CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍃 🍀🌿📖🌿🍀🍃

మన నిరీక్షణ ఈ జీవితకాలము వరకేనా !

ద్వితియోపదేశకాండము 28:5

నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును.

ఇక్కడ ఈ ఆధ్యాయంలో దేవుని ప్రజలుగా, దేవుని నిభందనలోనికి వచ్చిన వారికి, ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయొ, తెలిపే, తెలియజేసే, అధ్యాయం యిది, యిక్కడ మనము చేసుకోవాల్సిన నిభందన, ఎమిటంటే, వాక్యమై వున్న, ఆజ్ఞా రూపంలో వున్న, సత్యమై వున్న, జ్ఞానము,వెలుగ్తె యున్న, దేవునితో మనము నిభందన చేసుకోవాలి, యిలాంటి,దేవున్ని మనం హత్తుకోవాలి,ఈ దేవునితో కలసి మనము, సహజీవనం చేయాలి, మనము ప్రయానించాలి. అప్పుడే దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనము పొందగలము.

ఈ అధ్యాయంలో మనకు ఇవ్వబడిన రెండు ఆశీర్వాదాలు, ఒకటి ఆత్మ సంబంధమైనవి, రెండు శరీర సంభందమైనవి,

మానవుని ఆత్మ యేసు రక్తము ద్వారా పరిశుద్ధ పరచబడినప్పుడు, ఆత్మ స్వభావమును ఆత్మ గుణమును కలిగి,ఆత్మ రూపంలో వున్న,పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉండటం వలన,

"యోహాను 15:5

ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును••••"

అన్న వాగ్దానము మనలో పనిచేసి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను, మనము కలిగి ఉంటాము.

ఒక అవిశ్వాసి అయినా భర్త,ఒక విశ్వాసురాలైన భార్య,వీరిరువురికి వివాహం జరిగినప్పుడు, వివాహం జరిగిన,ఆ సంవత్సరంలో అవిశ్వాసి అయిన ఆ భర్తకు ఏమని వాగ్దానం వచ్చింది, అని అంటే, ద్వితియోపదేశకాండము 28:5

"నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును." అనే వాగ్దానము వచ్చింది,

ఈ అవిశ్వాసి అయిన భర్త,విశ్వాసురాలైన, తన భార్య కలిగి ఉన్న ఆత్మలో తాను పాలు పొందలేదు,కానీ తను వివాహం చేసుకున్న, భార్య శరీరంలో, శరీర సంబంధమైన విషయాలలో మాత్రమే, తాను పాలి భాగమును కలిగి ఉన్నాడు, అందుకే అప్పటినుండి ఆ అవిశ్వాసి అయిన ఆ భర్త,శరీర సంబంధమైన విషయాలలో ఆశీర్వదించబడుతూ వచ్చాడు,

1. భార్య దొరికినవానికి మేలు కలుగును,

📖 సామెతలు 18:22

భార్య దొరికినవానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందిన వాడు.

ఈ వాక్యం ప్రకారం, నిజమైన భార్యను పొందిన వ్యక్తికి,ఇది ఒక దేవుని దయ, ఒక దైవ అనుగ్రహం. ఇది ఒక సాధారణ సంబంధం కాదు—యెహోవా ఇచ్చిన బహుమతి.

భార్య దొరికినవానికి మేలు కలుగును" – సామెతలు 18:22 ఇది స్పష్టంగా శరీర సంబంధమైన జీవితం లో గమనించదగ్గ ఒక ప్రయోజనం గురించి చెబుతోంది: దైనందిన అవసరాలు తీరటం, ఒక జీవిత భాగస్వామిగా , సహాయమును, పొందటం పిల్లలు, కుటుంబ జీవితం, పనులు, భర్తకు అనుకూలంగా ఉండే సహకారం, అంటే ఇవన్నీ ఈ లోక జీవితంలో ఉపయోగపడే విషయాలే – కాబట్టి వీటిని శరీర సంబంధమైన ఆశీర్వాదాలుగా,మనము పిలవవచ్చు.

2. ఈ జీవన మనే కృపావరంలో భార్యలు మీతో పాలివారయున్నారు,

📖 1పేతురు 3:7

అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి,

"ఈ జీవనమును కృపావరముగా" అన్న పౌలు మాట – ఇది శరీర సంబంధమైన జీవితం గురించి మాట్లాడుతూ ఉంది, ఇది ఈ లోక జీవితం – మన దేహం మానవ పరముగా అనుభవించే, సమాజంలో బ్రతికే జీవితం.

