CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍃 🍀🌿📖🌿🍀🍃

"కీర్తనలు 91:3-7

వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును

ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.

రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను,చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు.

నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు."

ఈరోజుల్లో మన చుట్టూ అనేక కష్టాలు, బాధలు, రోగాలు, విపత్తులు నిత్యం మనల్ని భయపేడుతు వుంటాయి. కానీ, దేవుని మాట దేవుని వాక్యం మనకు ఓదార్పును ఇస్తుంది – ఆయన తన ప్రియులను తన యందు విశ్వాస ముంచిన వారిని కాపాడుతానని హామీ ఇస్తున్నాడు.

ప్రపంచంలో ఈ లోకంలో,మనలను నశింప చేయటానికి, మనలను తల్లడింప చేయడానికి, ఎన్ని వ్యాధులు విజృంభించినా, ఎన్ని యుద్ధాలు తలెత్తినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, మనము దేవుని చెంత ఉన్నాము,

ఆయన ఇచ్చే రక్షణ మనకు ఉంది. ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు. మనం దేవునిపై నమ్మిక నుంచినప్పుడు, ఎన్ని విపత్కరమైన పరిస్థితులు మనకు సంభవించినా, వాక్యమైయున్న దేవుడు, వాగ్దాన రూపంలో,మన వద్దకు వచ్చి మనలను రక్షిస్తాడు,మనకు కంచెల కోటల కవచంల రక్షణగా నిలబడతాడు,మనకు రక్షణను ఇచ్చే, ఒక దృఢమైన గోడల, మన చుట్టూ ఆవరించి ఉంటాడు.

ఎవరైనా మనకు హానిచేయాలనుకున్నా, మనం ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు, ఆ అపాయం,ఆ కీడు, మనకు చేరదు. మనమంతా ఈ దేవుని వాక్యాన్ని, మన జీవితాల్లో, మనము ప్రతి పరిస్థితిలో, విశ్వసించాలి,నమ్మకంతో పాటించాలి. భయపడకుండా, విశ్వాసంతో నడవాలి. దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మన రక్షణ,అన్న విషయమును, మీరు విశ్వసించగలరా.

ఎస్తేర్ క్రైసోలైట్

21-2-2025