2025 Messages
🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
🌟 ధైర్యాన్ని కలిగించే వాగ్దానం – నూతన ఆశీర్వాదానికి ద్వారము
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
యెహేజ్కేలు 29:21
ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగిరింప జేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసె దను, అప్పుడు నేను యెహోవానైయున్నానని వారు తెలిసికొందురు.
ఈ వాక్యము దేవుడు తనను సేవించే వారికి వారి బలహీనతల నుండి విముక్తి కలుగ జేసి, వారికి ధైర్యమును అధికారమును ఇవ్వటమును గూర్చి ఇది సూచిస్తుంది. దేవుని చిత్తానుసారంగా మాటలాడటానికి ధైర్యం కలిగించి దేవుని స్వభావాన్ని దేవుని గుణాతిశయములను అనేకులకు ప్రకటించడానికి అవకాశం కల్పిస్తాడు.
1పేతురు 2:9
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను, ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
1. ఆత్మ విశ్వాసం: దేవుడు మనలను ఒక బాధ్యత లేదా పిలుపులోకి పిలిచినప్పుడు, దేవుడు దానికి అవసరమైన ధైర్యము జ్ఞానము మాటల నేర్పును అంటే మంచి వాక్చాతుర్యము అనే దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కలుగజేస్తాడు.
కొలస్సీయులకు 4:3,4
మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని(ప్రవేశద్వారము తెరువవలెనని) మాకొరకు ప్రార్థించుడి.
కొలస్సీయులకు 4:6
ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనియ్యుడి.
సామెతలు 25:11
సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.ఎఫెసీయులకు 4:29
వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.
2. నూతన ఆశీర్వాదం: " ఇశ్రాయేలీయుల కొమ్ము చిగిరింప జేసి " అనే మాట ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని సూచిస్తుంది. దేవుడు మన జీవితములలో ఒక క్రోత్త దారిని ప్రారంభిస్తాడు. నూతనమైన మార్గమును దేవుడు తేరుస్తాడు, దాని వలన మనము ఇతరులకు ఆశీర్వాదముగా ఉంటాము, ఆజ్ఞలు ధర్మశాస్త్రమును సంపూర్ణముగా పాటించ లేకపోయిన పాత నిబంధన భక్తులకు నిత్యజీవమును ఇవ్వటానికి, యేసుక్రీస్తు ప్రభువారు " చిగురు " గా దావీదు వంశంలో జన్మించారు.
యిర్మియా 23:5
యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.
నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని గూర్చి
మనము ప్రకటిస్తున్నప్పుడు వీరు ప్రకటిస్తున్న దేవుడు నిజమైన దేవుడు గొప్పవాడు, అని ప్రజలందరూ గ్రహించగలిగేటట్లు, మనకు మాట్లాడే శక్తిని ఇవ్వటానికి, దేవుడు మన నోటిని తెరిచి తన వాక్యంతో మనలను నింపుతాడు.
తన పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించి మనలను ఆత్మశక్తితో నింపుతాడు.
యెహేజ్కేలు 29:21 లో వున్న ఈ వాక్యము ఈ వాగ్దానము, ఇది ముఖ్యంగా ఎవరైనా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి భయపడుతుంటే, వారికి ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానం ఇది అని దీనిని గురించి మనం చెప్పవచ్చు.
"వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసెదను " అనే మాట మనలను దేవుని పిలుపులో నిలబెట్టడానికి, ఇతరుల ముందు ప్రకాశింపజేయడానికి, దేవుడు సిద్ధం చేస్తున్నాడన్న విషయమును కూడ, ఇది తెలియజేస్తుంది.
ఎస్తేర్ క్రైసోలైట్
17-1-2025
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃 🌟