CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍃 🍀🌿📖🌿🍀🍃

💖 మన హృదయాన్ని మనము కాపాడుకుంటే,దేవుని వాక్యము మన హృదయంలో ప్రవహిస్తుంది.💖

మనము దేవుని వాక్యాన్ని ప్రకటించడంలోను, దేవుని గురించి మాట్లాడటములోను, మనకు ఎంత ప్రాముఖ్యమో, ఆ దేవుని సన్నిధిని కాపాడుకోవడం కూడా, అంతే ముఖ్యమని మనము గ్రహించాలి.

ప్రసంగి 5:2 నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు, నీ హృదయమును త్వరపడనియ్యక, నీ నోటిని కాచు కొమ్ము; దేవుడు ఆకాశ మందున్నాడు, నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను.అని చెప్పబడింది. ఇది మనం మాట్లాడే ప్రతీ మాట, దేవుని ఆత్మతో నిండివుండేలా ఉండాలని తెలియజేస్తుంది.

మనము విస్తారముగా మాట్లాడుతున్నప్పుడు, కొన్నిసార్లు మన హృదయములో ఆత్మ సంబంధమైన దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి సంబంధించిన, ఒక ఫ్లో అనేది తగ్గిపోవడం, మన అనుభవంలోకి రావచ్చు. ఇటువంటి విషయం మన అనుభవంలోనికి వచ్చినప్పుడు, ఇది మనం మాట్లాడే మాటల కన్నా, దేవునితో మనము ఉండల్సిన వ్యక్తిగత అనుభవానికి మనము ప్రాముఖ్యతను ఇవ్వాలని గుర్తుచేస్తుంది.

ఆత్మతో నడిచే జీవితం : మన మాటలు ఆలోచనలు మన ప్రవర్తన అంతా కూడా ఆత్మసంబంధముగా ఉండాలంటే, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడం అనేది మనకు అవసరం. నా అనుభవంలో నేను గమనించినది ఏమిటంటే,

దేవుని వాక్యాన్ని గురించి గానీ దైవ సంబంధమైన విషయాలను గురించి గానీ, నేను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, నాకు నా ఆత్మలో ఎటువంటి మార్పు అనేది కనబడదు, ఇవి కాకుండా లోక సంబంధమైనవి మరే విషయాలైనా నేను మాట్లాడకపోయినా, ఇతరులు నాతో మాట్లాడుతూ నాకు చెపుతున్న, ఆ సమయంలో నాలో జరుగుతున్న ఒక మార్పును, నేను గమనించింది ఏమిటంటే ,అకస్మాత్తుగా దేవుని వాక్యాన్ని గురించిన ఒక ఫ్లో అన్నది, నాలో ఒక ప్రవహించే నీటి ప్రవాహం ఆగినట్లు, నా మనసులో ఇంకా ఎటువంటి వాక్యము అన్నది నాకు గుర్తుకు రాదు,

అప్పటివరకు ఏ వాక్యము ఎక్కడ ఉన్నది అన్న విషయం గుర్తుండే నాకు, అప్పుడు ఎటువంటి వాక్యము గుర్తుకురాని ఒక శూన్యం అన్నది, నా మనసును ఆవరించటం నేను గమనించాను. లోక సంబంధమైన మాటల ద్వారా, విషయాల ద్వారా, నా వద్దకు వచ్చిన లోక సన్నిధినీ బట్టి, నాలో ఉన్న వాక్యమై ఉన్న ఆ దేవుని సన్నిధి నాకు దూరం అవడాన్ని, దేవుని ఆత్మ అధికారంలో నేను ఉండని ఆటువంటి సమయాన్ని, నేను నా ఆత్మలో చాలా స్పష్టంగా గమనించాను.

అందుకే దేవుని వాక్యం మనకు ఇలా సెలవిస్తుంది.

సామెతలు 4:23 నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి, అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సామెతలు 4:23 మనకు నేర్పించేది ఏమిటంటే, మన హృదయమును రక్షించుకోవడం, దేవుని పరిశుద్ధతలో వాక్యంతో ఆత్మ యు జీవమునై యున్న ఆ వాక్యం అనే దేవుని సన్నిధితో నిండి ఉండేలా నిలిచేలా చూసుకోవడం అనేది, ఎంతో ప్రాముఖ్యమైన విషయమును ఇ వచనము మనకు నేర్పుతుంది.

ఇది మన ఆలోచనలు మన ప్రయత్నాలు మన ఆశయాలన్నిటికి పునాదిగా ఉంటుంది. మనము మన హృదయమును భద్రంగా కాపాడితే, ఆ హృదయం నుంచి జీవ జల నదులు ప్రవహిస్తాయి. ఈ జీవ జలాలు ఇతరులకు ఆశీర్వాదంగా మారతాయి.

మత్తయి 12:34-35

హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.

🧡💜❤ మనము దేవుని వాక్యాన్ని ప్రజలకు ప్రకటించడానికి సిద్ధపడినప్పుడు, మన హృదయమె మనమాటలకు మూలస్తంభం అవుతుంది. మత్తయి 12:34 ప్రకారం, మన హృదయం నిండిన దానిని బట్టే మన నోరు మాట్లాడుతుంది.🧡💜❤

కాబట్టి, దేవుని వాక్యాన్ని బోధించే ముందు దేవుడిచ్చిన సందేశాన్ని ఇతరులకు తెలియజేయాలి అన్న మన హృదయం స్వచ్ఛంగా,దేవుని వాక్యము దేవుడిచ్చె సందేశమును గ్రహించగలిగే ఒక నిశ్శబ్దతతో నిండివుండాలి.💟

మనకు అవసరం లేని అనవసరమైన మాటలు మాట్లాడకుండా వినకుండా లోక సంబంధమైన విషయాలకు మనము దూరముగా వుండి మన మాటలు మన అవసరానికి మించకుండా మితముగా కొద్దిగా ఉన్నప్పుడు మన హృదయాల మీద జరిగే దాడిని మనము ఆపగలుగుతాము.

ఫిలిప్పీయులకు 4:7

అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.దేవుని శాంతి మన హృదయానికి కావలిగా నిలుస్తుంది. ఇది మనలో ప్రశాంతతను, ధైర్యాన్ని, మరియు స్థిరత్వాన్ని ఇస్తుంది.

క్రమముగా యెడతెగని ప్రార్థన చేస్తు ఉండటం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ హృదయంను మనము కలిగి పరిశుద్ధతలో, మనము జీవించగలుగుతాం, ప్రతి రోజు దేవుని వాక్యాన్ని చదువుతూ నిత్యము ధ్యానం చేయడం ద్వారా, మన హృదయాన్ని,దేవుని మాటలతో నింపగలుగుతాము. మన హృదయం దేవునితో కలిసిపోతే, దేవుని ఆత్మ మన మాటల ద్వారా పని చేసి మనకు విజయమును తీసుకొని వస్తుంది.

ఎస్తేర్ క్రైసోలైట్

31-1-2025