CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍃 🍀🌿📖🌿🍀🍃

అపో.కార్యములు 7:56

ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.

తన భక్తులు ఎవరైనా మరణించి మరణం ద్వారా తన దగ్గరకు వస్తున్నారు, అని తెలిసినప్పుడు, యేసు క్రీస్తు ప్రభువు వారు, దిగ్గున లేచి, వారి కొరకు ఎదురు చూస్తారన్న, సత్యము ఇక్కడ మనకు కనబడుతుంది.

ఈ వాక్యమును, నేను రక్షించబడిన క్రొత్తలో, చదువుతూ ఉన్నప్పుడు, నేను దేవుని ఏమని అడుగుతూ వచ్చాను, అని అంటే," మరణం అన్నది ఒక్కసారి ఎందుకు ఇచ్చావు ప్రభువా? ఒక పది సార్లు ఇవ్వవచ్చు కదా అని," ఎందుకంటే మనకు ఇష్టమైన వాళ్ళు మనకంటే ఎక్కువగా, గొప్పగా ఉన్నవాళ్లు, మనం వస్తూ ఉన్నప్పుడు లేచి నిలబడటం అంటే, ఎవరికి ఇష్టం ఉండదు, నేను కూడా అప్పుడు అలానే అనుకున్నాను, నేను మరణించి పరలోకానికి వెళ్ళేటప్పుడు, దేవుడు నా కొరకు లేచి నిలబడటం అన్నది, నేను ఉహించుకుంటుంటేనే, ఒక్కసారి కాదు పదిసార్లు మరణిస్తే ఎంత బాగుంటుంది, మరణం అన్నది ఒక పది సార్లు వస్తే ఎంత బాగుండును, అని నాకు ఆ సమయములో అనిపించింది.

మరణం అనే పదము మనకు గుర్తుకు వచ్చినప్పుడు, అసలు మనకు సంతోషం ఉంటుందా! చాలామంది ఈ పదము గురించి మాట్లాడాలి, ఆని అంటేనే, వర్తమానం ఇవ్వాలి అంటే నే, చాలా భయపడతారు, ఒకవేళ ఎవరైనా ఇచ్చిన ఎవరైనా మాట్లాడిన వారు నిరాశలో ఉన్నారు కాబట్టే, వారు అలా మాట్లాడుతున్నారు అని అంటారే తప్ప, వారు మరణం తర్వాత, ఉన్నటువంటి జీవితాన్ని గురించి, ఒక నిజమైన అవగాహన విశ్వాసము కలిగి ఉన్నారు, అన్న సత్యాన్ని వారు గ్రహించరు.

హెబ్రీయులకు 11:1

విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.

విశ్వాసులకు తండ్రిగా, మూలపురుషుడిగా పిలువ బడుతున్నటువంటి, అబ్రహాము అదృశ్యముగా,

మనకు కనబడకుండ, వున్నటువంటి పరలోక పట్టణము కొరకు, హెబ్రీయులకు 11:10

ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.

ఈ లోకము, ఈ లోకంలో ఉన్న సమస్త బాంధవ్యాలు, వస్తు సముదాయాలు, సమస్తము ఒకనాడు నశించిపోయేవే, శాశ్వతముగా ఎల్లప్పుడూ నిలిచి ఉండేది, పర సంబంధమైనది పరలోకము.

ఈ సత్యమును దేవుని ప్రజలు గ్రహించినప్పుడు, ఎప్పుడైనా తమ ప్రియులను కోల్పోవలసి వచ్చినప్పుడు, నిరాశకు కృంగుదలకు లోను కాకుండా, దేవుని బట్టి బలాన్ని పొంది ధైర్యంగా ఉంటారు.

వారు దు:ఖ పడరని కాదు—కానీ వారు నిరాశకు లోను కాకుండా కృంగిపోకుండా, శోకాన్ని దుఃఖాన్ని తట్టుకునే శక్తిని పొందుతారు. ఎందుకంటే మరణం అనేది ఒక ముగింపు కాదని, అది ఒక మార్గం మాత్రమేనని వారి హృదయాలలో ఒక నమ్మకం నిలచి ఉంటుంది కాబట్టి.

మరణం అనేది మనకు తెలియని దు:ఖ మయమైన అంధకారంగా అనిపించవచ్చు, కాని యేసు క్రీస్తు ప్రభువారు ఆ మార్గమనలో ముందుగా నడిచారు. ఆయన గెలిచిన మరణం, మనకోసం నిత్యము జీవించే జీవితముగా మారింది. యోహాను 11:25లో ఆయన చెప్పినట్లు:

యోహాను 11:25

అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;

ఈ నమ్మకమే క్రైస్తవునికి దు:ఖం లోనూ వెలుగును నింపుతుంది. మన ప్రియులు మనకళ్లకు కనబడకపోయినా, వారు యేసులో నిద్రిస్తున్నారని మనం నమ్ముతాము. వారు ఉండే స్థలము శాశ్వతమయినది. యేసు తన మాటలో చెప్పినట్లు

యోహాను 14:2-3

నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.

అందుకే, అపొస్తలుడైన స్తేఫన్ మరణించే సమయంలో, ఆకాశం తెరవబడినట్లు చూశాడు. స్తేఫన్ కోసం యేసు నిలబడి ఉన్నాడు. ఆయన మరణం ఒక ఆపజయం కాదని, అది ఓ ఘనత గల ఆహ్వానంగా మారిందని ఈ దృశ్యం చెబుతోంది.

మన జీవితములో చివరికి మనం ఎదుర్కొనవలసిన దారిలో, యేసు మనకు ముందుగా వెళ్లారు. ఆయన మరణాన్ని ఓ ద్వారంగా మార్చారు—ఆ ద్వారం,ఆ మార్గము ద్వారా, మనం పరలోకానికి, పరలోకపు సంతోషములోనికి ప్రవేశించవచ్చు.

ఈ సత్యం, మన హృదయాలలో, నాటుకుంటే స్థిరపడితే,దీనిని మనము గ్రహించిన, వారమైతే, మన జీవితములో మనము ధైర్యంగా, నూతనమైన ఆశతో, పరలోకపు దృష్టితో మనము నడుస్తాము. మనం మరణాన్ని చూసినప్పుడు, భయంతో ఉండము. ఎందుకంటే మన రక్షకుడు మన కోసం నిలబడి ఎదురు చూస్తున్నాడు! ఆయనతో మనము సదాకాలము ఉండబోతున్నాము కాబట్టి,

మనకు ఇష్టమైనవారు, మన కోసం లేచి నిలబడితే, మళ్లీ మళ్లీ ఆ అనుభవాన్ని, మనము కోరుకుంటు ఉంటాము, కదా!— మరి ఆ పరిపూర్ణ ప్రేమగల రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువారు, మన కోసం నిలబడితే, మన గమ్యం ఎంత బలంగా, సంతోషమును కలిగి, ఉంటుందో కదా?

ఎస్తేర్ క్రైసోలైట్

4-2-2025