2025 Messages
🍃 🍀🌿📖🌿🍀🍃
దేవుని యథార్థత vs. మనుష్యుల తంత్రములు,
( తంత్రముల బంధకాలు vs.దేవుని వాక్యపు స్వేచ్ఛ )
ప్రసంగి 7:29
ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా, పుట్టించెను, గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.
యేసయ్య అని వాక్యంతో విశ్వాసాన్ని ప్రకటిస్తే, ఆది ఒక విధమైన తంత్రం, యెహోవా దేవుడు అంటే అది ఒక విధమైన తంత్రం, దేవుని వాక్యాన్ని ప్రకటించాలన్న వాక్యంతో కూడిన విశ్వాసాన్ని ప్రజలకు తెలియజేయాలి అని అన్నా,
స్వేచ్ఛ అనేది లేకుండా, ఈ మనుషులు కల్పించుకున్న తంత్రములు చేస్తున్నాయి .
దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించే వారికి, దేవుని వాక్యమును ఆదారము చేసుకొనకుండా, వివిధ రకములైన తంత్రముల చేత, వాటినే ఆధారం చేసుకుని జీవించే వారికి, మధ్య ఎప్పుడు ఒక పోరాటం అనేది ఉంటూనే ఉంటుంది, తంత్రములను ఆధారం చేసుకుని జీవించేవారు, వారి తినే ఆహార పదార్థాల విషయంలో, వీరు ఉపయోగించే వస్త్ర వస్తు సముదాయం విషయంలో, కూడా దేవుడు మన అవసరత కొరకు వీటిని ఇచ్చాడు, అని స్వేచ్ఛగా వాటిని ఉపయోగించుకొనకుండా, వారు కలిగి ఉన్న తంత్రముల ను బట్టి, వాటిని ఉపయోగించుకునే విధానమును కలిగి ఉంటారు.
తంత్రములను బట్టి మన వద్దకు వచ్చే వాటి వలన, మన అవసరత తీర్చబడదు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్య మును ఆదారం చేసుకుని, మనము జీవించి ఉండటాన్ని బట్టి మనకు కలిగే, మనకు లభించే, వాటి వలన మాత్రమే, మన అవసరత తీర్చబడుతుంది.
దేవుడు నరులను యదార్థవంతులనుగా పుట్టించాడు, ఈ లోకంలో "యథార్థమైనది" ఏమన్నా ఉన్నది అని అంటే అదే దేవుని వాక్యము. దేవుని వాక్యమే సత్యమైనది, యదార్ధమైనది, దేవుని వాక్యము మనలను పవిత్రపరుస్తుంది. దేవుని పరిశుద్ధతలో మనలను ప్రతిష్ఠిత చేస్తుంది,
యోహాను 17:17 సత్యమందు( మూలభాషలో-సత్యమువలన) వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.
ఇటువంటి సత్యవాక్యం వల్ల జన్మించబడిన వారే దేవుని ప్రజలు, వీరినే యదార్థవంతులు అని అంటారు, యాకోబు 1:18
ఆయన తాను సృష్టించిన వాటిలో, మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు, సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.
పరిశుద్ధ గ్రంథము ప్రకారం, మనము దేవుని ప్రజల ముగా మారడానికి మూడు అంశాలు, మనకు అవసరము అయి ఉన్నవి.
1. దేవుని వాక్యం ద్వారా మనము నూతన సృష్టి గా చేయబడాలి.
1పేతురు 1:21
మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల, దేవుని వాక్యమూలముగా, అక్షయ బీజమునుండి, పుట్టింపబడినవారు గనుక,
2. క్రీస్తు రక్తం ద్వారా మన పాపములు క్షమించబడాలి.
.
ఎఫెసీయులకు 1:7
దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
3. పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుని ఒక్క దేహంగా చేయబడాలి.
1కోరింథీయులకు 12:13
ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి(లేక,శరీరముగా ఉండుటకు) ఒక్క ఆత్మయందే బాప్తిస్మముపొందితిమి.
మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఈ మూడు విషయముల ద్వారానే మనం నిజమైన దేవుని ప్రజలమవుతాము.
2 కోరింథీయులకు 5:17
కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.
తంత్రములు : తంత్రములు అని అంటే అర్థమేమిటి
పరిశుద్ధ గ్రంథము ప్రకారం "తంత్రములు" అనగా మనుష్యులు తమ స్వంత జ్ఞానంతో రూపొందించుకున్న మార్గాలు,పథకాలు.విధి విధానాలు ఇవి దేవుని యథార్థమైన మార్గానికి విరుద్ధంగా ఉంటే, అవి తప్పు ఆని భావించబడతాయి.
1. మనుష్యులు దేవుని యథార్థతను వదిలి, దేవుని వాక్యమును ఆ వాక్యాను సారముగా వున్న ప్రవర్తనను వదలి తమ స్వంత మార్గాలను అనుసరించడానికి ప్రయత్నిస్తారు.
2. మోసపూరిత మార్గాలు: మోసం, వంచన భ్రమింపజేసే మార్గాలుగా దురాలోచనలు, అసత్య మార్గాలు కూడా కావొచ్చు.
ఎఫెసీయులకు 4:14
అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలల చేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక,
3. దేవుని మార్గాలకు విరుద్ధమైన కార్యాల గురించి:అంటే, మనుష్యులు దేవుని మార్గాన్ని వదిలి, తమ స్వంత విధానాలను అనుసరించడము,
యిర్మియా 18:12
అందుకు వారునీ మాట నిష్ ప్రయోజనము; మేము మా ఆలోచనల చొప్పున నడుచు కొందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని యందురు.
దేవుడు ఆదాము హవ్వలను సృజించి
ఆదికాండము 2:16
మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అని చెప్పి వారికి ఏ బంధకాలు లేని స్వేచ్ఛను తన వాక్కు ద్వారా ఇచ్చాడు కానీ ఆదాము హవ్యలు దేవుడు వద్దు అని చెప్పిన వృక్ష ఫలములను తిని తమని తాము పాపంతో శాపంతోమరణంతో బంధించుకున్నారు.
యోహాను 8:31
కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;
యోహాను 8:32 అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా,
ఎస్తేర్ క్రైసోలైట్
5-2-2025