2025 Messages
🍃 🍀🌿📖🌿🍀🍃
దీప స్తంభము తొలగించబడిన ! మరల వెలిగిద్దాం !
" మొదటి క్రియలు చేయమని యోహాను ఏ సంఘానికి చెప్పాడు."
ఈ ప్రశ్నను, ఒక యూట్యూబ్ చానల్ లో నేను చూసినప్పుడు,వెంటనే నాకు నా జీవితమే,గుర్తుకు వచ్చింది.గతమంతా ఒకసారి మరల నేను చూసుకుంటూ వచ్చాను,నా గత అనుభవాన్ని, గుర్తుకు చేసిన ఈ వాక్యాన్ని, వర్తమానంగా వ్రాయాలి అని అనిపించింది.ఎందుకంటే ఈ అనుభవం ఇంకొకరికి, ఆశీర్వాదకరంగా ఉండవచ్చు కదా !
దేవునిలోకి మనము వచ్చినప్పుడు, ఆ దేవుని మీద మనకున్న ఆ మొదటి ప్రేమ,అనేక పరిస్థితుల మధ్య మనము కోల్పోతూ ఉంటాము,నా ఆత్మీయ జీవిత ప్రారంభ దశలో నేను కూడా, దేవుడంటే దేవుడికి సంబంధించిన విషయాలంటే, దేవుని కార్యాలు అంటే, ఒక మిక్కిలి అమితమైన, నన్ను నేను దేవునికి సమర్పించుకునే, అంత ప్రేమను కలిగి ఉండేదాన్ని.
కానీ దేవుని పట్ల నేను కలిగి ఉన్న ఈ ప్రేమను కోల్పోయే పరిస్థితి నాకు సంఘాము వెలుపలి వారి ద్వారా కాదు కానీ, సంఘాము లోపలి వారి ద్వారా అంటే బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు,బంధువులు, సంఘ విశ్వాసులు, సేవకులు, వీరే ఆత్మీయులైన దేవుని ప్రజలైన వీరి ద్వారానే అణచివేయబడే ఒక స్థితి నాకు కలిగింది.
దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు ఎదో ఒకటి చేయాలి అన్న ఒక కోరిక దేవుని మీద ఒక ప్రేమ అంతరంగంలో మండుతూ వుంటే, ఎది చేయ్యటానికి వీలు లేని పరిస్థితులు నా చుట్టూ నన్ను కమ్ముకుంటూ వచ్చేవి.
అప్పుడు నేను ఏమని అనుకునేదాన్ని అని అంటే, ఈ బైబిల్ చదవటం వలన ప్రార్ధించడం వల్ల నాలో ఇటువంటి ఆసక్తి వస్తుంది కాబట్టి,వీటికి దూరంగా ఉండాలి అని, కొద్ది రోజులు వాటికి దూరంగా ఉంటూ వచ్చేదాన్ని, ఇది ఎటువంటి పరిస్థితి అని అంటే, బ్రతికి ఉన్న ఒక పురుగును దానిని చంపకుండా, నలుపుతా ఉంటే అది చావలేదు, దానిలో ఉన్న జీవం కారణంగా బ్రతకాలి అన్న ఆశను అది కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఎలాంటి బాధ కలుగుతుందో అటువంటి పరిస్థితే నాకు కలిగింది.
నాకు ఈ కారణం, ఇంకొకరికి ఇంకోలాంటి కారణం, ఇలా రకరకాలైన కారణాలను బట్టి దేవుని ప్రజలలో ఆసక్తి అన్నది,దేవుని పట్ల కలిగి ఉన్న మొదటి ప్రేమ అన్నది, తరిగి పోతూ ఉంటుంది. దేవుడు మనల్ని ఎప్పుడూ అటువంటి స్థితిలోనే ఉంచలని అనుకోడు.
దేవుడు నన్ను కూడా,నిరాశతో అలా సొమ్మసిల్లి,పడిపోయిన కొన్ని రోజులైనా తర్వాత, మరల ఏదో ఒక వాక్యం ద్వారా,వాగ్దానమును ఇచ్చి, మళ్ళీ నన్ను పట్టుకోని, నాలో రెండింతల ఆసక్తిని, కలుగ చేస్తూ ఆత్మీయ జీవితంలో నేను ముందుకు పోయే పరిస్థితులను నాకు యిచ్చేవాడు.
