నా ప్రవక్తురాలు (లూకా 2:36-37) → ఆమె దేవాలయంలో నిరంతరం ఉపవాసము, ప్రార్థనతో సేవ చేసేది. ఇవన్నీ, లేవీయులుకాని స్త్రీలు కూడా దేవుని సేవలో పాల్గొనవచ్చని సూచిస్తాయి.
ఈ దినములలో కూడ మనము చూస్తూ ఉన్నాము. అవి ఏమిటంటే, దేవుని సువార్త కొరకు మాత్రమే కాకుండా, విద్య వైద్యం లాంటి పరిచర్యను కూడా, చేయుట కొరకు, కొన్ని క్రైస్తవ సంస్థలలో స్త్రీలు వివాహం చేసుకోకుండా, వారిని వారు ప్రతిష్టించుకుని, ఆ పనులను ఆ బాధ్యతలను వారు చేస్తూ ఉండటాన్ని, మనము ఈరోజుకు కూడా చూస్తూ ఉన్నాము, బహుశా ఇది యెఫ్తా కుమార్తె నుంచి వచ్చినదేమో, అని నాకు అనిపిస్తూ ఉంటుంది.
ఎందుకంటే న్యాయాధిపతులు 11:40
ఆమె పురుషుని ఎరుగనేలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రా యేలీయుల కుమార్తెలు నాలుగు దినములు గిలాదుదేశస్థు డైన యెఫ్తా కుమార్తెను "ప్రసిద్ధిచేయుటకద్దు".అన్న వాక్యం భాగములను బట్టి నేను ఇటువంటి భావమును కలిగి ఉన్నాను,
ఈ వాక్యంలో "ప్రసిద్ధి చేయుటకద్దు" అంటే ఏమిటి?
ఈ పదాన్ని బట్టి ఇశ్రాయేలీయుల కుమార్తెలు ప్రతి ఏడాది నాలుగు రోజులు యెఫ్తా కుమార్తెను గూర్చి గుర్తుచేసే ఒక సంప్రదాయం కొనసాగించారు.
1. ఆమె మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటమా?
కొందరు భావిస్తున్నట్టు యెఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చినట్లయితే, ఆమె జ్ఞాపకార్థం ప్రతి ఏడాది నాలుగు రోజులు ఆమె మరణాన్ని దుఃఖించడానికి ఈ సంప్రదాయం పెట్టబడింది.
అయితే, ఈ వాక్యంలో "విలపించుట" అనే పదాన్ని కాకుండా, "ప్రసిద్ధి చేయుట" అనే పదాన్ని ఉపయోగించడం మనము గమనించాల్సిన విషయం.
2. ఆమె దేవునికి అంకితం చేయబడిందా?
"ఆమె పురుషుని ఎరుగనేలేదు" (She never knew a man) అనే వాక్యం, ఆమె జీవితాంతం కన్యగా ఉండిపోయిందని స్పష్టంగా సూచిస్తోంది.
పరిశుద్ధ గ్రంథంలో నాజీరు ప్రమాణం (Numbers 6:1-21) ప్రకారం, కొందరు వ్యక్తులు దేవునికి ప్రత్యేకంగా అంకితం చేయబడేవారు.
కాబట్టి, యెఫ్తా కుమార్తె నాజీరు మాదిరిగా దేవునికి అంకితం చేయబడిందనే, అభిప్రాయం బలంగా ఉంది. ఈ అర్థంలో, ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీయుల కుమార్తెలు ఆమె త్యాగాన్ని గౌరవించేందుకు, ఆమె చేసిన త్యాగమును గుర్తు చేసుకునేందుకు నాలుగు రోజుల పాటు ఆమెను ప్రసిద్ధి చేయడం జరిగిపోయింది.
"ప్రసిద్ధి చేయుట" అంటే గౌరవించడమేనా?
హీబ్రూ మూలపదాన్ని పరిశీలించినప్పుడు, "לְתַנּוֹת" (le-tannot) అనే పదం ఉపయోగించబడింది.
దీనికి ప్రధానంగా "ప్రశంసించడం" లేదా "గౌరవించడం" అనే అర్థం ఉంది.
"ప్రసిద్ధి చేయుట" అనేది ఆమె త్యాగాన్ని గౌరవించడం, ఆమె అంకితా స్వభావమును గుర్తుచేసుకోవడం, ప్రతి సంవత్సరం నాలుగు రోజులు, ఇశ్రాయేలు కుమార్తెలు, దేవుని మందిరంలో పరిచర్యలను, చేయుట కొరకు, తమ్మును తాము ప్రత్యేక పరుచుకోవటం, అనే అర్థంను మనము తీసుకోవచ్చు. యెఫ్తా కుమార్తెను నిజంగా బలి ఇస్తే, "విలపించుట" అనే పదం ఉపయోగించి ఉండేవారు.
కాబట్టి, ఆమె వివాహం చేసుకోకుండా, దేవునికి అంకితమైన జీవితం గడిపినవారిలో ఒకరై ఉండవచ్చని బలంగా అనుకోవచ్చు.
ఇశ్రాయేలీయుల కుమార్తెలు ప్రతి ఏటా ఆమెను గుర్తు చేసుకోవడం, ఆమె జీవితాన్ని గౌరవించడం, ఆమె చేసిన దానిని వారు కూడా కొద్ది రోజులు పాటించడం, అనే దాని కోసమే అని మనం అనుకోవచ్చు. మరికొందరు ఇది "ఆమె జీవితం కన్యగా గడిపినందుకు గౌరవించడం" అని భావించారు.
ఇక్కడ మనము గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే : ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరము ఒక కొత్త యువతిని సిద్ధం చేయలేదని స్పష్టంగా చెప్పవచ్చు. వారు కేవలం యెఫ్తా కుమార్తె జ్ఞాపకార్థం మాత్రమే ఆ నాలుగు రోజులు గుర్తు చేసుకున్నారు.
ఎస్తేర్ క్రైసోలైట్
9-2-2025