CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍃 🍀🌿📖🌿🍀🍃

యేసు ద్వారానే సమాధానము -- యిర్మియా 33:6 లో దాగిన దేవుని ఉద్దేశం,

యిర్మియా 33:6

వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను.

యిర్మియా 33:6 లో ఉన్నటువంటి ఈ వాక్యము దేవుడు తన ప్రజల పట్ల ప్రేమను కరుణను మరియు సమాధానమును యిచ్చే దేవుడు అని మనకు తెలియజేస్తుంది, మరుగు చేయబడి ఉన్న సమాధానము సత్యమై యున్న యేసుక్రీస్తు ప్రభు వారిని, సమస్త మానవులను రక్షించే రక్షకుడిగా తన ప్రజలకు ప్రత్యక్ష పరచటానికి బయలుపరచడానికి, తండ్రి అయిన దేవుడు తన అంగీకారాన్ని తన ఉద్దేశమును ఈ వాక్యము ద్వారా తెలియ జేస్తున్నాడు,

నిజమే !

యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు.యోహాను 14:6 అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనకు నిత్యజీము అన్నది దొరుకుతుంది, కొలస్సీయులకు 1:20 ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోక మందున్న వైనను పరలోక మందున్న వైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచు కొనవలె ననియు తండ్రి అభీష్ట మాయెను.

ఎవ్వరు సమీపింపరాని తేజస్సులో మహిమలో జీవించే, తండ్రి అయిన దేవునితో మనలను సమాధాన పరచడానికి సమాధాన కర్తగా, యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకమునకు వచ్చారు.

సత్యమై యున్న యేసుక్రీస్తు ప్రభువారు, సత్యముగా సత్య వాక్కుగా ఎక్కడ ప్రత్యక్షమవుతారో, ఆక్కడ సమాధానము లేనివారికి సమాధానము, జీవం లేని వారికి సమృద్ధి అయిన జీవమును కలుగుతాయి.మనము గ్రహించలేని పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన విషయాలను మనము గ్రహించ గలము.

సత్యము సమాధానము అన్నది మరుగు చేయబడి ఉన్నంతవరకు మానవులకు క్షేమము అభివృద్ధి అన్నది కలగదు, అది ఒక వ్యక్తి జీవితమైనా అది ఒక కుటుంబం అయినా అది ఒక సంఘమైన అది ఒక దేశమైన అది ఏదైనా కావచ్చు,

3 యోహాను 1:2

ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.

మన ఆత్మ వర్ధిల్లిన కొలది అప్పుడు అన్ని విషయాల్లో మనము సౌఖ్యముగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆత్మకు ఆత్మ సంబంధమైన విషయాలకు ఆత్మ సంబంధమైన ప్రతిదానికి మొదట స్థానము అన్నది, ఇక్కడ ఈ వాక్యంలో ఇవ్వబడినది, తరువాతనే తరువాత స్థానము శరీరానికి శరీర సంబంధమైన జీవితానికి శరీర సంబంధమైన ప్రతి దానికి ఇవ్వబడినది.

గలతియులకు 5:17

శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

ఇక్కడ చెప్పబడినది ఒక వ్యక్తి శరీరము ఆత్మకు మధ్య పోరాటం గురించి అలానే ఆత్మ సంబంధులకు శరీర సంబంధులకు మధ్య పోరాటం అన్నది ఎప్పుడు ఉంటూ ఉంటుంది.

ఈ పోరాటం అన్నది, ఒక వ్యక్తి శరీరానికి ఆత్మకు మధ్య మాత్రమే కాదు కానీ, ఆత్మ సంబంధులకు శరీర సంబంధులకు మధ్య, ఇది కుటుంబం కావచ్చు, సహవాసం కావచ్చు, సంఘము కావచ్చు, సమాజం కావచ్చు, దేశం కావచ్చు, ఎక్కడైనా ఆత్మ సంబంధులు శరీర సంబంధులు ఉన్నచోట వారి మధ్య ఈ పోరాటం అన్నది జరగవచ్చు.

శరీర సంబంధులు శరీర సంబంధంగా శరీర సంబంధమైన విషయాలకు ప్రథమ స్థానం ఇస్తారు. శరీరం గురించే శరీర సంబంధమైన విషయాలను గురించే ఆలోచించే వాళ్ళు, ఆత్మకు ఆత్మ సంబంధమైన విషయాలకు ఆత్మసంబంధమైన వాళ్లకు ప్రథమ స్థానం ఇవ్వలేరు.

ఆత్మకు ఆత్మసంబంధమైన వాటికి, శరీరము శరీర సంబంధమైన వారు అధికారులుగా ఉన్నప్పుడు, అక్కడ ఆత్మ వర్ధిల్లదు, ఆత్మసంబంధమైన ఏ పరిచర్యలు కూడా ముందుకు కొనసాగవు, వర్తిల్లలేవు మృతమైన స్థితిలోనికి వెళ్ళిపోతాయి.

శరీర సంబంధమైన మనసు కలిగిన వాళ్లు, దేవుని నుంచి దైవ సంబంధమైన వాటి నుంచి, ఆశీర్వాదాలు తీసుకోవాలని పొందుకోవాలని ఆశపడతారు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు ఏ రూపంలో కూడా వారు వాడబడరు, వారికి సంబంధించినది దేనిని కూడా దేవునికి ఇవ్వలేరు, ఇటువంటి వారు సత్యమై సమాధానమై ఉన్నటువంటి, యేసుక్రీస్తు ప్రభువు వారిని తండ్రి అయిన దేవుడు సమృద్ధిగా బయలు పరిచినప్పటికిని, దానిని ఆ సమృద్ధి అయినా ఆత్మసంబంధమైన దేవుని జీవమును వెలుగును గ్రహించలేని రీతిలో, ఈ లోక సంబంధమైన యుగ దేవత వారి మనో నేత్రాలకు గృుడ్డితనమును కలుగజేసింది.

ఎస్తేర్ క్రైసోలైట్

29-1-2025