2025 Messages
🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
🌟 వెలుగుతో కూడిన సిద్ధె నీలో ఉందా! 🌟
🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
మత్తయి 25:4
బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడ సిద్దెలలో నూనె తీసికొనిపోయిరి.
1. ఈ వాక్యంలో ప్రధానముగా మనకు కనపడేది, వెలుగుతూ ఉన్న దివిటీలతో వున్న, ( దేవుని వాక్యము చేత వెలిగింప బడిన ఆత్మతో ) కన్యకలు అంటే ప్రజలు.
2. దివిటి అంటే నరునిలో వున్న ఆత్మ (నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము )
3. సిద్ధె అంటే ఆత్మయు జీవమునై యున్న దేవుని వాక్యము, ప్రార్థన విశ్వాసము ద్వారా మన హృదయంలో నింపబడి వున్న, దేవుని సన్నిధి దేవుని కొరకైన సిద్ధపాటు,
4. నూనె అంటే ఇది నరుని ఆత్మను స్వాధీనము చేసుకుని నడిపించే పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది.
సిద్ధె ఆంటే :
సిద్ధె అనేది భవిష్యత్ లో జరగబోయే సంఘటనలకు, ఒక ప్రణాళికతో సిద్ధముగా ఉండటాన్ని యిది సూచిస్తుంది. ముందు ప్రణాళిక, అవసరమైన వనరుల సేకరణ, పరిస్థితులకు తగిన విధంగా ముందుగానే, సిద్ధపడి సిద్ధం చేసుకుని ఉండటమును, అల సిద్ధపడి ఉండే పాత్రను సిద్ధె అని అంటారు.
మత్తయి 25 : 4 లో బుద్ధి కలిగి వున్న ఈ కన్య కలతో వీరితో దీవిటి అన్నది వెలుగుతూ ఉంది. వీరి దగ్గర వెలుగుతూ ఉన్నటువంటి దివిటి, పెండ్లి కుమారుడు రావటం ఆలస్యం అయిన, ప్రతికూల పరిస్థితులలో అప్పుడు కూడా వారి దీవిటి వెలుగుతూ ఉండటానికి, ఈ బుద్ధి కలిగిన వారు, తమతో తమ సిద్ధెలలో నూనేను కూడా, తీసుకొని వెళ్లినట్లు ఇక్కడ మనకు కనబడుతుంది.
మానవుని ఆత్మ & దేవుని ఆత్మ :
ఆత్మ సంబంధమైన జీవితంలో * సిద్ధె ఆనేది మన హృదయానికి మన ఆత్మ సంబంధమైన జీవితానికి పోల్చబడినది. దివిటి అంటే ఇది మానవుని ఆత్మకు నూనె అంటే పరిశుద్ధాత్మకు, దేవుని ఆత్మకు సూచనగా * ఇక్కడ కనబడుతుంది.
సామెతలు 20:27
" నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము "
నరునిలో ఉన్నటువంటి ఈ దీపము దేవుని ఊపిరి ఈ నరుని ఆత్మ దుష్టాత్మతో కలసి అన్న పనిచేస్తుంది లేకపోతే పరిశుద్ధాత్మతో కలసి అన్న పనిచేస్తుంది.
1. మొదటి ఆదాము సాతాను తలంపుతో దుష్టాత్మతో, ఏకీభవించటము వలన మానవ వంశమంతా, దేవుని సన్నిధికి దూరమయ్యారు.
2. కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు, పరిశుద్ధాత్మతో నిర్మించబడి ఏకీభవించడము ద్వారా, సమస్త మానవులు కోల్పోయిన దేవుని సన్నిధిని, తిరిగి మానవులకు అనుగ్రహించారు.
