2025 Messages
🍃 🍀🌿📖🌿🍀🍃
ప్రతి దానికి దేవుని సమయం ఉంది.
ప్రసంగి 3:1
ప్రతిదానికి సమయము కలదు. అవును మన జీవితంలో మనం వెతికే ప్రతి దానికి మనం చేసే ప్రతి ప్రయత్నంనకు దాని గురించి మనము తెలుసుకోవటానికి దేవుడు మనకు ఒక సమయమును ఉంచాడు, ఇది నిజము ఇది నా అనుభవం కూడా •••••
.
మన జీవితంలో కొన్ని రహస్యాలు, మనకు అర్థం కాని విషయాలు అర్థమవ్వటానికి, కొంత ఆలస్యం కావచ్చు, ఆ సమయంలో మనము వెనుకబడినట్లుగా, మనకు అనిపించినా, మనలను ఒక పిచ్చివాళ్లుగా, జ్ఞానం లేని వాళ్లుగా, ఇతరులు మనలను గుర్తించిన, మనము బాధపడకూడదు. భయపడకూడదు.
ఎందుకంటే ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని ఉంచాడు. ఆ సమయంలో మాత్రమే, దేవుడు తన సత్యమును తన సమాధానమును, మనకు వెల్లడి చేస్తాడు, దేవుడు బయలు పరచిన సమయంలో అప్పుడు మాత్రమే, మనము వాటిని గ్రహించగలుగుతాము.
నేను దేవుని లోనికి వచ్చిన క్రొత్తలో, పరిశుద్ధ గ్రంధం చదువుతున్నప్పుడు, దేవున్ని గురించిన కొన్ని అర్థం కాని విషయాలు, కొన్ని ప్రశ్నలు వచ్చేవి, వాటికి జవాబు అన్నది నాకు దొరికేది కాదు, అప్పుడు నేను అనుకునేదాన్ని, దీనిని ఈ దేవుణ్ణి నేను ఎలా నమ్మాలి అని ?
ఆ సమయంలో నేను ఒక్కటే అనుకున్నాను, నా అవసరతకు తగినట్లు దేవుడు, తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు,
ఏ విషయంలో దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఆ విషయంలో దానికి తగిన జవాబు అన్నది, దేవుడు తన వాక్యం ద్వార నాకు ఇస్తూ వచ్చాడు, ఈ ఒక్క దాన్ని బట్టి నేను దేవుడు సజీవుడు, సజీవంగా నన్ను చూస్తున్నాడు కాబట్టి, నేను దేవుడు ఉన్నాడు అని,
నేను ఏది అర్థం అయినా, అర్థం కాకపోయినా, గ్రుడ్డిగా నేను దేవుని నమ్మాను, కాలక్రమములో తన సొంత సమయంలో, నాకు ఎప్పుడూ అర్థం కావాలో, ఆ సమయానికి, దేవుడు పరిశుద్ధ గ్రంథములో వున్న, వాక్యాలన్నిటి అర్థము, నాకు తెలియజేస్తూ వస్తున్నాడు.
ఇది ఆత్మ సంబంధమైన విషయాలలోనే కాదు, ఇది ఈ లోక సంబంధమైన జీవితంలో, శరీర సంబంధమైన విషయాలలో కూడా, తగిన సమయంలో, దేవుడు మన అవసరతకు తగిన, మనకు అవసరమైన జ్ఞానాన్ని మనకు సమృద్ధిగా బయలు పరుస్తాడు, ప్రతిదానికి ప్రతి విషయమును, మనకు తెలియజేయటానికి, దేవునికి ఒక సమయము ఉంది. అని ఈ వాక్యం, మనకు తెలియజేస్తుంది.
మీకు కూడా ఎప్పుడైనా ఇలానే జరిగిందా ? అయితే దేవుని ప్రత్యక్షత కొరకు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో, సమాధానకర్త జ్ఞానమునకు మూలము అయినా, దేవుడు మీ ప్రతి విషయంలో, మీకు అవసరమైన సమస్త జ్ఞానమును, తన సత్య సమాధానమును మీకు సమృద్ధిగా, బయలుపరచును గాక, ఆమెన్ ఆమెన్ ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
21-2+2025