2026 Daily Bread
praise the Lord (1-1-2026)
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓋 వాక్యములోని 𝓋 వాగ్దానము 𝟸𝟶𝟸𝟼 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
1. యెషయా 41:10
నీకు తోడైయున్నాను "I am with you”
“నీకు తోడైయున్నాను” “I am with you” అనే వాక్యం అర్థం కేవలం, ఇది కేవలం భౌతికంగా మన పక్కన ఎవరో ఉన్నట్లు చెప్పేటంత సరళమైన మాట కాదు, మనకు తాత్కాలికంగా బలమిచ్చే మాట ఆసలే కాదు. ఇది ఆత్మగా మనలో స్థిరంగా ఉండే దేవుని శాశ్వతమైన హామీ!
ఇది చాలా ఆధ్యాత్మికమైన, శక్తివంతమైన, దీవింపుతో కూడిన మాట. "నీవు ఒంటరిగా లేవు – నేను నీకు తోడైయున్నాను" “నీవు ఎక్కడికి వెళ్లినను, ఆత్మగా నీలో ముద్రించబడి నేనెప్పుడూ నీతో ఉన్నాను” – అని ఇది పరలోకపు తండ్రి నుండి మనకు వచ్చిన శాశ్వతమైన హామీ.
దేవుడు “I am with you” అని చెప్పిన ప్రతీసారి, అది ఒక జీవాన్ని బలపరిచే శక్తివంతమైన వాగ్దానం. ఇది యాకోబుతో కూడా చెప్పారు (ఆదికాండము 28:15), యెహోషువాకు భరోసా ఇచ్చారు (యెహోషువా 1:9), యిర్మియాకు ధైర్యం ఇచ్చారు (యిర్మియా 1:8). ఇప్పుడు అదే మాట మనకూ చెబుతున్నారు.
ఇది రక్షణకు హామీ. మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టను, నిన్ను రక్షించెదను కాపాడేదను అని ఈ దేవుని వాక్యం మనకు తెలియ చెబుతుంది. ఇది మన ఒంటరితనానికి దేవుని సమాధానపు వాక్కు. మనము అందరిచేత మర్చిపోయినట్టే మనకు అనిపించినా, దేవుడు మాత్రం మన వెంటే ఉన్నాడని ఈ వాక్యం మనకు తెలియ జేస్తుంది. ఇది మన బలహీనతల మధ్య మనకు ఆధారంగా నిలిచే వాక్యం. మనము భయపడకుండా ముందుకు సాగేందుకు ఇది మనకు బలాన్ని అందిస్తుంది. ఈ వాగ్దానం ఎప్పుడు మారని మార్పు చెందని దేవుని నమ్మకమైన మాట.
నేను దేవుని సేవ కొరకు ప్రతిష్టించుకున్నా ప్రారంభ దినాలలో ఎక్కువగా వర్తమానాలను,ఎలా చెప్పాలి, అని నాలో నేను తర్ఫీదు అవుతూ ఉండేదాన్ని, ఒకరోజు రాత్రి సమయంలో నేను నిద్రపోవడానికి, నా మంచం మీద పండుకున్నాను, ఆ సమయంలో ఇంటిలో నేను ఒక్కదానినే ఉన్నాను, నా తల్లి గారు ఊరు వెళ్లారు ఒక్కదానినే, భయం భయంగా అలా పండుకుంటూ నేను దేవుని వాక్యాన్ని ఎలా చెప్పాలి అన్నది, నేను ప్రిపేర్ అవుతున్నాను, నా చుట్టూ అందరూ కొంతమంది స్త్రీలు ఉన్నట్లు, వాళ్ళ మధ్యలో నేను లేచి బైబిల్ పట్టుకొని నేను వాక్యం చెబుతున్నట్లు, ఊహించుకుంటూ ప్రిపేర్ అవుతున్నాను,
అప్పుడప్పుడు బయట శబ్దాలు వినపడినప్పుడు భయపడుతూ, నేను ఆ వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నాను. నా ఊహల్లో అలా నేను నా చుట్టూ ఉన్న స్త్రీలకు వాక్యం చెబుతున్నట్లు, నేను ఊహించుకుంటూ, ఒక వాక్యానికి ఒకటి అలాగా నేను చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు, నేను చెప్పే వాక్యానికి అనుబంధంగా ఒక వాక్యం చెప్పాల్సి వచ్చింది, అది నాకు గుర్తుకు వచ్చింది,వెంటనే నేను బైబిల్ తీసి దాని రిఫరెన్స్ చూసినప్పుడు, ఆ వాక్యము ఏమిటంటే, "కీర్తనలు 34:7
యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును,"
ఈ వాక్యమును నేను చూసినప్పుడు అప్పటివరకు నేను భయపడుతున్న నాకు కలిగిన భయం అంతా ఒక్క క్షణంలో నా నుంచి దూరమైపోయింది,ఆ వాక్యం చదివిన తర్వాత ప్రశాంతంగా నేను నిద్రపోయాను,ఎటువంటి భయం లేకుండా.
