2026 Daily Bread
praise the Lord (2-1-2026)
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓋 వాక్యములోని 𝓋 వాగ్దానము 𝟸𝟶𝟸𝟼 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
మన చేతిలో వున్నది అది ఎంత చిన్నదైనా దానిని దేవుని చేతిలో పెట్టినప్పుడు అది ఎంతో శక్తివంతమవుతుంది!
జెకర్యా 4:10
కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క యేడు నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును.
దావీదు చేతిలో రాయి చిన్నది. కానీ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్న విశ్వాసం
దేవుని యందు దావీదు వుంచినప్పుడు,దావీదు చేతిలో ఉన్న చిన్న రాయి గెలిచింది.దావీదుకు ఇశ్రాయేలు సైన్యమునకు విజయాన్ని తెచ్చింది . మీకు ఉన్నది చిన్నదిగా, తక్కువగా, పరిమితంగా అనిపించవచ్చు,– కాని అది దేవుని చేతిలో వున్నపుడు, అది దేవుని చేతిలో పడినప్పుడు, దాని విలువ అశేషమైనది అవుతుంది. అది తరిగిపోని, అంతం లేని ప్రభావాన్ని చూపుతుంది.
పరిశుద్ధ గ్రంథంలో మనము చదివితే, మోషేకు ఉన్నది, కేవలం ఒక కర్ర మాత్రమే — కానీ అది దేవుని చేతిలో ఉన్నప్పుడు సముద్రాన్ని చీల్చింది. ఆ కర్ర ఇశ్రాయేలీయులకు విమోచన మార్గాన్ని తెరిచింది, వారిని పాపపు బంధకమైన ఐగుప్తు నుండి వేరు చేసి, ప్రత్యేకమైన ప్రజలుగా నిలిపింది. ఒక సాధారణమైన కర్ర, దేవుని స్పర్శతో, శాశ్వత చరిత్రలో అద్భుతమైన గుర్తు అయింది.
మీ చేతిలో ఉన్న ఆదిచిన్నదీ,అతి కొంచమే, దాని ప్రభావం తక్కువే, దానికి ఏమాత్రం విలువ లేనిది కావచ్చు, కానీ అది దేవుని చేతిలో పడితే, దానిని మీరు దేవుని చేతికి అప్పగిస్తే,తరాలను ప్రభావితం చేసే అంత గొప్పది అవుతుంది. 🌿
ఒక చిన్న బాలుడి దగ్గర ఉన్న ఐదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే — కానీ సృష్టికర్త అయిన యేసయ్యా చేతిలో అవి వేలమందికి ఆహారముగా మారాయి , అవి ఆహారముగా మాత్రమే కాకుండా సమృద్ధిని కలిగించేటట్లు అవి మిగిలివున్నాయి.
మన దృష్టికి చిన్నదిగా అనిపించినా, దేవుని దృష్టిలో అది పరిమాణం కాదు — మన సమర్పణ మాత్రమే ప్రాముఖ్యమైనది. మీ దగ్గర ఎంత ఉందన్నది కాదు, అది ఎవరి చేతిలో ఉందన్నది ముఖ్యం. దేవునికి అప్పగించిన ప్రతి చిన్న అల్పమైనది కూడ, అది దేవుని మహిమకై ఉపయోగించబడుతుంది.
మీకు కలిగినది అల్పమైనద వెంటనే దానిని దేవునికి అప్పగించండి, మీ జీవితంలో వున్న"చిన్న రాయి" లాంటి వాటిని, దేవుడు గొప్ప విజయానికి ఉపయోగిస్తాడని మీరు నమ్మగలరా? 🌿
"నా దగ్గర ఉన్నది కూడా దేవుడు ఉపయోగించగలడు" అనే నమ్మకాన్ని విశ్వాసమును,
ఈ వాక్యం వింటున్న, చదువుతున్న, ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా కలుగజేయును గాక ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
11-8-2025
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓥𝓪𝓴𝔂𝓪𝓶𝓾𝓵𝓸𝓷𝓲 𝓥𝓪𝓰𝓭𝓪𝓷𝓪𝓶𝓾 𝟸𝟶𝟸𝟼 📖✨