మానవుని ఆత్మ మరియు దేవుని ఆత్మ ఈ రెండు వేరుగా ఉన్నాయని, పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా చెప్పుతుంది. ఇవి వేరువేరు అయినప్పటికీ, దేవుని ఆత్మ మానవుని ఆత్మతో కలసి అనుసంధానమై పనిచేస్తుంది. మానవుని ఆత్మ దేవునిచే సృష్టించబడింది. (జెకర్యా 12:1) దేవోక్తి ఇశ్రాయేలీయులనుగూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చున దేమనగా,
ఈ వచనం ప్రకారం, మానవుని ఆత్మ అనేది దేవుని చేత సృష్టించబడినది, దేవుని ఆత్మ అనేది స్వతంత్రమైనది, కానీ అది మానవుని ఆత్మతో కలిసి పనిచేస్తుంది. దేవుని ఆత్మ మనిషి ఆత్మలో నివసించి, దానిని నడిపిస్తుంది. మానవుని ఆత్మ దేవుని ఆత్మకు ఆధీనమై ఉండాలి, దేవుని ఆత్మ మానవుని ఆత్మతో సహకరిస్తుంది, దేవుని ఆత్మ మానవుని ఆత్మకు సాక్షిగా నిలుస్తుంది కూడా,
( రోమీయులకు 8:16 ) మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చు చున్నాడు.
( యెహేజ్కేలు 36:26,27 ) నా ఆత్మను మీ యందుంచి, నా కట్టడల ననుసరించు వారిని గాను నా విధులను గైకొను వారినిగాను, మిమ్మును చేసెదను. ( 1కోరింథీయులకు 2:11,12 )దేవుని వలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై, మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి, వచ్చు ఆత్మను పొందియున్నాము.
దివిటి దీపము :
దేవుని ఊపిరి లో నుంచి మానవుని లోనికి వచ్చిన,
ఈ దేవుడైన యెహోవా పెట్టిన దీపము, పాత నిబంధనలో మానవుడు, దేవుని మాటకు అవి ధేయుడు అవటం వలన, శాపగ్రస్తమైన మరణానికి లోనైనా మానవుని శరీరం వెలుపల దేవుని ఆత్మ జీవించవలసి వచ్చింది. అందుకే పాత నిబంధనలో దేవుని నివాసం, దీపం రూపములో ఇశ్రాయేలీయుల మధ్య ప్రత్యక్ష గుడారంలో ఉండి, నిత్యం మండుతూ ఉండేది. ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న ప్రత్యక్ష గుడారంలో నిత్యము మండుతూ ఉన్నటువంటి, ఈ దీపము దేవుని సన్నిధికి ఇది చూచనగా ఉంది. (లేవీయ 24: 2, 3,)
( నిర్గమ 27:20, 21 )
లేవీయకాండము 16:12,13,
యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను, తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసికొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు,
ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు, యెహోవా సన్నిధిని ఆ అగ్నిమీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను.
నూనే : పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది.
ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో ఒలీవల నూనెతో నిత్యము దీపము వెలిగించడము అనేది పవిత్రత, ప్రతిష్ట కోసము ఒక ఆత్మ సంబంధమైన చిహ్నముగా ఇది మనకు కనబడుతుంది. అందుకనే పాత నిబంధనలో దేవుడు తన పని కొరకు ఎవరిని వాడుకోవాలి అని అనుకున్నా, అక్కడ నూనెతో వారి తలను అభిషేకింప చేశాడు.
ఆదికాండము 2:7
దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా, నరుడు జీవాత్మ ఆయెను.