వాక్యమే వెలుగుగా ఉన్న దేవుడు, దేవుని ఆత్మ మనలో నివాసం వుండటానికి, మనలను తన మందిరముగా, తన నివాస స్థలముగా చేసుకున్నాడు.ఈ మందిరం ఆనే దేవుని నివాస స్థలములో,దేవుని వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా
మనలో ఉంచబడిన పరిశుద్ధాత్మ అనే ఈ దీప స్తంభము ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి,ఏదో ఒక కారణం ద్వారా తప్పిపోయిన ప్రతిసారి,మనకు నష్టము కీడు నాశనము వచ్చే, ఆ స్థితిలోనే దేవుడు మనలను ఉంచాడు. తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ తిరిగి లేపుతూ ఉంటాడు, ఈ విషయమే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను ద్వారా ఎఫేసి సంఘామునకు తెలియజేస్తూ వచ్చారు.
"మొదటి క్రియలు చేయుము" అని చెప్పినది యోహాను ఎఫెసు సంఘానికి, యిది ప్రకటన గ్రంథం 2:1-7 లో ఉంది.
ప్రకటన గ్రంథం 2:4-5
అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసి యున్నది. నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.
ఈ మాటలు యేసు క్రీస్తు ప్రభువు స్వయంగా యోహానుతో చెప్పిన వాక్యాలలో భాగం. ఆయన ఏడు సంఘాలకు ఆత్మీయమైన సందేశాలు ప్రకటించగా, మొదటిది ఎఫెసు సంఘం.
ఎఫెసు సంఘం బహు శ్రద్ధతో, సహనం కలిగిన సంఘంగా ఉండి యేసుని నామమునకు ధైర్యంగా నిలబడినప్పటికీ, వారిలో మొదట ఉండిన ఆ ఆత్మీయమైన ప్రేమను, ఆదికాల ఉత్సాహాన్ని, నూతనమైన భక్తిని కోల్పోయారు. కాబట్టి ప్రభువు వారిని హెచ్చరిస్తూ, మొదటి ప్రేమను గుర్తు చేసుకుని, మళ్లీ మొదటి క్రియలు చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు.
ఎఫెసు సంఘం సేవలు చేయడం, కష్టపడి శ్రమించడం, కట్టుబాటుతో నిలబడడం అన్నీ చేస్తోంది (వచనం 2). అయినా దేవుడు వారిని మెచ్చుకోలేదు, ఎందుకంటే ఆ సేవ వెనుక ఉన్న “ప్రేమ” తక్కువైంది — అంటే మొదట ఎలా ఆయనను ప్రేమించారో, ఇప్పుడలా లేదు.
1. ఎఫెసు సంఘం ప్రారంభంలో ఉన్న స్థితి:
అపో. కార్యములు 19వ అధ్యాయంలో చదివితే, ఎఫెసులో ఉన్న విశ్వాసులు ఎంత ఉత్సాహంగా దేవుని సేవలో ఉండేవారో తెలుస్తుంది.
అపో. కార్యములు 19వ అధ్యాయం – ఇది ఎఫెసు సంఘా ప్రారంభాన్ని ఇందులో మనము చూడవచ్చు, ఈ అధ్యాయం ఎఫెసు సంఘా స్థాపనకు పునాది అనేలా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం.
(1) 19:1–7 – పవిత్రాత్మ గురించిన బోధ & అనుభవం ఇందులో మనకు కనబడతాయి.
ఎఫెసులో కొంతమంది విశ్వాసులు ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ అనుభవం గురించి తెలియదు.
పౌలు వారికి బాప్తిస్మమిచ్చి, వారు పరిశుద్ధాత్మను పొందుతారు, భాషలతో మాటలాడి ప్రవచిస్తాతారు.
