CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃🌟

మన శృంగము ఇనుపదిగా, మన డెక్కలు ఇత్తడివిగా చేసే దేవుని చేతుల్లో ఉన్న

నూతనమైన శక్తి

🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃

మీకా 4:13

సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగ ద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతి ష్టించుదును.

ఈ వాక్యము దేవుని ప్రజలను బలపరచటానికి శత్రువులపై విజయం సాధించేందుకు వారిని సిద్ధం చేయటానికి దేవుని ప్రజల పట్ల దేవుని సంకల్పాన్ని ఈ వాక్యము మనకు చూపిస్తుంది. శృంగము మరియు డెక్కలు అనేవి బలాన్ని, పట్టుదలని నూతనముగా దేవునిచే పొందిన శక్తిని యివి సూచిస్తున్నాయి ఈ దేవుని శక్తితో, దేవుని బలముతో ప్రజలు శత్రువులను ఎదురించి నాశనం చేయగలుగుతారు.

బలహీనులైన మానవులను తన సాధనముగా వాడుకోవాటానికి దేవుడు అనేకమైన అవకాశాలను ఇచ్చి తన శక్తి చేత తన సాధనముగా వాడు కుంటాడు అన్న విషయమును ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది.

బలపరిచిన శక్తి : దేవుడు మన బలహీనతలను తన శక్తితో మార్చుతాడు.పరిశుద్ధ గ్రంథంలో బలహీనులైన వారిని దేవుడు తన శక్తి ద్వారా బలపరిచి తన కొరకు వాడుకున్నాడు వారిలో,

1. మోషే (Moses) మోషే తనను తాను తక్కువగా భావించి, ప్రజల ఎదుట మాట్లాడటానికి అర్హత లేని వాడిగా భావించాడు.

బలహీనత : మోషే ఫరో ఎదుట ప్రజలను విముక్తి చేయడానికి తనకు మాటలలో నైపుణ్యం లేదని చెప్పాడు (నిర్గమకాండం 4:10-17 ).

దేవుని శక్తి : దేవుడు మోషేకు ఆహారోనును సహాయకుడిగా నియమించి, తనఅద్భుత క్రియలను సూచక క్రియలను చేసి ఫరోను ఓడించాడు. మోషే ఒక గొప్ప నాయకుడిగా నిలిచాడు.

2. గిడియోను (Gideon)

గిడియోను తనను తాను చాలా బలహీనుడిగా భావించాడు. బలహీనత : గిడియోను తన కుటుంబం ఇశ్రాయేలు తెగలలో అత్యల్పమైనదని తాను చిన్నవాడినని చెప్పాడు.

న్యాయాధిపతులు 6:15

​అతడు చిత్తము నా యేలిన వాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిన నేమి?

న్యాయాధిపతులు 6:16

నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను.

దేవుని శక్తి : దేవుడు అతనిని శక్తివంతమైన సైనిక నాయకుడిగా మార్చి, అతని ద్వారా మిద్యానీయులను ఓడించి ఇశ్రాయేలు ప్రజలకు విముక్తి కలుగ చేశాడు.

పౌలు (Paul)

పౌలు తన శరీరంలో "ముల్లు" ఉందని చెప్పాడు, ఇది అతని బలహీనతగా భావించబడింది.

బలహీనత : పౌలు ఆ ముల్లును తొలగించాలని దేవునిని ప్రార్థించాడు, కానీ దేవుడు అందుకు సమ్మతించలేదు.

2కోరింథీయులకు 12:7 -10

నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచ బడెను.అది నా యొద్ద నుండి తొలగి పోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.

అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను.

కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము(లేక,నన్ను కప్పునిమిత్తము) , విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయ పడుదును.

నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల లోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను.

దేవుని శక్తి: దేవుడు అతనికి, "నా కృప నీకు చాలు. బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది" అని చెప్పాడు. పౌలు తన బలహీనతలలో దేవుని శక్తి పరిపూర్ణము అవ్వటానికే ఒప్పుకున్నాడు.

ఈ ముగ్గురు వ్యక్తుల జీవితాలు మనకు ఏమి చెప్పుతున్నాయి అని అంటే ?

1. మోషే ద్వారా, దేవుడు నత్తి వారిని నోటి మాంద్యము గల వారిని కూడా గొప్ప నాయకులుగా మార్చుతాడని చూపించాడు.

2. గిడియోను ద్వారా, దేవుడు చిన్నవారిని కూడా శక్తివంతమైన సాధనముగా ఉపయోగిస్తాడని నిరూపించాడు.

3. పౌలు ద్వారా, మన బలహీనతలే దేవుని శక్తికి వేదికలుగా మారతాయని స్పష్టమవుతుంది.

మరి మీకు కలిగిన బలహీనత ఏమిటి ? మీ బలహీనత ఆది ఏదైనా సరే దానిని దేవుని చేతులకు అప్పగించండి దేవుడు మిమ్మల్లి కూడ వాడుకో గలడు.

ఎస్తేర్ క్రైసోలైట్

19-1-2025

🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃 🌟