“I am with you”నీకు తోడైయున్నాను” అన్న పదమునకు అర్థం ఏమిటి?
1. రక్షణకు హామీ
దేవుడు నిన్ను కాపాడుతానని చెప్పడమే. భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను అని యెహోవా అనెను. (యెషయా 41:10)
2. ఒంటరితనానికి సమాధానం
మనం ఒంటరిగా ఉన్నామని అనిపించినా సమయంలో ఈ వాక్యము, దేవుడు మనతో ఉన్నాడని ధైర్యమును ఇస్తుంది. ఇది దేవుని సన్నిధిని తెలియజేసే మాట.
3. మనకు ఆధారం అయ్యే, బలమిచ్చే వాక్యం.
కష్టాల్లోనూ, సంకటాల్లోనూ దేవుడు మన వెంటే ఉంటాడు. మనకు బలాన్ని, జ్ఞానాన్ని, మార్గ నిద్ధేర్శకతను ఇస్తాడు.
4. ప్రతిజ్ఞ, ప్రమాణము, వాగ్దానము
ఇది దేవుని శాశ్వతమైన వాగ్దానం. మనం మారిపోయినా దేవుడు మాత్రం మారడు. మన విశ్వాసాన్ని నిలబెట్టేందుకు ఇది ఒక స్థిరమైన హామీ.
ఉదా:
1. యాకోబు ప్రయాణంలో దేవుడు అనేక సంవత్సరాలు యాకోబుకు తోడుగా ఉన్నాడు,
.ఆదికాండము 28:15
ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా,
2. నాయకత్వ బాధ్యతల మధ్య భయపడకమని దేవుడు యెహోషువాకు ఇచ్చిన హామీ.
యెహోషువ 1:9 నేను నీ కాజ్ఞయిచ్చి యున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.
3. దేవుడు యిర్మియా ప్రవక్తకు తోడుగా అతనితో ఉన్నాడు. యిర్మియా 1:8
వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు.
“I am with you” అనగా –
1. నిన్ను నేను విడిచిపెట్టను
2. నీవు ఎక్కడున్నా నా దృష్టిలో ఉన్నావు
3. నీ యుద్ధాలలో నేను ఉన్నాను
4. నీ బలహీనతలో నా బలం ప్రబలుతుంది
5. నీ మౌనంలో నా మాట వినిపిస్తుంది
6. నీ కన్నీళ్ల వెనుక నా ప్రేమ ఉంది
మన జీవితంలోనికి వచ్చే ప్రతి పరిస్థితులలో,మనము ప్రారంభించినది అది ఏదైనాప్పటికిని ప్రారంభం నుండి దాని అంతం వరకు దేవుడు మనతో ఉన్నాడని,ఉంటాడని, మనము ఒంటరి వారము కాము, అన్న సత్యమును, మనం మన హృదయాలలో స్థిరపరచుకోవాలి. "నేను నీకు తోడైయున్నాను" అన్న వాగ్దానం, దేవుడు మనపట్ల నెరవేర్చే వాగ్దానమే!
ప్రార్థన
ప్రియమైన మా పరలోకపు తండ్రి మాకు తోడుగా ఉండే దేవా మీకే స్తోత్రాలు,ఈ సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం అంతము వరకు మా జీవితాలలో మేము వెళ్లే ప్రతి మార్గంలో, మా ఒంటరితనాలలో మా బలహీనతలలో, మమ్మల్ని స్థిరపరిచే మమ్మల్ని బలపరిచే దేవుడవు మీరు అయినందుకు, మాకు తోడుగా వచ్చే మా తండ్రి మీరు అయినందుకు మీ ఆత్మ ద్వారా మమ్మల్ని మాలో ఉండి నడిపిస్తూ, మాకు తోడైయున్న దేవా మీకే స్తోత్రములు.
మా ఆలోచనలో, మా మాటలలో, మా క్రియలలో ,మా సమస్త ప్రవర్తన అంతటిలో, పరిశుద్ధాత్మ దేవా మీరే అధికారిగా ఉండి, ఈ సంవత్సరం అంతటిలో, మాతో కూడా మీ ఆత్మ ద్వారా, నీ వాక్యము ద్వారా, మీ సన్నిధి ద్వారా, మాతో ఉండి మమ్మల్ని నడిపించమని, యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో, ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
17-7-2025
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓥𝓪𝓴𝔂𝓪𝓶𝓾𝓵𝓸𝓷𝓲 𝓥𝓪𝓰𝓭𝓪𝓷𝓪𝓶𝓾 𝟸𝟶𝟸𝟼 📖✨