(2) 19:8–10 – మూడు నెలలు మందిరంలో బోధ,
పౌలు ధైర్యంగా దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. కొంతమంది గద్దించగా, ప్రత్యేకంగా విశ్వాసులను వేరు చేసి తూరన్ను అనే చోట రెండు సంవత్సరాలు బోధించాడు.అపో.కార్యములు 19:9
అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను.
(3) 19:11–12 – అసాధారణమైన అద్భుతాలు జరగటం పౌలు ద్వారా ఇక్కడ మనకు కనబడతాయి. పౌలు చేతి గుడ్డలు, నడికట్లు తెచ్చుకుని రోగుల మీద వేస్తే రోగాలు వదిలిపోయేవి. దుష్టాత్మలు పారిపోయేవి.
అపో.కార్యములు 19:11-12
మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను; అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను.
తప్పుడు పుస్తకాలను కాల్చారు, అపో.కార్యములు 19:18-19 విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియజేసి యొప్పుకొనిరి.
మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను.
4) 19:18–20 – సత్యము అసత్యము అంటే ఏమిటో విచారణ చేయటం, పాపాన్ని ఒప్పుకోవడం, బలమైన మార్పు, విశ్వాసులు తమ పాత జీవితాల్ని విడిచిపెట్టి తమ బహిరంగంగా పాపాలను ఒప్పుకున్నారు.
📖 "ప్రభువు వాక్యము శక్తిగా మారి విజయం పొందింది." అపో.కార్యములు 19:20
ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. పరిశుద్ధాత్మను అనుభవించారు, మరియు ప్రభువు వాక్యం బలంగా వ్యాపించిందని ఇక్కడ వ్రాయబడి ఉంది.అపో.కార్యములు 19:20
ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను.
2. అలాంటి ప్రేమ ఇప్పుడు ఎఫెసీ సంఘాములో తగ్గిపోయింది.అందుకే,
నీ ఆత్మీయ జీవితమును తిరిగి ప్రారంభించు అన్న పిలుపును దేవుడు యోహాను ద్వారా ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2:1–7 – మొదటి ప్రేమను విడిచిన సంఘానికి, ఎఫెసీయుల ప్రజలకు వారి ఆత్మీయ జీవితంలో ఒక స్థిరమైన జీవితమును ఇవ్వటానికి, ఇది దేవుని పిలుపు, దేవుని హెచ్చరిక.
కారణాలు ఏమైనా కానీ,మీ జీవితంలో కూడా మొదటిగా దేవుని కోరకు కలిగిన ప్రేమ తగ్గిపోయిందా? ప్రార్థనలో, వాక్యధ్యానంలో, సేవలో ఉన్న తొలి ఉత్సాహం నీరసించిందా? దేవుడు మీకు చెబుతున్నాడు "మొదటి క్రియలు చేయుము!" అని.
{"దీపస్తంభము తొలగించడమంటే — మన ఆత్మీయ జీవితంలో దేవుని ఉనికి, దేవుని సన్నిధి, దేవుని ప్రభావం, మన జీవితం నుండి మాయమై పోవటం, దేవుని సన్నిధి మన జీవితంలో ఇక లేదు అన్న సంకేతం! ఇది ఎఫెసు సంఘానికే కాదు, ఇది ప్రస్తుతం, మనకు కూడా ఓ బలమైన హెచ్చరిక.
మన హృదయమనే దేవుని మందిరములో వెలిగే దీప స్తంభం, ఎప్పట్నుంచి మసక బారిందో మనము గుర్తిస్తున్నామా? ప్రభువు ఎఫెసు సంఘానికి చెప్పిన హెచ్చరిక, మన జీవితం మీద కూడా వర్తిస్తుందేమో పరిశీలించుకుందాము.మొదటి ప్రేమ కోల్పోయితే మనం, మళ్ళీ మొదటి క్రియలు చేయాల్సిందే. రండి వెలుగై యున్న వాక్యముతో మనలో మసక బారిన స్థితిలో ఉన్న దీపస్తంభమును"మరల వెలిగిద్దాం" }
ఎస్తేర్ క్రైసోలైట్
4-7-2025
🍃 🍀🌿📖🌿🍀🍃
🍃 🍀🌿📖🌿🍀🍃
దీప స్తంభము తొలగించబడిన ! మరల వెలిగిద్దాం
" మొదటి క్రియలు చేయమని యోహాను ఏ సంఘానికి చెప్పాడు."