"ఆవిశ్వాసి అయిన భర్త, విశ్వాసురాలైన భార్య శరీరంలో, శరీర సంబంధమైన విషయాలలో మాత్రమే, తాను పాలి భాగమును కలిగి ఉన్నాడు."

ఇక్కడ మనము, ఈ విషయాన్ని, గమనించాల్సిన,పరిశీలించాల్సిన, అవసరత ఉన్నది.

"ఆత్మ సంబంధమైన అనుభవం అతనికి లేకపోయినా, శరీర బంధం వల్ల వచ్చే లోక సంబంధమైన దీవెనలు అతనికి అందుతున్నాయి."

1కోరింథీయులకు 7:14

అవిశ్వాసియైన భర్త భార్యను బట్టి పరిశుద్ధ పరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి(మూలభాషలో-సహోదరుని బట్టి) పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు.

ఈ వాక్యంలో కూడా శరీర సంబంధం మూలంగా వచ్చే దీవెన (కుటుంబ రక్షణ, పరిశుద్ధత) గురించి సూచన ఉంది.

ఈ లోకములో మనము జీవించే, మన జీవనం అనేది, దేవుడిచ్చే ఒక కృపావరం అంటే ఈ లోకంలో మన శరీర సంబంధమైన జీవితం దేవుని అనుమతితో లభించేది.

భార్య దొరికినవానికి మేలు కలుగును అంటే, ఈ లోక జీవనంలో, సహచరి భాగస్వామ్యం దొరకడం ద్వారా, శరీర సంబంధమైన అవసరాలు తీరుతాయి.

"అవిశ్వాసి భర్త అంటే ఆత్మ అనుభవం లేకపోయినా, శరీర సంబంధాల ద్వారా లాభపడుతున్నాడు."

శరీర సంబంధమైన దీవెనలు కూడా దేవుని చేతిలో నుండే వస్తాయి. అయితే ఆత్మ సంబంధమైన దీవెనలకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ తేడా ప్రాముఖ్యతను ఇక్కడ మనము గమనించి తీరాలి.!

ఇది ఎటువంటి "పరిశుద్ధత" యిది దేనిని సూచిస్తుంది?

ఇది ఆత్మ సంబంధమైన, ఆత్మకు రక్షణ కల్పించే, పరిశుద్ధత కాదు, కానీ ఇది దైవ సమాజంలోదేవుని ప్రజల సమాజంలో శరీర సంబంధమైన పరిశుద్ధత పరిశుద్ధమైన స్థితి,

క్లారిటీగా చెప్పాలంటే:

ఇది ఆత్మ సంబంధమైన సంతానం గురించి కాదు, (అంటే సిలువ రక్షణ పొందిన వారిగా పిల్లలు అని కాదు). ఇది శరీర సంబంధమైన సంతానం గురించి —చెప్పబడుతుంది,అంటే విశ్వాసి-అవిశ్వాసి దంపతులకు జన్మించే శారీర సంబంధమైన పిల్లలు,

వారు సంఘంలో దేవుని సమాజంలో అపవిత్రులుగా పరిగణించబడకుండా, దైవ సమాజానికి చెందిన వారిగా పరిశుద్ధులుగా పరిగణించబడతారు అంతే.

ఈ పరిశుద్ధత అనేది, సంఘాము దేవుని ప్రజల సమాజ సంబంధిత గుర్తింపు మాత్రమే,ఇది వారి వ్యక్తిగత రక్షణకు మార్గం కాదు, – వారి ఆత్మీయ రక్షణ, యేసునందు వ్యక్తిగతముగా వారు విశ్వసించే విశ్వాసము ఆధారంగా ఉంటుంది."

ఎందుకంటే:

1. పౌలు రక్షణ గురించి మాట్లాడడంలేదు, ఎందుకంటే పిల్లలు వ్యక్తిగతంగా వారి ఆత్మ రక్షణ కొరకు క్రీస్తునందు విశ్వాసముంచాల్సిందే.

2. పిల్లలు తల్లిదండ్రుల సహాయంతో, సంఘంలో ఆశీర్వదించబడిన జీవితానికి, అర్హులుగా, పిలవబడతారు, గుర్తించబడతారు, నిలబడతారు –శరీర సంబంధముగా ఇది ఒక పరిమితమైన పరిశుద్ధత మాత్రమే కానీ, ఆత్మ రక్షణకు మార్గం కాదు.

