CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2026 Daily Bread

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

✨📖 𝓋 వాక్యములోని 𝓋 వాగ్దానము 𝟸𝟶𝟸𝟼 📖✨

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

ఈ రోజు దేవుని వాగ్ధానం

{ 5 -1-2025 } praise the Lord

కీర్తనలు 46:1

దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు

"దేవుడు మనకు ఆశ్రయం, రక్షణగల స్థలము."

ఇది భయాల నుంచి, భయపడి పారిపోయే స్థలము కాదు, మనలను రక్షించడానికి బలంగా మన పక్షాన నిలబడే అడ్డుగోడ ఈ దుర్గము.

ఇది మనము దాక్కునే చోటు మాత్రమే కాదు – ఇది దేవుని సన్నిధిలో ఉండే,మనము అనుభవించే ఒకస్థిరమైన భద్రత,మనలను రక్షించే మన రక్షణ స్థలం.

"నేను నీకు బలముగానూ, సురక్షిత గుడారముగానూ ఉన్నాను" ఇది శ్రమలను మనము అనుభవిస్తున్న సమయంలో మనకు వినిపించే, మన ఆత్మకు స్పష్టంగా వినిపించే ఒక బలమైన ధ్వని. శ్రమల మధ్య మనం స్వయంగా గ్రహించే ఆంతరంగిక ధైర్యం, దేవుని బలమైన హస్తము యొక్క గుర్తింపు, మన ఆత్మకు వినిపించే దేవుని స్వరము — ఆ స్వరములోనే మనకు ఉన్న ఆశ్రయ ప్రదేశము, ఆయన సురక్షితమైన గుడారం."

ఇది “దేవుడు మన చుట్టూ ఉన్నాడు” అనే నిజాన్ని,మనకు కలిగే ప్రతి ఒత్తిడిలో,మన హృదయానికి మన మనస్సుకు జ్ఞాపకం చేసే వాక్యం.

ఎడారి వాతావరణం ఎంత భయానకముగా మారినా, కొండలు కదిలిపోయినంత భూకంపాలు,గందరగోళం వచ్చినా,ఈ భూమి మీద మనము బ్రతకలేనంత ఎటువంటి అస్తిరత మనకు వచ్చిన,మన దేవుడు తన ప్రజలకోసం రక్షణగా నిలబడే ఒక కోట లాంటి వాడు! మానవుడు ఇవ్వలేని శాంతిని, ప్రపంచం అందించలేని రక్షణను, దేవుడు తన ప్రజలకు ఇస్తాడు. రక్షణ అనేది ఒక చోటు,ఒక ప్రదేశము కాదు, – అది ఒక వ్యక్తి: ఆదే మన దేవుడు! ఏ బలమైన శత్రువు ఎలాగైనా ఎదురు వచ్చినా, దేవునికి అడ్డుగా ఏదీ నిలబడలేదు.

నేడు మన జీవితంలో అనేక మైన కలవరాలు ఉన్నాయి! మనలను భయపెట్టే వార్తలు, ఆర్థిక ఒడిదుడుకులు, ఆనరోగ్య విషయాలు ఉన్నాయి ! వాటినన్నిటిలోనూ మనము ఒంటరిగా లేము.మనతో దేవుడు ఉన్నాడు దేవుడు మనలను దాచే ఒక సురక్షితమైన గుహ, వనలను రక్షించడానికి మన చుట్టు వుండే కోట, దేవుడు మన కోసం నిలబడే యోధుడు.

మన జీవితంలో జరిగే ఆత్మీయమైన లేదా జీవనపరమైన పడి పోయిన పరిస్థితులు,పడి పోయిన అనుభవాలు, మన విఫలతలు, దేవుని నుండి దూరమైన దశలు,ఆత్మీయ పరాజయాలు, మన భయాలు మన అనుచిత నిర్ణయాలకు,…సమాధానము జవాబు దేవుని సన్నిధే ఆశ్రయం.మన బలహీనతను మనము అంగీకరించిన చోట, దేవుడు తన బలాన్ని తెలియజేస్తాడు.

శ్రమల మధ్య మనకు వినిపించే ఆత్మీయమైన దేవుని స్వరమే మనకు నిజమైన సురక్షితమైన ఆశ్రయం. ఆ స్వరం మన హృదయాన్ని బలపరుస్తుంది, మన మనస్సుకు అపూర్వమైన శాంతిని సమాధానమును అందిస్తుంది. అదే స్వరం, దేవుడు మనలను దాచిపెట్టే స్థలమని ఆ స్వరమే దేవుడు అనే గుర్తింపును మనకు గుర్తుచేస్తుంది."

మన జీవితాలలో ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ సర్వశక్తుడైన, మన కాశ్రయం,మన రక్షణ స్థలం అయినటువంటి,మన ఆశ్రయదుర్గమైన దేవునిలో మనకు ఆదరణ ఓదార్పు విజయం,పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ ఇచ్చును గాక ఆమెన్.

ఎస్తేర్ క్రైసో లైట్

19-7-2025

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

✨📖 𝓥𝓪𝓴𝔂𝓪𝓶𝓾𝓵𝓸𝓷𝓲 𝓥𝓪𝓰𝓭𝓪𝓷𝓪𝓶𝓾 𝟸𝟶𝟸𝟼 📖✨