ఈ ప్రశ్నను, ఒక యూట్యూబ్ చానల్ లో నేను చూసినప్పుడు,వెంటనే నాకు నా జీవితమే,గుర్తుకు వచ్చింది.గతమంతా ఒకసారి మరల నేను చూసుకుంటూ వచ్చాను,నా గత అనుభవాన్ని, గుర్తుకు చేసిన ఈ వాక్యాన్ని, వర్తమానంగా వ్రాయాలి అని అనిపించింది.ఎందుకంటే ఈ అనుభవం ఇంకొకరికి, ఆశీర్వాదకరంగా ఉండవచ్చు కదా !
దేవునిలోకి మనము వచ్చినప్పుడు, ఆ దేవుని మీద మనకున్న ఆ మొదటి ప్రేమ,అనేక పరిస్థితుల మధ్య మనము కోల్పోతూ ఉంటాము,నా ఆత్మీయ జీవిత ప్రారంభ దశలో నేను కూడా, దేవుడంటే దేవుడికి సంబంధించిన విషయాలంటే, దేవుని కార్యాలు అంటే, ఒక మిక్కిలి అమితమైన, నన్ను నేను దేవునికి సమర్పించుకునే, అంత ప్రేమను కలిగి ఉండేదాన్ని.
కానీ దేవుని పట్ల నేను కలిగి ఉన్న ఈ ప్రేమను కోల్పోయే పరిస్థితి నాకు సంఘాము వెలుపలి వారి ద్వారా కాదు కానీ, సంఘాము లోపలి వారి ద్వారా అంటే బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు,బంధువులు, సంఘ విశ్వాసులు, సేవకులు, వీరే ఆత్మీయులైన దేవుని ప్రజలైన వీరి ద్వారానే అణచివేయబడే ఒక స్థితి నాకు కలిగింది.
దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు ఎదో ఒకటి చేయాలి అన్న ఒక కోరిక దేవుని మీద ఒక ప్రేమ అంతరంగంలో మండుతూ వుంటే, ఎది చేయ్యటానికి వీలు లేని పరిస్థితులు నా చుట్టూ నన్ను కమ్ముకుంటూ వచ్చేవి.
అప్పుడు నేను ఏమని అనుకునేదాన్ని అని అంటే, ఈ బైబిల్ చదవటం వలన ప్రార్ధించడం వల్ల నాలో ఇటువంటి ఆసక్తి వస్తుంది కాబట్టి,వీటికి దూరంగా ఉండాలి అని, కొద్ది రోజులు వాటికి దూరంగా ఉంటూ వచ్చేదాన్ని, ఇది ఎటువంటి పరిస్థితి అని అంటే, బ్రతికి ఉన్న ఒక పురుగును దానిని చంపకుండా, నలుపుతా ఉంటే అది చావలేదు, దానిలో ఉన్న జీవం కారణంగా బ్రతకాలి అన్న ఆశను అది కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఎలాంటి బాధ కలుగుతుందో అటువంటి పరిస్థితే నాకు కలిగింది.
నాకు ఈ కారణం, ఇంకొకరికి ఇంకోలాంటి కారణం, ఇలా రకరకాలైన కారణాలను బట్టి దేవుని ప్రజలలో ఆసక్తి అన్నది,దేవుని పట్ల కలిగి ఉన్న మొదటి ప్రేమ అన్నది, తరిగి పోతూ ఉంటుంది. దేవుడు మనల్ని ఎప్పుడూ అటువంటి స్థితిలోనే ఉంచలని అనుకోడు.
దేవుడు నన్ను కూడా,నిరాశతో అలా సొమ్మసిల్లి,పడిపోయిన కొన్ని రోజులైనా తర్వాత, మరల ఏదో ఒక వాక్యం ద్వారా,వాగ్దానమును ఇచ్చి, మళ్ళీ నన్ను పట్టుకోని, నాలో రెండింతల ఆసక్తిని, కలుగ చేస్తూ ఆత్మీయ జీవితంలో నేను ముందుకు పోయే పరిస్థితులను నాకు యిచ్చేవాడు.