"ఇక్కడ పవిత్ర పరచబడేది శరీర సంబంధమైన సంతానం." ఈ అర్థంతోనే పౌలు మాట్లాడాడు.

దీని ద్వారా నేర్చుకునేది ఏమిటంటే:

1. విశ్వాసి అనే ఒకరి ద్వారా, – అవిశ్వాసి అనే వ్యక్తికి, పరిశుద్ధత అనే ప్రత్యేక స్థితి దక్కుతుంది.

ఇది రక్షణ కాదు, కానీ దైవ సంబంధమైన కవచం లాంటిది — దైవ సమాజంలో ఉన్న ఒక మంచి స్థితిని, పొందగలిగేది.

2. అదే విధంగా, విశ్వాసురాలైన భార్య కారణంగా,

భర్త కూడా దేవుని చిత్తానుసారముగా, ఆమె జీవనవిధానం ద్వారా, శరీర సంబంధమైన ఆశీర్వాదాలలో భాగం అవవచ్చు.

📖 రోమా 11:16

రోమీయులకు 11:16

ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే.

"అంటే, ఒక భాగం పరిశుద్ధమైనప్పుడు, దాని ద్వారా మొత్తం భాగానికీ ప్రభావం ఉంటుంది ఇది ఈ వాక్యంలో ఉన్న సూత్రం."

"మేలును ఇచ్చే భార్యను పొందిన వ్యక్తి, యెహోవా అనుగ్రహాన్ని పొందిన వ్యక్తే, శాశ్వతం కానీ జీవంలో పాలి భాగము మాత్రమే కాక! శాశ్వతమైన ఎప్పటికీ నశించని ఆత్మలో ఆత్మసంబంధమైన దేవుని జీవములో,పాలి భాగమును కోరుకుంటూ,

ఆమెను జీవమనే కృపలో, భాగస్వామిగా గౌరవించే వ్యక్తే,దేవుని ముందు నిజమైన బాగ్యవంతుడు."

రక్షించబడిన యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడిన, అనుభవాన్ని కలిగిన, ఒక మానవ దేహానికి, ఆ దేహంతో సహవాసం చేసే,ఒక అవిశ్వాసి అయిన వ్యక్తికి, ఇటువంటి ఆశీర్వాదాలు దొరికితే,ఆత్మ స్వభావమును ఆత్మ గుణాలను కలిగిన, పరిశుద్ధాత్మ దేవునితో, మనము సహవాసం చేసినప్పుడు, సహజీవనం చేస్తూ ఉన్నప్పుడు,నిత్యము నిలిచిపోయే నిత్యజీవమును ఇచ్చే, నిత్యత్వం వరకు మనతోపాటు ప్రయాణించే,పర సంబంధమైన ఆత్మసంబంధమైన, దైవ సంబంధమైన ఆశీర్వాదాలను, దేవుడు మనకు ఎందుకు ఇవ్వడు, కచ్చితంగా ఇస్తాడు.

ఆశీర్వాదాలు అంటే సర్వసాధారణంగా, ఎక్కువ మంది ప్రజలు గ్రహించేది, ఈ లోకంలో మనకు అవసరమైన, మనము బ్రతటానికి మనకు అవసరమైన, ఈ శరీర, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే అని, వాటినే మన గమ్యంగా మన గురిగా,చేసుకుంటూ బ్రతుకుతున్నాము.మన సమయం అంతా కూడా నశించిపోయే, నిత్యత్వం వరకు రాని,ఆశీర్వాదాలు కొరకే వినియోగిస్తూన్నాము, మనము మరణిస్తే శాశ్వతంగా నిలిచే పరలోక పట్టణంలో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల విషయంలో, మనము పేదవారముగా, రిక్త హస్తాలతో, దేవుని ముందు మనము నిలబడతాము.

"దైవత్వము" అనే దానిని మనం ఎలా స్వీకరిస్తున్నాము, దేనికొరకు దానిని మనము ఆశిస్తున్నాము,అన్న విషయములో,మనల్ని మనము ప్రశ్నించుకోకపోతే,మనము ఆత్మ పరిశీలన చేసుకోలేకపోతే,మనకంటే అజ్ఞానులైన వారు ఇంకా ఎవ్వరూ ఉండరు,అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది.

1కోరింథీయులకు 15:19

ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు, నిరీక్షించువారమైనయెడల, మనుష్యులందరి కంటె, దౌర్భాగ్యులమై యుందుము.

ఎస్తేర్ క్రైసోలైట్

30-6-2025