2026 Daily Bread
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓋 వాక్యములోని 𝓋 వాగ్దానము 𝟸𝟶𝟸𝟼 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
praise the Lord { 7-1-2026 }
"You are not alone" "నీవు ఒంటరిగా లేవు"
యెషయా 41:10
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.
మన జీవిత యాత్రలో మనం ఎదుర్కొంటున్న అనేక పోరాటాలు మనల్ని ఒంటరితనమునకు
ఆప్పగించవచ్చు. కొన్నిసార్లు మన పరిస్థితులను అర్థం చేసుకునే ఆత్మీయులు,ఎవరు కూడా,మన పక్కన ఉండకపోవచ్చు,
మన పరిస్థితులను,మన బాధలను చెప్పుకోవడానికి,మన హృదయములో ఉన్న బాధను పంచుకోవడానికి, మన ఆత్మీయతను ఆత్మ సంబంధమైన విషయాలను మాట్లాడు కోవటానికి,చర్చించుకోవడానికి, దానికి తగిన ఆత్మీయ స్థితిని కలిగిన వ్యక్తులు లేని ఒంటరితనాన్ని మనము కలిగి ఉండవచ్చు,
మనము అనుభవిస్తున్నా, ఒంటరితనం ఆది ఎటు వంటిది అయిన, అది ఏ రూపంలో మనకు ఎదురైనా,You are not alone" "నీవు ఒంటరిగా లేవు"అన్న వాక్యమును ఈ వాక్యములోని వాగ్దానమును మనము ఆశ్రయిద్దాం.
మన బాధలు,మన బాధ్యతలు ఎవరికీ కనిపించడం లేదు,ఎవరూ పట్టించుకోవటం లేదు అనే బాధ మన మనస్సులో, మన హృదయాలలో ఉండవచ్చు. కానీ, ఈ వాగ్దానం మనకు స్పష్టమైన ఒక ఆశను ఒక విశ్వాసమను,ఒక ధైర్యమును దేవుని పట్ల మనకు కలిగిస్తుంది – దేవుడు మనతో ఉన్నాడు.
మన భయాల్లోనూ, బలహీనతల్లోనూ, ఒంటరితనంలోనూ ఆయన సన్నిధి మనతో ఉంది. ఆయన మన చేతిని బలపరచుతూ, వాక్యము అనే, దీపముగా మన పాదాలకు దారిని చూపుతూ, మనలను దేవుడు ముందుకు నడిపిస్తారు. ఈ దేవుని వాగ్దానమును మనము విశ్వసిద్దాం.
ఈ సంవత్సరం, ప్రస్తుత పరిస్థితులలో మీకు ఎదురవుతున్నా, ఎటువంటి ఏ ఒంటరితనపు క్షణా మయినా...నీవు ఒంటరిగా లేవు "You are not alone" అని దేవుడు స్వయంగా తన వాక్యము ద్వారా మీకు చెబుతున్నారు.
సర్వశక్తిగల దేవుడు, సమస్తాన్ని జయించిన దేవుడు, లోకములో ఉన్న వానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని నిరూపించడానికి, మీకు శక్తినివ్వటానికి, మీకు జయాన్ని ఇవ్వటానికి, తన ఆత్మ రూపంలో మీలో నివసిస్తూ, మీకు సహాయముగా, మీకు తోడుగా, ఉన్నప్పుడు మీరు ఓడిపోరు. మీరు వెళ్తున్న ఒంటరి మార్గంలో నుండి మీరు అనుభవిస్తున్న,ఒంటరి లాంటి స్థితిలో నుండి మీరు బయటపడతారు, మీరు విజయాన్ని పొందుతారు,ఈరోజు ఈ వాక్యంలోని వాగ్దానమును మీరు విశ్వసించగలరా !
ప్రార్థన:
ప్రియమైన మా పరలోకపు తండ్రి,మా స్తుతులకు పాత్రుడవయిన దేవా,మా కొరకు మా ఒంటరితనాన్ని తొలగించుట కొరకు మీరు సిలువలో ఒంటరిగా మీ ప్రాణాన్ని అర్పించి,మీ ఆత్మను మాలో ఉంచి,మాకు తోడుగా మీరు ఉండి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి
ప్రభువా, నేను ఒంటరిగా ఉన్నానని అనిపించిన క్షణాల్లో మీరు నా పక్కన ఉన్నావు,అన్న నిరీక్షణను మీ వాగ్దానం ద్వారా నాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రాలు దేవా!
నేను ఒంటరిగా లేను. మీరు నాకు తోడుగా ఉన్నారు అన్న విశ్వాసంతో ధైర్యంతో ఎటువంటి పరిస్థితులు నాకు వచ్చినప్పటికీ మీ సహాయంతో మీ శక్తితో మీ ప్రేమతో ధైర్యముగా వాటిని ఎదుర్కోవటానికి,మీ వాక్కును మీ వాగ్దానం నాకు ఇచ్చి నడిపిస్తున్నందుకు, నా ఆదరణ కర్తవైన మిమ్మల్ని స్తుతిస్తు, క్రీస్తు యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఎస్తేర్ క్రైసోలైట్
12-8-2025
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓥𝓪𝓴𝔂𝓪𝓶𝓾𝓵𝓸𝓷𝓲 𝓥𝓪𝓰𝓭𝓪𝓷𝓪𝓶𝓾 𝟸𝟶𝟸𝟼 📖✨