CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍃 🍀🌿📖🌿🍀🍃

మన హృదయమునకు, శాంతి కలుగజేసే దేవుని వాక్యము.

ఈ దినము ఉదయమే నేను నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు, నేను ఇంకా నా కన్నులను తెరవకముందే నాకు ఒక విషయం జ్ఞాపకమునకు వచ్చింది, అది ఏమిటంటే నా కుమార్తె తన పని నిమిత్తము ఈరోజు నన్ను వదిలి కొద్ది రోజులు వేరే ప్రాంతమునకు వెళ్తుంది అన్న విషయము,

వెంటనే నా హృదయము నిండా సమాధానము నిండుకుంది. ఆ సమయంలో నేను మరలా అనుకున్నాను, ఏంటి నాకు బాధ అనేది రావడం లేదు అని, ఎందుకంటే నా కుమార్తె జన్మించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నన్ను వదిలి తాను ఎక్కడికి వెళ్ళలేదు.

ఈ విషయమును నేను పదే పదే మనసులో అనుకున్నప్పటికిని, నాలోఎటువంటి కలవరము బాధ భయం అన్నది, కలగకుండ ఉండటాన్ని నేను గమనించాను.

నిజమే యోబు 22:26 వచనములో, వ్రాయబడినట్లు, "సర్వశక్తునియందు నీవు ఆనందించెదవు," అని దేవుడు మనకు ఒక బలమైన వాగ్దానమును ఇస్తున్నాడు. మనము ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీని, దేవుని మాటలను మన హృదయంలో నిలుపుకున్నప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు, మనం అనుభవించే సమాధానము, ఆనందము అన్నది, అది ఒక అద్భుతమైనది, అని మనము చెప్పవచ్చు.

మన హృదయాన్ని ఆయన వాక్యంతో నింపుకున్నప్పుడు, మన మనస్సు అశాంతి చెందే పరిస్థితులు ఎప్పుడూ వచ్చిన, మన పరిస్థితులు ఎప్పుడూ మారినా, మన ఆత్మలో ఒక శాంతి, ఒక నిత్యానందం అన్నది ఉంటుంది.

యెషయా 26:3 వ వచనములో చెప్పబడినట్లు,

ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో, వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా, కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు, విశ్వాసముంచి యున్నాడు. అని దేవుడు మనకు, శాశ్వతమైన హామీని ఇస్తున్నాడు. మనం దేవుని మాటలను మన హృదయంలో, నిలుపుకున్నప్పుడు, ఆయనను పూర్తిగా నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, ఏ పరిస్థితుల్లోనైనా మనం స్థిరముగా ఉండగలము.

అందుకే, శ్రమలు వచ్చినా, కష్టాలున్నా, అనుకున్నది లేకపోయినా, మనము కంటికి రెప్పలా కాపాడుకునే, మన బిడ్డలు మనకు దూరంగా వెళుతున్న,మనం దేవుని మాటలను గుండెల్లో ఉంచుకొని ఆయన యందు ఆనందించాలి, ఆయన సమాధానాన్ని అనుభవించాలి. ఎందుకంటే మన విశ్వాసం శుద్ధికరించబడే వెండిలా, అపరంజిలా పరీక్షించ బడినప్పుడు, దేవుడు మనలను బలపరచి స్థిరపరుస్తాడు.

కీర్తనలు 12:6 లోచెప్పబడినట్లు

యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి యంత పవిత్రములు. దేవుని వాక్యము నిరూపించబడిన విశ్వసింపదగినది, విశ్వసనీయమైనది, ఎటువంటి కల్మషం లేనిది, స్వచ్ఛమైనది అని, ఈ వాక్యము మనకు తెలియజేస్తుంది.

వెండి అపరంజి వాటికి, కలిసిన మలినాలను తొలగించడానికి, మళ్లి మళ్లీ ఆవి వేడిచేయబడుతాయి, అగ్నిచేత అవి పరీక్షించబడతాయి. అదే విధంగా, దేవుని వాక్యము కూడా నిరూపించబడినదిగా, నమ్మదగినదిగా, పరిశుద్ధమైనదిగా ఉంది. దేవుని మాటలు ఎన్నో తరాలుగా, ఎన్నో పరిస్థితులలో, ఎంతో మందిచే పరీక్షించబడి, ఎప్పటికీ నిలిచే ఉండే సత్యముల స్థిరముగా ఉన్నాయి.

అందుకే, దేవుని వాక్యమును మనము నమ్మినప్పుడు, మనకు అది శాశ్వతమైన సమాధానమును ఇచ్చేదిగా, మన మార్గములకు వెలుగుగా, మన ప్రాణములకు శాంతి, సమాధానమును, నెమ్మదిని, ఇచ్చేదిగా, మనకు ఆశ్రయ దుర్గముగా, మన ప్రాణమునకు ఆశ్రయమవుతుంది.

ఈ వాక్యము మనకు దేవుని పై ఆనందించుట, ఎంత ప్రాముఖ్యమో, తెలియజేస్తుంది. శ్రమల గుండా వెళ్లినా, కష్టకాలాలలో ఉన్నా, మన హృదయము దేవుని యందు ఆనందించగలగాలి. దేవుడు మనకు శాంతిని,సమాధానమును ఆశీర్వాదాలను అందించేవాడు. మన విశ్వాసము బలపడేందుకు, దేవునిలో ఆనందించేందుకు, ఆయనను ఆశ్రయించేందుకు ఈ వాక్యమును దేవుడు ఫలింప చేయను గాక ఆమెన్.

ఎస్తేర్ క్రైసోలైట్

30-1-2025