Prayer
🌿 🙏 💟
కీర్తనలు 37:23
ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును.
🌿 ప్రార్థన 🙏
ప్రియమైన మా పరలోక తండ్రి నా నడతను స్థిరపరిచే దేవా, నా ప్రవర్తనను చూసి ఆనందించే ప్రభువా,మీకు స్తోత్రాలు చెల్లించు కుంటున్నాను,
మీరు నన్ను మీ దయ కృపచేత ఎన్నుకొని, నా జీవితములో నాకు అనేక బాధ్యతలను ఇచ్చారు. మీరు ఇచ్చిన స్థానములను, విధులను నేను నమ్మకంగా నిర్వర్తించేందుకు నాకు బలమును, జ్ఞానమును, వినయమును దయచేయండి.
యూదా ఈస్కరియోతు లాగా, నిర్లక్ష్యం చేసి నా స్థానాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించే హృదయాన్ని నాకు ప్రసాదించండి.
నా పరిచర్యలో, నా కుటుంబంలో, సామాజముగా వ్యక్తిగతముగా నా బాధ్యతల్లో నన్ను నమ్మకమైన వ్యక్తిగా నేను ఉండునట్లు నా పట్ల మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాను దేవా. నా శరీరముతో, నా ఆలోచనలతో, నా జీవన విధానముతో నిత్యము మీకు మహిమ తెచ్చునట్లు కృపనిచ్చే దేవా!
మీ వాక్యాన్ని చదివి గ్రహించే హృదయాన్ని, ఆ వాక్యాన్ని జీవితం లో అన్వయించే జ్ఞానాన్ని నాకు ఇవ్వమని ప్రార్థిస్తు యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్
ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
25-6-2025
💖 🙏 🍀

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25