CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2026 Daily Bread

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

✨📖 𝓋 వాక్యములోని 𝓋 వాగ్దానము 𝟸𝟶𝟸𝟼 📖✨

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

ఈ రోజు దేవుని వాగ్ధానం

praise the Lord { 3-1-2025 }

✨ "Be strong and courageous" (యెహోషువా 1:9)

యెహోషువ 1:9

నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును

ఈ మాట ఈ వాగ్దానము ద్వారా దేవుడు మనకు ఇచ్చే ఆహ్వానం ఇదే: "బయపడవద్దు. నీ ముందు ఉన్న పనిని ధైర్యంగా చేపట్టు. నీవు బలహీనుడు కావు — నేను నీతో ఉన్నాను!" మన లోపల ఉన్న భయాన్ని జయించు, ఆత్మబలాన్ని కలిగి ఉండు, సంశయాలను పక్కన పెట్టి విశ్వాసంతో ముందుకు సాగు ఆని

ఇది ఒక్క మానవ ధైర్యం కాదండి —

దేవుని తోడుగా రావటం ద్వార మనలో ఉత్పన్నమయ్యే ధైర్యం,దేవుని మాటపై నిలబడే ధైర్యం, ఆయన పిలుపుని ఆచరించటానికి అవసరమైన ఆత్మ బలం, ఈ వాక్యం, “I am with you” అన్న మొదటి వాగ్దానానికి ఆనుభందమైనదిగా ఉంటుంది — దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, మనము ధైర్యంగా ఉండగలము.

ఎటువంటి పరిస్థితి మన జీవితంలోకి వచ్చిన మనము ధైర్యంగా ఉండాలి,ఎందుకంటే – మనము ఒంటరి వారము కాదు,మనతో దేవుడు ఉన్నాడు కాబట్టి! మనము ఎదుర్కొంటున్న ఏపరిస్థితి ఆయిన మన శక్తికి మించి ఉందనిపించవచ్చు. మన భవిష్యత్తు స్పష్టంగా మనకు కనిపించకపోవచ్చు. కానీ దేవుడు మనకు ఒక స్పష్టమైన ఆజ్ఞ,వాగ్దానమును ఇచ్చాడు.

"నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము" "ధైర్యంగా ఉండుము, బలవంతుడవై ఉండుము!" ఈ వాక్యాన్ని చెప్పినప్పుడు యెహోషువా మోషే మరణించిన తర్వాత తాను ఒక పెద్ద బాధ్యతను భుజాలపై మోస్తున్నాడు. ఒంటరిగా అనిపించిన ఆ సమయంలో దేవుడు యెహోషువాకు ఇచ్చిన ఆ బలపరిచే మాటలు, ఈ రోజు మన కోసం కూడ ఇస్తున్నాడు.

మనము ఏమి కోల్పోయినా, మనము ఏ బాధను భరిస్తున్నా, మనకు తోడుగా ఉన్నవాడు సర్వ శక్తి కలిగిన దేవుడు. మన ప్రతి అడుగును ఆయన చెప్పినట్లు ఆయన మార్గంలో వేస్తే, మన ముందున్న ఆటంకాలు ఎంత పెద్దవైనా, మనము ఓడిపోము. ఆయన మనతో ఉన్నాడు – మనలను విడిచిపెట్టడు, మనకు ధైర్యాన్ని ఇస్తాడు.

ఒకసారి ధైర్యం చేడిన ఒక పరిస్థితిలో నేను నిలబడవలసి, వచ్చింది.నేను వెళ్తున్న ఆ పరిస్థితిని బట్టి నేను ధైర్యంగా నా స్థానంలో నేను నిలబడలేని పరిస్థితి, సామర్ధ్యం కూడ నాకు లేదు, నేను నా బాధ్యతలను బట్టి, ఇంకొకరి మీద ఆధారపడ వలసిన, ఇంకొకరిని ఆశ్రయించవలసిన పరిస్థితి అది నాది. అటువంటి సమయంలోదేవుడు నాతో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు.

" దావీదు ముందుకు ఎలుగుబంటి వచ్చినప్పుడు,తన మంద విషయంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆ ఎలుగుబంటితో పోరాడుతూ వచ్చాడు. ఆ క్రూరమృగము తనని ఏమి చేస్తుందో, అనే తన మందను వదిలి వెళ్లే భయాన్ని వదిలి, తనకున్న బాధ్యతను గుర్తించి, ధైర్యంగా ఆ ఎలుగుబంటితో పోరాడుతూ వచ్చాడు,

ఇక్కడ దావీదు చూపిన ధైర్యాన్ని, తన మంద పట్ల దావీదు చూపిన బాధ్యతను, చూసిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు దావీదును రాజుని చేశాడు, మన క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ధైర్యంగా మనము నిలబడాలి, మనకున్న బాధ్యతలను, మనకున్న స్థానమును వదిలి పారిపోకూడదు, ధైర్యంగా మనకు విరోధముగా వస్తున్న ప్రతి పరిస్థితిని, దావీదు వలె మనము ఎదిరించటానికి ధైర్యాన్ని కలిగి ఉండాలి" అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, యిది నాలో చాల ధైర్యాన్ని నింపింది,నేను ధైర్యంగా నిలబడి విజయాన్ని పొందటానికి ఈ అంశము ఈ వాక్యము నాకు చాలా సహాయపడింది.

మనము కలిగి ఉన్న బాధ్యతల పట్ల మనము నమ్మకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు,దేవుడు ఇచ్చిన వాగ్దానాలను బట్టి ఒక ధైర్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, మనకు విరోధముగా వస్తున్నా, ప్రతి పరిస్థితి మీద దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు, అంతేకాదు మన ధైర్యాన్ని చూసి దేవుడు మన బాధ్యతలను ఇంకా ఎక్కువగా విస్తరింప చేస్తాడు.

మీరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నప్పటికీని దేవుడు మీతో ఉన్నాడని నిబ్బరం కలిగి ధైర్యంగా జడయకుండా, భయపడకుండా, ముందుకు కొనసాగే కృపను ధైర్యమును శక్తిని,పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమృద్ధిగా ఇచ్చును గాక! ఆమెన్.

ఎస్తేర్ క్రైసో లైట్

18-7-2025

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

✨📖 𝓥𝓪𝓴𝔂𝓪𝓶𝓾𝓵𝓸𝓷𝓲 𝓥𝓪𝓰𝓭𝓪𝓷𝓪𝓶𝓾 𝟸𝟶𝟸𝟼 📖✨