2025 Messages
🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
🌟 లూదియా - ( సమృద్ధిగల ) part-1 🌟
🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
లూదియా - ( సమృద్ధిగల )
లూదియా అనే పేరు గ్రీకు భాష నుండి వచ్చింది. ఈ పేరు "సమృద్ధి గల" అనే అర్థమును కలిగి వుంది.
పరిశుద్ధ గ్రంథంలో లూదియా పేరు అపోస్తలుల కార్యములు 16:14 లో మనకు కనిపిస్తుంది.ఈ వచనంలో లూదియా అనే దైవభక్తిగల స్త్రీ గురించి మనము చదువుతాము. ఆమె ఊదారంగు పొడిని అమ్మే తుయతైర పట్టణస్థురాలు, ఆమె తుయతైర పట్టణానికి చెందినవారు, ఊదారంగు బట్టల వ్యాపారిణి.
అపో.కార్యములు 16:14 అప్పుడు
లూదియ యను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్య ముంచెను.
పౌలు దేవుని మాటలను చెప్పుతున్నప్పుడు లూదియా యను ఒక స్త్రీ ఆ మాటలను వింటూ వచ్చింది ఈ లూదియా దైవభక్తిగల యొక స్త్రీ అని వ్రాయబడినది దేవుని పట్ల దేవుని వాక్యం పట్ల దైవ సంబంధమైన వాటి పట్ల భయము భక్తిని కలిగి ఉన్నవారు మాత్రమే వాటికి సంబంధించిన మాటలను వింటారా! ఇది నిజమా ! అని అంటే ఇది నిజమే! ఎందుకంటే భయభక్తి గలవారే దేవుని మాటల పట్ల ఆశక్తి ఏర్పరుచుకుంటారు.
సామెతలు 1:7
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. దేవుని పట్ల మనము కలిగి ఉన్న భయము భక్తి అన్నది జ్ఞానానికి ఆరంభము ప్రారంభం కానీ దేవుని పట్ల భయము భక్తిని కలిగి ఉండని మూర్ఖులు జ్ఞానాన్ని మరియు బుద్ధిని తృణీకరిస్తారు." (ఇక్కడ భయభక్తి జ్ఞానానికి ఆరంభమని చెబుతూ, మూర్ఖులు దాన్ని నిరాకరించడాన్ని తెలియజేశారు.)
అపోస్తులుడైన పౌలు దేవుని వాక్యమును దేవుని గురించిన సందేశాలను దైవ సంబంధమైన మాటలను తెలియజేస్తున్నప్పుడు లూదియ యను దైవభక్తిగల స్త్రీ ఆ దేవుని మాటలను వింటూ నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలో ఆ మాటలను ఆ దేవుని వాక్యాలను విశ్వసించే విశ్వాసమును కలిగించాడు రోమీయులకు 10:17
కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.
లూదియా అపోస్తుడైన పౌలు చెప్పే మాటలను విని విశ్వసించినప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మన హృదయాన్ని తెరవడం, విశ్వాసానికి మార్గమవుతుంది.
యెహేజ్కేలు 36:26 నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.
ఎవరైతే దేవుని కొరకు తమ హృదయాలను తెరుస్తారో తమ హృదయాలు తెరవబడటానికి దేవుని అధికారమునకు లోబడతారో
దేవుడు వారి రాతి హృదయాన్ని తీసివేసి, మృదువైన,దేవుని మాటలను దేవుని వాక్యాలను విశ్వసించే అంగీకరించే మాంసపు హృదయాన్ని దేవుడు వారికి ఇస్తాడు పౌలు ప్రసంగించిన వాక్యాలను లూదియా వినడం ద్వారా ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు, విశ్వాసానికి మార్గము అనే దానిని చూపించాడు.
"దేవుడు తన వాక్యాన్ని వినే వారిలో రాతి హృదయాన్ని మార్చి, విశ్వాసానికి సిద్ధమైన మృదువైన హృదయాన్ని ఇస్తాడు. లూదియా హృదయాన్ని తెరవడం ద్వారా, దేవుడు తన మాటలను గ్రహించడానికి ఆమెను సిద్ధం చేశాడు."
ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్య ముంచెను.
ఆత్మయు జీవమునై ఉన్న దేవుని వాక్యముల కొరకు లూదియా హృదయము ఎప్పుడైతే తెరవబడినదో అప్పుడు ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది యెహేజ్కేలు 36:27
నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.
దేవుని మాటల యందు మనము లక్ష్యముంచటము వలన మనకు కలిగే ప్రయోజనము
1. కీర్తనలు 119:11
నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.
(దేవుని వాక్యాన్ని మన హృదయంలో లక్ష్యముంచి నప్పుడు అది మనలను పాపానికి దూరంగా ఉంచుతుంది.
2. యిర్మియా 31:33 వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే యిర్మియా 31:34 నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; (దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచినప్పుడు అది మనల్ని దేవునితో ఒక అనుబంధంలోకి ఒక నిబంధనలోనికి మనలను తీసుకువస్తుంది.)
3. హెబ్రీయులకు 4:12
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.
(దేవుని వాక్యము మన హృదయాన్ని బలముగా ప్రభావితము చేసి, మన ఆలోచనలను, ఉద్దేశాలను పరిశీలించి దేవునికి అనుకూలముగా మనలను మన జీవితాలను మార్పు చేస్తుంది రూపాంతర పరుస్తుంది.)
4. కీర్తనలు 19:14
యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక.
(దేవుని మాటలను ధ్యానించడము ద్వారా మన హృదయం శుద్ధికరించ బడుతుంది.)
"దేవుని వాక్యాలను మన హృదయంలో దాచుకున్నప్పుడు, వాటిని మనము ధ్యానము చేసినప్పుడు అవి మన ఆలోచనలను మార్చి, మన హృదయాన్ని శుద్ధి చేసి, దేవుని చిత్తానికి అనుకూలముగా ఉండేలా మార్పు చేస్తాయి. ఆత్మ యు జీవమునై యున్న దేవుని మాటలు జీవమును ప్రసాదించి, మనలో కొత్త ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నింపుతాయి."
లూదియ దైవభక్తి గలస్త్రీ,
లూదియ దేవుని వాక్యమును వినుచుండెను,
లూదియ హృాదయమును దేవుడు తెరచెను,
లూదియ దేవుని మాటల యందు లక్ష్యం ముంచెను,
లూదియా, యూరోపులో మొట్టమొదటి క్రైస్తవురాలిగా, ఫిలిప్పీ నగరంలో పరిచయమవుతుంది. ఇది చరిత్రపరంగా ఎంతో ముఖ్యమైన విషయమే. దేవుని సేవ కోసం తన ఇంటిని వ్యక్తిగతంగా అంకితం చేయడంలో, ఆమె ముందుండడం (ఆపో: 16:15), ఆమె తెరచిన హృదయానికి, సేవాపరమైన దృక్పథానికి సాదృశ్యముగా నిలుస్తుంది.
‘సమృద్ధిగల" అనే అర్థమున్న పేరును కలిగిన లూదియా, నిత్యజీవపు సమృద్ధిని అందించే దేవుని వాక్యము మీద తన దృష్టిని కేంద్రీకరించి, తన పేరులోని అర్థాన్ని నిజంగా సార్ధకం చేసుకుంది. దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకునే స్ఫూర్తిని ఆమె జీవితం మనకు స్పష్టంగా చూపిస్తుంది."
ఎస్తేర్ క్రైసోలైట్
21-1-2025
🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
🌟 లూదియా - ( సమృద్ధిగల ) part-1 🌟
🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
లూదియా - ( సమృద్ధిగల )
లూదియా అనే పేరు గ్రీకు భాష నుండి వచ్చింది. ఈ పేరు "సమృద్ధి గల" అనే అర్థమును కలిగి వుంది.
పరిశుద్ధ గ్రంథంలో లూదియా పేరు అపోస్తలుల కార్యములు 16:14 లో మనకు కనిపిస్తుంది.ఈ వచనంలో లూదియా అనే దైవభక్తిగల స్త్రీ గురించి మనము చదువుతాము. ఆమె ఊదారంగు పొడిని అమ్మే తుయతైర పట్టణస్థురాలు, ఆమె తుయతైర పట్టణానికి చెందినవారు, ఊదారంగు బట్టల వ్యాపారిణి.
