CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Prayer

🌿 🙏 💟

ద్వితియోపదేశకాండము 3:22

​మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధముచేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని.

🙏 ప్రార్థన 🙏

ప్రియమైన మా పరలోకపు తండ్రీ,

మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను బట్టి, మీ నమ్మకత్వంను భట్టి, మీరు మమ్ములను సంరక్షించే విధానమును బట్టి మేము మీకు కృతజ్ఞత స్తుత్తులు చెల్లిస్తున్నాము. దేవా ! మోషే కాలంలో, మీరు అమోరీయుల రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగును ఓడించినట్లు, నేడు మా జీవితాల్లోనికి వచ్చే శత్రువులను, ఆటంకాలను, సమస్యలను సంక్షోభాలను మీ శక్తితో తొలగించగలిగే దేవుడవని మేము మిమ్ములను నమ్ముతున్నాము దేవా !

ప్రభువా, మా జీవితాల్లోని సీహోనులు, ఓగులు అనే—ఆర్థిక సమస్యలు, ఆనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కష్టాలు, భయాలు, మేము ఎదుర్కొంటున్న అన్ని ఆటంకములను మీ చేతులకు అప్పగించుచున్నాము. మేము వీటన్నిటితో స్వయంగా యుద్ధం చేయలేము, దేవా ! కానీ మా కోసం మీరు యుద్ధం చేస్తున్న దేవుడని మేము నమ్ముతున్నాము.

యెహోవా నామం మహోన్నతమైనది! మాకు శత్రువులుగా ఎదురుగా వచ్చిన అన్ని పరిస్థితులను మీరు మా ముందే ఓడిస్తారని మేము విశ్వసిస్తున్నాము. మేము భయపడకుండా, మీ మాటను నమ్మి, ముందుకు సాగగలిగే ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి.

ఈ ప్రార్థనను విశ్వాసంతో యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.

ఆమేన్! ఆమెన్ ఆమెన్.

ఎస్తేర్ క్రైసోలైట్

24-3-3025

💖 🙏 🍀

Written By: Sis.Esther Chrysolyte

Written On: 2-6-25