CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Prayer

🌿🙏💖

ప్రార్థన

కీర్తనలు 18:28

నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును

🙏 ప్రార్థన

ప్రియమైన మా పరలోకపు తండ్రి యెహోవా నా దేవా,

మీరే నా సృష్టికర్తవు, సూర్యునకు వెలుగు ఇచ్చిన ఇస్తున్న ఇవ్వబోతున్న వాడవు మీరే దేవా, మా ఆత్మలో, మా మనసులో వున్న చీకటిని పారద్రోలే వెలుగు మీరే. దేవా, నా జీవితం ఎన్నో సందర్భాలలో గందరగోళానికి, చీకటిలాంటి పరిస్థితులకు, ధైర్యం చెడి భయాల మధ్య చిక్కుకుపోయిన, చిక్కుకుపోతున్న, చిక్కుల్లో పడబోతున్న వేళ, మీరు నా దీపము వెలిగించువాడవని, సమస్యలనే నా మార్గంలో మీ వాక్యమే నాకు వెలుగుగా ఉందని, ఉందంటూ ఉండబోతోందని నాకు మీ వాక్యము ద్వారా మీరు ఇచ్చిన నమ్మకాన్ని నేను విశ్వసిస్తున్నాను దేవా.

కీర్తనలు 119:105 లో వున్న

(నూన్‌) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. అన్న వాగ్దానమును నేను నా హృదయమును ద్రుడముగా విశ్వసిస్తున్నాను దేవా, నా మార్గములను మీరే సరిచేసి, నన్ను మీ వెలుగులో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాకు ఏటువంటి మార్గం తెలియక పోయిన పరిస్థితులలో నేను ఉన్నప్పుడు, వెలుగైయున్న మీ వాక్యము చేత మీరు నన్ను పట్టుకోండి. నా ఆలోచనలు, సంకల్పాలు మీ చిత్తానికి లోబడినవిగా మారునట్లు పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించండి.

కీర్తనలు 27:1లో వున్నట్లు

యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?అనే స్థిరమైన విశ్వాసంతో నా హృదయం నిశ్చలముగా, ధైర్యముగా ఉండునట్లు చేయండి,

నాలో భయాన్ని తీసివేసి ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపండి.

యెహోవా నా దేవా, నా చుట్టూ ఉన్న చీకటి దారులను మీరు ఆపి, మీ వాక్యపు వెలుగుతో నన్ను, మీ కృపకు, రక్షణకు దారిచూపే మార్గంలో నడిపించండి. నా ప్రతి సమస్యలో, నా ప్రతి శ్రమలో, మీరు వెలుగై నా ముందు నడిచిన మీ వాక్యపు వెలుగును నా ప్రతి అనుభవంలో నాకు కలుగ జేయండి. మీరు నాకు సూర్యునిగా, కేడెముగా నిలిచి, నా మీద మీ కృప యొక్క కవచాన్ని ఏర్పాటు చేసి, శత్రువుల చీకటి దారులలో నుండి నన్ను విడగొట్టి నాకు రక్షణకవచముగా నిలవమని మిమ్ములను వేడుకుంటున్నాను.

ఈ దినము నుండి నా ఆత్మ మీ వాక్యపు వెలుగులో మాత్రమే నడవాలని, నన్ను చూసిన వారుకూడా మీ వెలుగులో నడవడానికి పురికోల్ప బడునట్లు నన్ను దీవించండి, మీ వాక్యమే నా దీపముగా, వెలుగుగా ఉండాలని మిమ్ములను ప్రార్థిస్తున్నాను.

ఈ ప్రార్థనను యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున అడుగుచున్నాను తండ్రీ,

ఆమేన్ ఆమేన్ ఆమేన్.

ఎస్తేర్ క్రైసోల్తెట్

24-6-2025

💖 🙏 🍀

🌿🙏💖

ప్రార్థన

కీర్తనలు 18:28

నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును

🙏 ప్రార్థన

ప్రియమైన మా పరలోకపు తండ్రి యెహోవా నా దేవా, మీరే నా సృష్టికర్తవు, సూర్యునకు వెలుగు ఇచ్చిన ఇస్తున్న ఇవ్వబోతున్న వాడవు మీరే దేవా, మా ఆత్మలో, మా మనసులో వున్న చీకటిని పారద్రోలే వెలుగు మీరే. దేవా, నా జీవితం ఎన్నో సందర్భాలలో గందరగోళానికి, చీకటిలాంటి పరిస్థితులకు, ధైర్యం చెడి భయాల మధ్య చిక్కుకుపోయిన, చిక్కుకుపోతున్న, చిక్కుల్లో పడబోతున్న వేళ, మీరు నా దీపము వెలిగించువాడవని, సమస్యలనే నా మార్గంలో మీ వాక్యమే నాకు వెలుగుగా ఉందని, ఉందంటూ ఉండబోతోందని నాకు మీ వాక్యము ద్వారా మీరు ఇచ్చిన నమ్మకాన్ని నేను విశ్వసిస్తున్నాను దేవా.

కీర్తనలు 119:105 లో వున్న (నూన్‌) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. అన్న వాగ్దానమును నేను నా హృదయమును ద్రుడముగా విశ్వసిస్తున్నాను దేవా, నా మార్గములను మీరే సరిచేసి, నన్ను మీ వెలుగులో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాకు ఏటువంటి మార్గం తెలియక పోయిన పరిస్థితులలో నేను ఉన్నప్పుడు, వెలుగైయున్న మీ వాక్యము చేత మీరు నన్ను పట్టుకోండి. నా ఆలోచనలు, సంకల్పాలు మీ చిత్తానికి లోబడినవిగా మారునట్లు పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించండి.

కీర్తనలు 27:1లో వున్నట్లు యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?అనే స్థిరమైన విశ్వాసంతో నా హృదయం నిశ్చలముగా, ధైర్యముగా ఉండునట్లు చేయండి, నాలో భయాన్ని తీసివేసి ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపండి.

యెహోవా నా దేవా, నా చుట్టూ ఉన్న చీకటి దారులను మీరు ఆపి, మీ వాక్యపు వెలుగుతో నన్ను, మీ కృపకు, రక్షణకు దారిచూపే మార్గంలో నడిపించండి. నా ప్రతి సమస్యలో, నా ప్రతి శ్రమలో, మీరు వెలుగై నా ముందు నడిచిన మీ వాక్యపు వెలుగును నా ప్రతి అనుభవంలో నాకు కలుగ జేయండి. మీరు నాకు సూర్యునిగా, కేడెముగా నిలిచి, నా మీద మీ కృప యొక్క కవచాన్ని ఏర్పాటు చేసి, శత్రువుల చీకటి దారులలో నుండి నన్ను విడగొట్టి నాకు రక్షణకవచముగా నిలవమని మిమ్ములను వేడుకుంటున్నాను.

ఈ దినము నుండి నా ఆత్మ మీ వాక్యపు వెలుగులో మాత్రమే నడవాలని, నన్ను చూసిన వారుకూడా మీ వెలుగులో నడవడానికి పురికోల్ప బడునట్లు నన్ను దీవించండి, మీ వాక్యమే నా దీపముగా, వెలుగుగా ఉండాలని మిమ్ములను ప్రార్థిస్తున్నాను.

ఈ ప్రార్థనను యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున అడుగుచున్నాను తండ్రీ,

ఆమేన్ ఆమేన్ ఆమేన్.

ఎస్తేర్ క్రైసోల్తెట్

24-6-2025

💖 🙏 🍀

Written By: Sis.Esther Chrysolyte

Written On: 2-6-25