వాక్యమే వెలుగుగా ఉన్న దేవుడు, దేవుని ఆత్మ మనలో నివాసం వుండటానికి, మనలను తన మందిరముగా, తన నివాస స్థలముగా చేసుకున్నాడు.ఈ మందిరం ఆనే దేవుని నివాస స్థలములో,దేవుని వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా మనలో ఉంచబడిన పరిశుద్ధాత్మ అనే ఈ దీప స్తంభము ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి,ఏదో ఒక కారణం ద్వారా తప్పిపోయిన ప్రతిసారి,మనకు నష్టము కీడు నాశనము వచ్చే, ఆ స్థితిలోనే దేవుడు మనలను ఉంచాడు. తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ తిరిగి లేపుతూ ఉంటాడు, ఈ విషయమే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను ద్వారా ఎఫేసి సంఘామునకు తెలియజేస్తూ వచ్చారు.
"మొదటి క్రియలు చేయుము" అని చెప్పినది యోహాను ఎఫెసు సంఘానికి, యిది ప్రకటన గ్రంథం 2:1-7 లో ఉంది.
ప్రకటన గ్రంథం 2:4-5
అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసి యున్నది. నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.
ఈ మాటలు యేసు క్రీస్తు ప్రభువు స్వయంగా యోహానుతో చెప్పిన వాక్యాలలో భాగం. ఆయన ఏడు సంఘాలకు ఆత్మీయమైన సందేశాలు ప్రకటించగా, మొదటిది ఎఫెసు సంఘం.
ఎఫెసు సంఘం బహు శ్రద్ధతో, సహనం కలిగిన సంఘంగా ఉండి యేసుని నామమునకు ధైర్యంగా నిలబడినప్పటికీ, వారిలో మొదట ఉండిన ఆ ఆత్మీయమైన ప్రేమను, ఆదికాల ఉత్సాహాన్ని, నూతనమైన భక్తిని కోల్పోయారు. కాబట్టి ప్రభువు వారిని హెచ్చరిస్తూ, మొదటి ప్రేమను గుర్తు చేసుకుని, మళ్లీ మొదటి క్రియలు చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు.
ఎఫెసు సంఘం సేవలు చేయడం, కష్టపడి శ్రమించడం, కట్టుబాటుతో నిలబడడం అన్నీ చేస్తోంది (వచనం 2). అయినా దేవుడు వారిని మెచ్చుకోలేదు, ఎందుకంటే ఆ సేవ వెనుక ఉన్న “ప్రేమ” తక్కువైంది — అంటే మొదట ఎలా ఆయనను ప్రేమించారో, ఇప్పుడలా లేదు.
1. ఎఫెసు సంఘం ప్రారంభంలో ఉన్న స్థితి:
అపో. కార్యములు 19వ అధ్యాయంలో చదివితే, ఎఫెసులో ఉన్న విశ్వాసులు ఎంత ఉత్సాహంగా దేవుని సేవలో ఉండేవారో తెలుస్తుంది.
అపో. కార్యములు 19వ అధ్యాయం – ఇది ఎఫెసు సంఘా ప్రారంభాన్ని ఇందులో మనము చూడవచ్చు, ఈ అధ్యాయం ఎఫెసు సంఘా స్థాపనకు పునాది అనేలా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం.
(1) 19:1–7 – పవిత్రాత్మ గురించిన బోధ & అనుభవం ఇందులో మనకు కనబడతాయి.
ఎఫెసులో కొంతమంది విశ్వాసులు ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ అనుభవం గురించి తెలియదు.
పౌలు వారికి బాప్తిస్మమిచ్చి, వారు పరిశుద్ధాత్మను పొందుతారు, భాషలతో మాటలాడి ప్రవచిస్తాతారు.