ఇక్కడ నరుడు నేలమంటితో నిర్మించ బడిన తర్వాత, అప్పుడు దేవుని ఆత్మ నరుని లోకి వచ్చింది. అందుకే పాపం అన్నది, నరునిలో ప్రవేశించిన తర్వాత,మానవుడు దేవుని సన్నిధిని కోల్పోయి, దేవుని సన్నిధిలో నుంచి గెంటివేయబడ్డాడు.( ఆది 3 : 23 )
మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. ( ప్రసంగి 12:7 )
పాత నిబంధనలో మానవుడు కోల్పోయిన దేవుని సన్నిధిని, తిరిగి మానవునికి ఇచ్చుట కొరకు తండ్రి అయిన దేవుడు క్రొత్త నిబంధనలో, యేసు క్రీస్తు ప్రభువు వారి శరీరమును పరిశుద్ధాత్మతో నిర్మించి
మానవుడు జయించ లేనటువంటి, ప్రతి దానిని యేసుక్రీస్తు ప్రభువారు తాను జయించిన, పునరుత్థానపు ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా మానవుని హృదయంలో నివసిస్తున్నారు. ఇప్పుడు దేవుని సన్నిధి దేవుని నివాసం దేవుని ఆత్మ యేసుక్రీస్తు ప్రభువు వారిలో వున్న ప్రజల శరీరం వెలుపల లేదు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధి మానవుని లోనే ఉన్నది.
యేసుక్రీస్తు ప్రభువు వారి మరణ భూస్థాపన పునరుత్థానాల ద్వారా బాప్తిస్మం నందు ఎవరు పాలి భాగమును కలిగి ఉంటారో, వారందరూ కూడా అన్నిటిని జయించే యేసుక్రీస్తు ప్రభువు వారి పునరుత్థానపు మహిమ శరీరమును ధరించ గలుగుతారు( ఎఫెసీయులకు 2:7 ) క్రీస్తుయేసు నందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోక మందు ఆయనతో కూడ కూర్చుండ బెట్టెను.
మనము ఇంకా మరణించి తిరిగి లేవకముందే, ఈ వాక్యమును విశ్వసించుట ద్వారా, మనము పరలోకంలో ఉన్నాము. మనము పరలోక రాజ్య సంబంధులము, మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది, ఈ వాక్యమును చదివినప్పుడేల్లా నాకు యిది ఎంతో అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది.
కొలస్సీయులకు 3:1-- 4 మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనేగాని,భూసంబంధమైన వాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడ దేవుని యందు దాచబడియున్నది. మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్ష మైనప్పుడు మీరును ఆయనతో కూడ మహిమ యందు ప్రత్యక్ష పరచ బడుదురు.
మనకు జీవమై యున్న, క్రీస్తు ప్రత్యక్ష మైనప్పుడు,
బుద్ధిగల కన్యకలు వలే మనము ఉండాలి, అని అంటే, ఈ లోక సంబంధమైన శరీర కార్యాలతో, ఈ లోక సంబంధమైన విషయాలతో, మనము మత్తులై ఉండకుండా, మనలో వెలిగించబడి ఉన్న పరిశుద్ధాత్మ అనే దివిటీని, ప్రతికూల పరిస్థితులు ఏమి వచ్చి నప్పటికీ దానిని నిత్యము ప్రకాశింప చేయటానికి, జీవింప చేయడానికి ఆత్మయు జీవమునై యున్న దేవుని వాక్యము చేత, ప్రార్థన చేత విశ్వాసము చేత మనము జీవించాలని దేవుని ఉద్దేశ్యమై యున్నది.
మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులై యుండుడి. (ఎఫెసీయులకు 5:18)
శరీర సంబంధమైన కార్యాలతో, ఈ లోక సంబంధమైన విషయాలతో, మత్తులై, బుద్ధిలేని సిద్ధపాటు లేని కన్యకలు వలె కాక, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు వారిలో, దాచబడి ఉన్నటువంటి, మనలో ఉన్నటువంటి జీవమును, దేవుని ఆత్మ అనే దీపమును నిత్యము జీవింపజేసే వెలిగింపచేసే, వెలుగుతూ ఉండేటట్లు చేసే, దేవుని వాక్యము, ప్రార్థన విశ్వాసము అనే సిద్ధె మీ దగ్గర ఉన్నదా ?
ఎస్తేర్ క్రైసోలైట్
6-1-2025
🍃 🍀🌿📖🌿🍀🍃