2025 Messages
🍃 🍀🌿📖🌿🍀🍃
దేవుని వాక్య జ్ఞానంతో నడిచినప్పుడు – క్షేమమైన జీవన ప్రయాణం.
సామెతలు 3:23
అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు.
ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేరాలి అని అంటే, ఈ వచనంలో మొదటగా ఆప్పుడు అని వ్రాయబడిన దాని ప్రకారము, ఈ వచనము పైనున్న వాక్యములను మనము చదివి దానిని పాటించాలి.
సామెతలు 3:13,14 వ వచనములు
జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు.
శాపగ్రస్తమైన మరణానికి లోనైనా ఈ సృష్టిలో, ఈ లోకంలో దేవుని ప్రజలు జీవిస్తూ ఉన్నప్పుడు, వారి జీవితాలలోనికి అనేకమైన వ్యాధులు శ్రమలు శోధనలు అపజయాలు అవమానాలు లేమి అనే, వెలుగు లేని చీకటి త్రోవలు అనేకమైనవి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇవి మనలను పరీక్షించడానికి, దేవుని అనుమతి ద్వారా మన జీవితాలలోనికి వస్తూ ఉంటాయి. మరికొన్ని మనలను నశింపజేయాలన్న ఉద్దేశంతో, సాతాను ద్వారా మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి. ఇటువంటివి, ఏ రూపంలో మన జీవితంలోకి వచ్చిన, ఈ త్రోవలలో మనము నడచి, మనము నశించి పోకుండా,ఉండాలి అని అంటే, జ్ఞానమై ఉన్న జ్ఞానమునకు ఆధారమైన దేవున్ని, దేవుని వాక్యముల ఉపదేశము ననుసరించి, మనము నడవాలి అని, ఈ వాక్యము మనకు తెలియజేస్తుంది.
సామెతలు 3:17
దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు.
మన జీవితాలలోనికి వచ్చే త్రోవలు మార్గములు ఆవి, మన జీవితానికి గాఢాంధ కారమైన పరిస్థితిని, నష్టమును క్షేమము లేని స్థితిని, తీసుకువచ్చే ఎటువంటి మార్గాలు, చీకటి త్రోవలు అయినప్పటికీ,
జ్ఞానమైయున్న దేవుడు, మన హృదయంలో నివసిస్తూ, మన పాదములకు వెలుగునిచ్చే వెలుగై ఉన్నా, వాక్యమై ఉన్న దేవుడు, మనతో నడుస్తూ ఉన్నప్పుడు, మనము ప్రయాణించే మార్గము, రమ్యమైనదిగా మన త్రోవ మనకు క్షేమాన్ని తెచ్చేదిగా ఉంటుంది.
దేవుని జ్ఞానాన్ని అనుసరించినప్పుడు, దేవుడు చెప్పిన మార్గంలో మనము నడిచినప్పుడు, మన జీవితం భద్రముగా, క్షేమముగా సురక్షితంగా ఉంటుంది అని ఈ వాక్యము మనకు తెలియజేస్తుంది ! దేవుని జ్ఞానం మనకు రక్షణ కలిగిస్తుంది.
జ్ఞానమైన దేవుడు మనలో నివసిస్తూ ఉన్నప్పుడు మన మార్గము సున్నితముగా, నిటారుగా సరళముగా ఎటువంటి వంకర లేనిస్థిరమైన త్రోవగా ఆది ఉంటుంది కీర్తనలు 37:27
కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు.
జ్ఞానమైన దేవుడు జ్ఞానమును ఇచ్చే దేవుని వాక్యము, మనకు తోడుగా ఉన్నప్పుడు, మనము దేనికి ఎటువంటి పరిస్థితికిని భయపడాల్సిన అవసరము లేదు, దేవుడు మన అడుగులను నడిపిస్తాడు, యెషయా 41:10
నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు, నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను, దిగులుపడకుము నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.
మనము దేవుని జ్ఞానాన్ని అనుసరిస్తే, మన జీవన మార్గము భయపడాల్సిన అవసరం లేని రీతిలో సురక్షితంగా ఉంటుంది. ఇది మనకు భద్రత, ధైర్యం, విశ్వాసాన్ని ఇస్తుంది. దేవుని మార్గంలో నడిచినప్పుడు, ఆయన మన ప్రయాణాన్ని సులభతరం చేస్తాడనే నమ్మకాన్ని ఇది పెంచుతుంది.
దేవుని మాటలను హృదయంలో ఉంచుకొని నడిచినప్పుడు, మనం ఎటువంటి ప్రమాదాలనైనా, అడ్డంకులనైనా అధిగమించ గలుగుతాము.ఆశ్చర్యకరమైన దేవుని వెలుగు మనకు సహాయం చేస్తుంది.
కీర్తనలు 119:105
(నూన్) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.దేవుని వాక్యము బుద్ధిలేని వారికి బుద్ధిని, జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని ఇస్తుంది కీర్తనలు 19:7
యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.
దేవుని వాక్యము మన బుద్ధిని, జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. దేవుని భయమే నిజమైన జ్ఞానానికి ఆధారం. దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు, మన ఆలోచనలు, నిర్ణయాలు జ్ఞానంతో నిండిపోతాయి.
ఎస్తేర్ క్రైసోలైట్
31-1-2025