CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2026 Daily Bread

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

✨📖 𝓋 వాక్యములోని 𝓋 వాగ్దానము 𝟸𝟶𝟸𝟼 📖✨

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

ఈ రోజు దేవుని వాగ్ధానం

praise the Lord { 4 -1-2025 }

సామెతలు 3:5

నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము.

ఇది దేవుని నుండి మనకు వచ్చే ఒక స్థిరమైన ఆహ్వానము ఒక పిలుపు – దేవునిపై పూర్తిగా ఆధారపడు. దేవుని మార్గాలను నీ మార్గాల కంటే గొప్పవిగా అంగీకరించు అనే ఒక సృష్టత.

ఈ వాక్యంలో "పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము"

అన్నది ముఖ్యంగా మనము గమనించాలి.

ఇది మన హృదయ పూర్తిగా దేవునిపై ఆధారపడుటాన్ని దేవునిపై విశ్వాసం ఉంచడానికి గూర్చి ఇది మనకు తెలియజేస్తుంది.

ప్రతికూల పరిస్థితుల్లో కూడా, దేవుడు నన్ను నడిపిస్తాడు అనే నమ్మకంతో ముందుకు సాగమనే పిలుపు ఇది.

మన జీవితం అనే ప్రయాణంలో ఎన్నో మలుపులు, , స్థిరతలేని,స్పష్టత లేని ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. ఎన్నిసార్లు మన హృదయం స్వయంగా నిర్ణయాలు తీసుకుందామనుకున్నా, చివరకు అవే మనకు భయాన్ని, కలవరమును కలిగించవచ్చు. ఎందుకంటే మనం చూసేది పరిమితమైన దృష్టితో. కానీ దేవుడు పరిపూర్ణమైన దృష్టితో మనలను ముందుకు నడిపించగలవాడు. అందుకే మనం మన హృదయములో పూర్తిస్థాయి విశ్వాసాన్ని దేవుని పైన ఉంచాలి.

యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచిన హృదయమే నిజమైన విశ్రాంతిని పొందగలదు. యెషయా 26:3

ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.

దేవుని యందు పూర్తిగా మనము విశ్వాసముంచి నప్పుడే మన హృదయం స్థిరంగా ఉంటుంది – పరిస్థితులు ఏవైనా కానీ, మన విశ్వాసమును కొలిచేది దేవుని నిజాయితీ. ఆయన మాట తప్పని వాడు. ఆయన మార్గదర్శకత్వం ఎప్పటికీ తప్పిపోదు. మన ఊహలకు మించిన మార్గాలను ఆయన తయారు చేస్తాడు.

నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము, ఇది దేవునికి పూర్తిగా హృదయాన్ని అప్పగించిన వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం!

మన జీవిత యాత్రలో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో,మన పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకం విశ్వాసము ఉంచే మంచి బుద్ధిని, పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ ఇచ్చును గాక ఆమెన్.

ఎస్తేర్ క్రైసో లైట్

19-7-2025

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

✨📖 𝓥𝓪𝓴𝔂𝓪𝓶𝓾𝓵𝓸𝓷𝓲 𝓥𝓪𝓰𝓭𝓪𝓷𝓪𝓶𝓾 𝟸𝟶𝟸𝟼 📖✨