అపో.కార్యములు 16:14 అప్పుడు
లూదియ యను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్య ముంచెను.
పౌలు దేవుని మాటలను చెప్పుతున్నప్పుడు లూదియా యను ఒక స్త్రీ ఆ మాటలను వింటూ వచ్చింది ఈ లూదియా దైవభక్తిగల యొక స్త్రీ అని వ్రాయబడినది దేవుని పట్ల దేవుని వాక్యం పట్ల దైవ సంబంధమైన వాటి పట్ల భయము భక్తిని కలిగి ఉన్నవారు మాత్రమే వాటికి సంబంధించిన మాటలను వింటారా! ఇది నిజమా ! అని అంటే ఇది నిజమే! ఎందుకంటే భయభక్తి గలవారే దేవుని మాటల పట్ల ఆశక్తి ఏర్పరుచుకుంటారు.
సామెతలు 1:7
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. దేవుని పట్ల మనము కలిగి ఉన్న భయము భక్తి అన్నది జ్ఞానానికి ఆరంభము ప్రారంభం కానీ దేవుని పట్ల భయము భక్తిని కలిగి ఉండని మూర్ఖులు జ్ఞానాన్ని మరియు బుద్ధిని తృణీకరిస్తారు." (ఇక్కడ భయభక్తి జ్ఞానానికి ఆరంభమని చెబుతూ, మూర్ఖులు దాన్ని నిరాకరించడాన్ని తెలియజేశారు.)
అపోస్తులుడైన పౌలు దేవుని వాక్యమును దేవుని గురించిన సందేశాలను దైవ సంబంధమైన మాటలను తెలియజేస్తున్నప్పుడు లూదియ యను దైవభక్తిగల స్త్రీ ఆ దేవుని మాటలను వింటూ నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలో ఆ మాటలను ఆ దేవుని వాక్యాలను విశ్వసించే విశ్వాసమును కలిగించాడు రోమీయులకు 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.
లూదియా అపోస్తుడైన పౌలు చెప్పే మాటలను విని విశ్వసించినప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మన హృదయాన్ని తెరవడం, విశ్వాసానికి మార్గమవుతుంది. యెహేజ్కేలు 36:26 నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.
ఎవరైతే దేవుని కొరకు తమ హృదయాలను తెరుస్తారో తమ హృదయాలు తెరవబడటానికి దేవుని అధికారమునకు లోబడతారో
దేవుడు వారి రాతి హృదయాన్ని తీసివేసి, మృదువైన,దేవుని మాటలను దేవుని వాక్యాలను విశ్వసించే అంగీకరించే మాంసపు హృదయాన్ని దేవుడు వారికి ఇస్తాడు పౌలు ప్రసంగించిన వాక్యాలను లూదియా వినడం ద్వారా ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు, విశ్వాసానికి మార్గము అనే దానిని చూపించాడు.
"దేవుడు తన వాక్యాన్ని వినే వారిలో రాతి హృదయాన్ని మార్చి, విశ్వాసానికి సిద్ధమైన మృదువైన హృదయాన్ని ఇస్తాడు. లూదియా హృదయాన్ని తెరవడం ద్వారా, దేవుడు తన మాటలను గ్రహించడానికి ఆమెను సిద్ధం చేశాడు."
ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్య ముంచెను.
ఆత్మయు జీవమునై ఉన్న దేవుని వాక్యముల కొరకు లూదియా హృదయము ఎప్పుడైతే తెరవబడినదో అప్పుడు ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది యెహేజ్కేలు 36:27 నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.
దేవుని మాటల యందు మనము లక్ష్యముంచటము వలన మనకు కలిగే ప్రయోజనము
1. కీర్తనలు 119:11
నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. (దేవుని వాక్యాన్ని మన హృదయంలో లక్ష్యముంచి నప్పుడు అది మనలను పాపానికి దూరంగా ఉంచుతుంది.