(2) 19:8–10 – మూడు నెలలు మందిరంలో బోధ, పౌలు ధైర్యంగా దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. కొంతమంది గద్దించగా, ప్రత్యేకంగా విశ్వాసులను వేరు చేసి తూరన్ను అనే చోట రెండు సంవత్సరాలు బోధించాడు అపో కార్యములు 19:9 అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను.
(3) 19:11–12 – అసాధారణమైన అద్భుతాలు జరగటం పౌలు ద్వారా ఇక్కడ మనకు కనబడతాయి. పౌలు చేతి గుడ్డలు, నడికట్లు తెచ్చుకుని రోగుల మీద వేస్తే రోగాలు వదిలిపోయేవి. దుష్టాత్మలు పారిపోయేవి.
అపో.కార్యములు 19:11-12
మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను; అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను.
తప్పుడు పుస్తకాలను కాల్చారు, అపో.కార్యములు 19:18-19 విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియజేసి యొప్పుకొనిరి.
మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను.
4) 19:18–20 – సత్యము అసత్యము అంటే ఏమిటో విచారణ చేయటం, పాపాన్ని ఒప్పుకోవడం, బలమైన మార్పు, విశ్వాసులు తమ పాత జీవితాల్ని విడిచిపెట్టి తమ బహిరంగంగా పాపాలను ఒప్పుకున్నారు.
📖 "ప్రభువు వాక్యము శక్తిగా మారి విజయం పొందింది." అపో.కార్యములు 19:20
ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. పరిశుద్ధాత్మను అనుభవించారు, మరియు ప్రభువు వాక్యం బలంగా వ్యాపించిందని ఇక్కడ వ్రాయబడి ఉంది అపో.కార్యములు 19:20 ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను.
2. అలాంటి ప్రేమ ఇప్పుడు ఎఫెసీ సంఘాములో తగ్గిపోయింది.అందుకే,
నీ ఆత్మీయ జీవితమును తిరిగి ప్రారంభించు అన్న పిలుపును దేవుడు యోహాను ద్వారా ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2:1–7 – మొదటి ప్రేమను విడిచిన సంఘానికి, ఎఫెసీయుల ప్రజలకు వారి ఆత్మీయ జీవితంలో ఒక స్థిరమైన జీవితమును ఇవ్వటానికి, ఇది దేవుని పిలుపు, దేవుని హెచ్చరిక.
కారణాలు ఏమైనా కానీ,మీ జీవితంలో కూడా మొదటిగా దేవుని కోరకు కలిగిన ప్రేమ తగ్గిపోయిందా? ప్రార్థనలో, వాక్యధ్యానంలో, సేవలో ఉన్న తొలి ఉత్సాహం నీరసించిందా? దేవుడు మీకు చెబుతున్నాడు "మొదటి క్రియలు చేయుము!" అని.
{"దీపస్తంభము తొలగించడమంటే — మన ఆత్మీయ జీవితంలో దేవుని ఉనికి, దేవుని సన్నిధి, దేవుని ప్రభావం, మన జీవితం నుండి మాయమై పోవటం, దేవుని సన్నిధి మన జీవితంలో ఇక లేదు అన్న సంకేతం! ఇది ఎఫెసు సంఘానికే కాదు, ఇది ప్రస్తుతం, మనకు కూడా ఓ బలమైన హెచ్చరిక. మన హృదయమనే దేవుని మందిరములో వెలిగే దీప స్తంభం, ఎప్పట్నుంచి మసక బారిందో మనము గుర్తిస్తున్నామా? ప్రభువు ఎఫెసు సంఘానికి చెప్పిన హెచ్చరిక, మన జీవితం మీద కూడా వర్తిస్తుందేమో పరిశీలించు కుందాము మొదటి ప్రేమ కోల్పోయితే మనం, మళ్ళీ మొదటి క్రియలు చేయాల్సిందే. రండి వెలుగై యున్న వాక్యముతో మనలో మసక బారిన స్థితిలో ఉన్న దీపస్తంభమును"మరల వెలిగిద్దాం" }
ఎస్తేర్ క్రైసోలైట్
4-7-2025
🍃 🍀🌿📖🌿🍀🍃