2025 Messages
ప్రసంగి 11:1
నీ ఆహారమును నీళ్లమీద వేయుము,చాలా దినము... లైన తరువాత అది నీకు కనబడును.
నేను రక్షించబడిన క్రొత్తలో నేను వెళ్తున్న సహవాసంలో చాలామంది విశ్వాసులు ఈ వాక్యమును ఎత్తి పట్టి ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు అప్పుడు ఇది వింటున్న నాకుఈ వాక్యంలో వున్న అర్థము అసలు అర్థమయ్యేది కాదు ఆహారమును నీటి మీద వేయడమేమిటి ? అది పాడైపోతుంది కదా మరల తర్వాత ఇంకెక్కడ కనబడుతుంది అని నాకు అనిపిస్తూ ఉండేది.
దేవుడు మనకు ఇచ్చే ఆశీర్వాదాలు చాలా సార్లు మనం చేసిన మంచి పనులకు ప్రతిఫలంగా వస్తాయి. కానీ, ఆ ఫలితాలు కచ్చితంగా వెంటనే రావాలని అనుకోవడం కంటే నమ్మకంతో పని చేయాలని ఈ వాక్యం చెబుతుంది. యితరులకు మనము చేసే పరిచర్య సేవలు తక్షణమే అప్పటికప్పుడే ఫలిత మివ్వకపోవచ్చు, కానీ కొంత సమయం తర్వాత అంటే భవిష్యత్తులో అవి మనకు తిరిగి ఆశీర్వాదాలుగా మన దగ్గరకు వస్తాయి.
శ్రద్ధ, విధేయత తో మనము మంచి పనులను చేసినప్పుడు వెంటనే ఫలితాలను ఆశించకూడదు. మనం చేసే పని దేవుని చేతుల్లో ఉంది.దేవునికి నచ్చిన సమయంలో మనము చేసిన దానికి ఫలితం అన్నదానిని ఇస్తాడు.
మన ఆహారమును నీళ్ల మీద వేయడం అని అంటే
యోహాను 4:34
యేసు వారిని చూచి నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది.
దేవుని వాక్యాన్ని మనము ఇతరులకు ఏ రూపంలో అందించిన నశించిపోయే ఆత్మల కోరకు దేవుని ప్రజల కొరకు దేవుని పరిచర్య కొరకు దేవుని కార్యాలు కొరకు ఇలా దైవ సంబంధమైన ప్రతి దాని కొరకు ప్రార్థించటము అనేది ఇటువంటివి చేయటమే దేవుని ప్రజలకు ఆహారమై ఉన్నది అని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది.
ఈ లోకంలో నశించిపోయే శరీర సంబంధమైన వాటి కొరకు మనము ప్రయాస పడకుండా నిత్యత్వంలో మనకు ఆశీర్వాదాలు తీసుకువచ్చే వాటి కొరకు మనం ప్రయాసపడినప్పుడు దేవుడు కచ్చితంగా మన ప్రయాసకు తగిన ఫలితాన్ని ఇస్తాడు.
లూకా 5:4
ఆయన బోధించుట చాలించిన తరువాతనీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా,
లూకా 5:5-6
సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా,
రాత్రి అంతయు చేపల కొరకు ప్రయాసపడిన పేతురు ప్రయాసను యేసుక్రీస్తు ప్రభువు వారు చూశారు పేతురు ప్రయాసను ఇక్కడ దేవుడు అలక్ష్యం చేయకుండా ఒకే ఒక మాట " దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వల వేయమని "
చెప్పిన దేవుని వాక్కు పేతురుకు విస్తారమైన చేపలను దీవెనలను తీసుకుని వచ్చింది.
దేవుని కొరకు మనము చేసే పరిచర్య పని ఆ ప్రయాస
ఎటువంటిది అయినప్పటికీ అయినా సరే తనయెడల యదార్ధ హృదయం గల వారిని బలపరచుటకై లోకమంతటా సంచారము చేయుచున్న యెహోవా కనుదృష్టి ఖచ్చితముగా
తన కొరకు ప్రయాస పడుతున్న వారిని చూసి తీరుతుంది.
మత్తయి 6:19-20
భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.
పరలోక మందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.
నీ ఆహారమును నీళ్లమీద వేయుము, అనేక దినములైన తర్వాత అది నీకు మరల కనబడును."
అనే ఈ వాక్యము మనకు ఏమి తెలియజేస్తుంది అని అంటే శాశ్వతమైన నిత్యము నిలిచే పరలోకము వరకు నిత్యత్వం వరకు మనతో పాటు వచ్చే పర సంబంధమైన శాశ్వతమైన ఆశీర్వాదాలను ఇచ్చే
వాటి కొరకు మనము ప్రయాస పడాలని కచ్చితంగా మన ప్రయాసకు దేవుడు ప్రతిఫలం అనే దానిని ఇస్తాడు అని పేతురు ప్రయాసను చూసిన దేవుడు మన ప్రయాసను కూడా చూస్తూ ఉన్నా దేవుడు దేవుని కొరకు మనము ఏమి ప్రయాసపడినను దానికి ప్రతిఫలం అన్న దానిని ఎప్పటికైనా ఇస్తాడు అని ఈ వాక్యము తెలియజేస్తుంది.

ఎస్తేర్ క్రైసోలైట్
3-1-2025
Written By: Sis.Esther Chrysolyte
Written On: 3-1-25