Prayer
🌿 🙏 💟
🌿 ద్వితియోపదేశకాండము 5:33
కాబట్టి మీరు కుడికే గాని యెడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్తపడవ లెను. మీరు స్వాధీన పరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలుకలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గము లన్నిటిలో నడుచు కొనవలెను.
🙏 ప్రార్థన 🙏
ప్రియమైన మా పరలోకపు తండ్రి,
మీ వాక్యంతో మాతో మాట్లాడుతున్నా దేవా ! మోయాబు సరిహద్దులో నిలబడి, మోషే ఇచ్చిన ఆజ్ఞలను మీ ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎలా గైకొనలో నేర్చుకున్నట్లు, మా జీవిత ప్రయాణంలో కూడ మేము మిమ్ములను మీ ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుని వాటిని స్వీకరించే హృదయం గలవారముగా మేము ఉండునట్లు మమ్మల్ని సిద్ధ పరచండి దేవా !
గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, మిమ్ములను మీ ఆజ్ఞలను మరవకుండా, మీ మార్గాలల్లో నడవడానికి మమ్మల్ని ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి.
వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందు ఇశ్రాయేలు ప్రజలు మీ మాటను మీ ఉపదేశాలను వినినట్లు, మా జీవితములో మేము తీసుకోనే నిర్ణయాల్లో కూడా మేము మీ వాక్యాన్ని అనుసరించేందుకు సహాయము చేయండి.
మా ప్రయాణలలో మీ ఉపదేశాల ద్వారా మాకు ఆలోచన నిచ్చి మేము నడవవలసిన మార్గమును చూపే మీరే మా వెలుగై యున్నారు దేవా !
మేము మీ ఆజ్ఞలను పాటించే వారముగా మీ పరిశుద్ధమైన ఆశీర్వాదాలను మొము పొందే వారముగా మా అందరి హృదయాలను సిద్ధం చేయమని యేసు క్రీస్తు ప్రభు వారి శేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము, తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్.
ఎస్తేర్ క్రైసోలైట్
24-3-2025
💖 🙏 🍀

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25